Main Menu

ఆ వార్త‌ల‌పై ఫేస్ బుక్ సీరియ‌స్ యాక్ష‌న్

Spread the love

సోష‌ల్ మీడియా మాద్య‌మం ఫేస్ బుక్ సీరియ‌స్ యాక్ష‌న్ కి సిద్ద‌మ‌య్యింది. ముఖ్యంగా ఫేక్ న్యూస్ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయ్యే ఫేక్‌ న్యూస్ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్టు సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ ప్ర‌క‌టించారు.. భౌతిక దాడులకు ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించే పనిలో ఉన్నట్టు చెప్పారు. ‘‘ఆ వార్తలు నిజంగా హాని కలిగించేలా ఉన్నా, భౌతిక దాడికి కారణమయ్యేలా ఉన్నా, ఉద్రిక్తతలను ప్రోత్సహించేలా ఉన్నా.. అటువంటి సమాచారం ఇకపై ఫేస్‌బుక్‌లో కనపడదు’’ అని జుకెర్‌బర్గ్ తెలిపారు.

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కారణమవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మయన్మార్, శ్రీలంక, భారత్ వంటి దేశాలో భౌతికపరమైన దాడులకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జుకెర్‌బర్గ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భౌతిక దాడులకు, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్‌ను తొలగించనున్నట్టు తెలిపారు.






Related News

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the loveఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *