గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..

pixel-phones.0
Spread the love

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ బ్రాండ్‌ నుంచి పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ ఫోన్లను విపణిలోకి విడుదల చేయగా.. తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌లను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ తొలివార్షికోత్సవం సందర్భంగా ఈ కొత్తఫోన్లను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ ఓరియో లేటెస్ట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రూపొందించిన ఈ ఫోన్లు త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి.

భారత్‌లో ధరలు ఇలా..

ఇటీవలే దేశీయ విపణిలో ఐఫోన్‌ 8, 8ప్లస్‌, సామ్‌సంగ్‌ నోట్‌ 8 విడుదలయ్యాయి. వీటికి దీటుగా గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్‌ 26 నుంచి ఈ ఫోన్ల ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 1 నుంచి పిక్సెల్‌ 2, నవంబర్‌ 15 నుంచి పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ విక్రయాలు చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. పిక్సెల్‌ 2 ఫోన్‌ ధరలు రూ. 61,000(64జీబీ వేరియంట్‌), రూ. 70,000(128 జీబీ వేరియంట్‌)గా ఉండనున్నాయి. ఇక పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధరలు రూ.73,000(64జీబీ వేరియంట్‌), రూ. 82,000(128జీబీ వేరియంట్‌)గా ఉండనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు
6 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం


Related News

google-logo-wordmark-2015-1920-800x450

మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..

Spread the loveమొబైల్‌ వినియోగ దారులు తమ డేటా యూసేజ్‌ను ట్రాక్‌ చేసుకొంటూ నియంత్రించేందుకు వీలుగా ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థRead More

youtube go

యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్

Spread the loveయూట్యూబ్ వీడియోలను వీక్షించే వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. ‘యూట్యూబ్ గో’ పేరుతో లైట్ వెయిట్ వెర్షన్Read More

 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • వాట్సాప్ లో నయా ఫీచర్
 • BSNL చౌక ఫోన్‌ సిద్ధం
 • ఐ ఫోన్ 7వేలకే..
 • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
 • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *