Main Menu

వాట్సాప్ లో నయా ఫీచర్…

Spread the love

ఫేస్‌బుక్‌ యాజమాన్యంలో ఉన్న ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను అమలులోకి తెస్తున్నది. అండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్‌లలో పనిచేసేవిధంగా దీనిని రూపొందించారు. ఇటీవలకాలంలో ఫేస్‌బుక్‌లో పోస్టింగులపై ఎన్నో విమర్శలు వెలువడుతున్నాయి. గ్రూపు సభ్యులలో కొందరు నిజానిజాలు సరి చూసుకోకుండా పోస్టింగ్‌లు పెడుతున్నారు. మరికొందరు వ్యక్తులను కించపరిచే విధంగా, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేవిధంగా, వారి స్వేచ్ఛను హరించేవిధంగా ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు పోస్టు చేయడం జరుగుతున్నది.

ఈ సందర్భాల్లో గ్రూపు అడ్మిన్‌లకు సమస్యలు ఎదురవుతున్నాయి. సంబంధిత గ్రూపులో పోస్టింగులపై సమస్యలు వచ్చినప్పుడు గ్రూపు అడ్మిన్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని గ్రూపులలో ప్రధాన అడ్మిన్‌తోపాటు అనేకమంది నిర్ణీత అడ్మిన్‌లు కూడా ఉంటారు. ఈ మొత్తం పరిస్థితులు పరిశీలించిన వాట్సప్‌ 2.18.132 అనే వర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఈ వర్షన్‌ వాట్సప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.

దీని ప్రకారం గ్రూపు సభ్యులు గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేనిదే మెసేజ్‌లను షేర్‌ చేసుకోవడానికి వీలుకాదు. కేవలం వాటిని చదువుకోవడానికి, చూడటానికి మాత్రమే వీలవుతుంది. గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు షేర్‌ చేసుకోవడానికి వీలవుతుంది. వాట్సప్‌ను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది వాడుతున్నారు. 10 దేశీయ భాషలతో సహా మొత్తం 50 భాషలలో వాట్సప్‌ అందుబాటులో ఉంది.






Related News

ఇక వాట్సాప్ లో టైప్ తో ప‌నిలేదు..!

Spread the loveవాట్సాప్ లో న‌యా ఫీచర్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక వాట్సాప్ లో పలికితేRead More

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *