యూట్యూబ్ న‌యా ఫీచ‌ర్..!

nexus2cee_youtube-share-728x408
Spread the love

ఇప్పటి వరకు ఏదైనా యూట్యూబ్‌ వీడియో మనకు నచ్చి దాన్ని ఇతరులకు పంపించాలనుకుంటే వేరే సామాజిక మాధ్యమాలను వినియోగించాల్సి వచ్చేది. దాని గురించి చర్చించాలనుకున్నా వేరే యాప్‌పైనే ఆధారపడాల్సి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూట్యూబ్‌ తమ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లోనే ఇతరులతో వీడియోలను పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇది వరకు కెనడాలో దీన్ని విడుదల చేయగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
గతేడాది నుంచే దీన్ని పరిశీలిస్తున్నామని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పలు మార్పులు చేర్పులూ చేశామని యూట్యూబ్‌ పేర్కొంది. ఇకపై యూట్యూబ్‌ వీడియోలను నేరుగా మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో యూట్యూబ్‌ యాప్‌లోనే పంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు ఆ వీడియో గురించి యాప్‌లోనే చర్చించుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందులా వీడియోలను ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకునే వెసులుబాటూ ఉంది. త్వరలో అందించే అప్‌డేట్‌ ద్వారా ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకు మరికొన్ని రోజలు వేచి చూడాల్సి ఉంటుంది.


Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *