Main Menu

వాట్సాప్‌లో ఇక కుద‌ర‌దు..

whatsapp_660_040616073136_022117040034_022517103508_102717112755
Spread the love

వాట్సాప్ లో పోస్టులు ఫార్వ‌ర్డ్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారా…కొన్ని స్పామ్ పోస్టులు కూడా ఫార్వ‌ర్డ్ అవుతున్నాయా…ఇలాంటి స్పామ్ మెసేజ్ ల‌తో ఊద‌ర‌గొట్టే వారితో విసిగిపోయారా..అయితే ఇక నుంచి కొంత రిలీఫ్ ఖాయం. తాజాగా వాట్సాప్ లో తీసుకున్న అప్ డేట్ తో న‌యా ఫీచ‌ర్ వ‌చ్చేసింది. ”ఫార్వర్డెడ్‌ మెసేజ్‌” అనే ఫీచర్‌ ద్వారా వేరే వ్యక్తులు స్పామ్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసినా లేదా ఒకే చాట్‌ నుంచి ఆ పోస్టు ఫార్వర్డ్‌ అయినా ‘ఫార్వర్డెడ్‌ మెసేజ్‌’ అనే టాగ్‌ వచ్చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే కానీ మెసేజ్‌ను బ్లాక్‌ చేయలేదు. దీంతో స్పామ్‌ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్‌ అవుతూ ఉన్నాయి.

వాట్సాప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ ఫీచర్‌ను స్పాట్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ వీ2.18.67 వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. దీంతో పాటు స్టికర్స్‌ ఫీచర్‌ కూడా విండోస్‌ ఫోన్‌ బీటాపై స్పాట్‌ అయింది. ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్‌ ఇటీవలే గ్రూప్‌ డిస్క్రిప్షన్‌ అనే ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, విండోస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.






Related News

whatsapp-message-forward-icon-iphone

వాట్సాప్ కొత్త ఫీచర్ తో గుట్టురట్టు

Spread the loveఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో అ‍ద్భుత ఫీచర్‌ తీసుకొచ్చింది. దాంతో చాలామందిRead More

1467975349_samsung-galaxy-j2-2016

గెలాక్సీ ఫోన్లపై శాంసంగ్ బంపరాఫర్

Spread the loveమొబైల్‌ దిగ్గజం శాంసంగ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *