జియో డెలివరీ లేట్ ..!

reliance-jio
Spread the love

జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే…
రిలయన్స్‌ జియో ఫోన్‌ ఆలస్యమయ్యే వార్త నిజమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆగస్టు 24 ప్రారంభమైన ఈ ఫోన్‌ బుకింగ్స్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఫోన్ల డెలివరీ మరికొంతకాలం పాటు పట్టవచ్చని రిపోర్టులు వెలువడుతున్నాయి.. ఆగస్టు 24వ తేదీని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో బుకింగ్స్‌కు వచ్చిన ఈ ఫోన్‌కు అరవై లక్షలకు పైగా ప్రీబుకింగ్స్‌ వచ్చాయని తెలిసింది. ప్రీబుకింగ్స్‌ మరింత వెల్లువెత్తుతుండటంతో, ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేక కంపెనీ వాటిని నిలిపివేసింది కూడా. కేవలం వినియోగదారుల ఆసక్తిని మాత్రమే ప్రస్తుతం నమోదుచేసుకుంటుంది. ఈ అనూహ్య స్పందనతో జియోఫోన్‌ డెలివరీని నవరాత్రి పండుగ నుంచి ప్రారంభమవుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని కస్టమర్లకే ఈ డెలివరీ తేదీలు సెప్టెంబర్‌ 25గా కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్లే చెప్పారు. సెప్టెంబర్‌ 24 తేదీల్లో స్టోర్లలోకి ఈ ఫోన్లు వస్తాయంటూ రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మినీ స్టోర్‌ ప్రతినిధులు తెలిపారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌డ్‌ బేసిస్‌లో ఈ ఫోన్‌ను అందించనున్నారు. నగరాల్లో అందుబాటు కూడా భిన్నమైన తేదీల్లో రానున్నాయి. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్‌ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది.


Related News

gionee phone

జియోనీ నయా ఫోన్

Spread the loveమార్కెట్లో నయా స్మార్ట్ ఫోన్ వస్తోంది. జియోనీ అప్ గ్రేడెడ్ మోడల్ ని రంగంలోకి తెస్తోంది. జియోనీRead More

bank

బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా

Spread the love ప్రత్యక్ష బ్యాంక్‌ సేవలకు ప్రత్యామ్నాయంగా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగంలోకి వస్తున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలపైRead More

 • వాట్సాప్ లోనూ దాచుకోవచ్చు..!
 • జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్
 • మైక్రోమ్యాక్స్ న‌యా మొబైల్
 • గూగుల్ గూటికి మరో కంపెనీ
 • వాట్సాప్, ఎఫ్ బీలకు సుప్రీం షాక్
 • జియో డెలివరీ లేట్ ..!
 • యూ ట్యూబ్ కి కొత్త అందాలు
 • శాంసంగ్ మొబైల్ ధరల తగ్గింపు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *