జియో బుకింగ్స్ అప్ప‌టి నుంచే..!

mukesh ambani jio reliance
Spread the love

సంచలన రిలయన్స్‌ జియో ఉచిత ఫోన్‌ కోసం ప్రీ బుకింగ్స్‌ త్వరలోనే మొదలుకానున్నాయి. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్‌ (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) కానున్నాయి. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సెర్వ్‌ కింద సెప్టెంబరులో ఈ జియో ఫోన్‌ వినియోగదారుల చేతికి రానుంది. ఇందుకు మరో మూడు రోజుల్లో జియోఫోన్ టెస్టింగ్‌ ప్రారంభం కానుంది.

‘ఇండియా కా స్మార్ట్‌ఫోన్’ గా జియో చెప్పుకుంటున్న ఈ 4 జీ వీవోఎల్‌టీఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌ ఆగస్టు 15 నుంచి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను కూడా కంపెనీ వెల్లడించింది కూడా. మరోవైపు వారానికి 50 లక్షల ఫోన్లను విక్రయించాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే జియో ఫీచర్‌ ఫోన మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాతగానీ ఈ ప్రభావాన్ని అంచనావేయలేమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా జూలై 21 న రిలయన్స్ ఎజీఎంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఆగస్టు 15 నాటికి ఈ పరికరం పరీక్ష కోసం అందుబాటులో ఉంటుందని కంపెనీ వాగ్ధానం చేసింది. అలాగే జియో కస్టమర్లకు ఇది పూర్తిగా ఉచితమని ప్రకటించారు. అయితేమ సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.1500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. దీన్ని మూడు సంవత్సరాల పూర్తిగా రిఫండ్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Related News

whatsapp-58af94265f9b586046b51b6e

వాట్సాప్ లో నయా ఫీచర్…

Spread the loveఫేస్‌బుక్‌ యాజమాన్యంలో ఉన్న ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను అమలులోకి తెస్తున్నది. అండ్రాయిడ్‌,Read More

whatsapp ceo john coum

వాట్సాప్ నుంచి వైదొలిగారు…

Spread the loveసోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ జాన్‌ కౌమ్‌ తన పదవీకిRead More

 • క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫేస్ బుక్
 • ప‌డిపోయిన ఫేస్ బుక్ వాల్యూ
 • వాట్సాప్‌లో ఇక కుద‌ర‌దు..
 • వాట్సాప్ లో వచ్చేసింది…
 • స్మార్ట్ ఫోన్ లో అవి చూశారంటే…
 • వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్
 • వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి
 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *