Main Menu

క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఫేస్ బుక్

Spread the love

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కేంబ్రిడ్జ్ ఎనాలిటికా విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల విష‌యంలో చివ‌ర‌కు దిగివ‌చ్చింది. జుకెర్ బ‌ర్గ్ ప్ర‌క‌ట‌న చేశారు. తాము కొన్ని పొరపాట్లు చేశామ‌ని అంగీరించారు. అందుకు తాను విచారిస్తున్నానని ఫేస్‌బుక్‌ అధినేత జుకరబర్గ్‌ పేర్కొన్నారు.

అత్యంత గోప్యమైన వినియోగదారుల సమాచారాన్ని తమ సిబ్బందిలో అనధీకృత వ్యక్తులు తాకకుండా వుండేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌తో సహా మరే ఇతర దేశాల ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవంబర్‌లో అమెరికాలో జరుగనున్న మధ్యంతర ఎన్నికలు లేదా భారత్‌, బ్రెజిల్‌లలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదన్న నిర్ణయానికి తాము కట్టుబడివున్నామని చెప్పారు. లండన్‌కు చెందిన రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఫేస్‌బుక్‌లోని దాదాపు 5 కోట్ల మంది వినియోగదారుల సమాచారాన్ని అక్రమంగా సేకరించి 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా వినియోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జూకర్‌బర్గ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.






Related News

ఇక వాట్సాప్ లో టైప్ తో ప‌నిలేదు..!

Spread the loveవాట్సాప్ లో న‌యా ఫీచర్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక వాట్సాప్ లో పలికితేRead More

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *