Main Menu

వాట్సాప్ మెస్సేజ్‌ల నిర్ధారణకు యాప్..!

Spread the love

వాట్సాప్‌లో వాస్తవమైన పోస్టుల కన్నా, అవాస్తవాలతో కూడిన పోస్టులే ఎక్కువ ప్రచారంలో ఉంటున్నాయని నిపుణలు పేర్కొంటున్నారు. దీనికి విరుగుడు తాము కనిపెట్టామని ప్రకటించారు ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి-డి)కి చెందిన విద్యార్థుల బృందం. వాట్సాప్‌లో వచ్చే టెక్స్ట్‌మెస్సేజ్‌లు, ఇమేజ్‌లు అసలైనవా, నకిలీవా నిర్ధారించే యాప్‌ను ఈ విద్యార్థుల బృందం కనిపెట్టింది. అయితే ఈ యాప్ రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న పొన్నురంగం కుమారగురు తెలిపారు. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న అవాస్తవ వార్తలతో జరుగుతున్న దుష్పరిణామాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్టల్రోని రాణిపండ గ్రామంలో పిల్లలను అపహరిస్తున్నారన్న నెపంతో కొందరు మూకుమ్మడిగా దాడి చేసి ఐదుగురిని హతమార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే ఇటీవల బీదర్‌లో ఒక మూక కొందరిపై జరిపిన అకారణ దాడి వల్ల ఒకరు మృతి చెందారని ఆయన చెప్పారు. ఇలాంటి సంఘటనలు వాట్సాప్‌లో సృష్టిస్తున్న అవాస్తవ ప్రచారం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.

వాట్సాప్‌లో వస్తున్న వార్తలలో నిజానిజాలను తెలుసుకోకుండానే కొన్ని మూకలు ఇలాంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టడానికి తాము ఒక యాప్‌ను రూపొందించామని ఆయన తెలిపారు. ఎవరైనా తమకు వచ్చిన వాట్సాప్ మెస్సేజ్ నిజమా కాదా అన్న అనుమానం వస్తే వారు 935432570 నెంబర్‌కు దానిని పంపాలని ఆయన కోరారు. తాము ఆ మెస్సేజ్‌ను తాము కనుగొన్న యాప్ ద్వారా విశే్లషించి ‘కలర్ ఇండికేషన్’తో తిరిగి దానిని పంపిస్తామని చెప్పారు. ఒకవేళ వచ్చిన మెస్సేజ్‌లో ఆకుపచ్చ రంగు ఉంటే అది నిజమైనదేనని, పసుపు రంగు ఉంటే అందులోని కంటెంట్‌ను డీకోడ్ చేయలేకపోయామని, ఎరుపు రంగు ఉంటే అది కచ్చితంగా తప్పుడు సమాచారంతో కూడుకున్నదని నిర్ధారించుకోవచ్చునని ఆయన వివరించారు.






Related News

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the loveఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *