Main Menu

ప‌డిపోయిన ఫేస్ బుక్ వాల్యూ

Spread the love

అనూహ్యంగా ఎదిగిన ఫేస్ బుక్ ప్ర‌స్థానంలో పెను ఆటంకం ఏర్ప‌డింది. ఆసంస్థ షేర్లు అమాంతంగా ఢ‌మాల్ అంటున్నాయి. మార్కెట్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. సోషల్‌ మీడియా దిగ్గజానికి గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో షేర్‌ విలువ అత్యధికంగా పడిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఫేస్‌బుక్‌ నుంచి దాదాపు అయిదు కోట్ల మంది వినియోగదారుల సమాచారం లీకైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సంస్థ భారీగా నష్టాన్ని చవిచూసింది. వాల్‌స్ట్రీట్‌లో మార్చి 19న ఫేస్‌బుక్‌ షేరు విలువ 7శాతం పడిపోయింది.

2016లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సమయంలో సుమారు 5 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జ్‌ అనలిటికా డేటా అనలిస్ట్‌ కంపెనీ అక్రమంగా ఉపయోగించుకుందని అమెరికా, బ్రిటన్‌ మీడియాల్లో వార్తలు రావడంతో ఫేస్‌బుక్‌ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రంప్‌ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్‌ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను అమెరికా, యూరోపియన్‌ అధికారులు ప్రశ్నించనున్నారని వార్తలు రావడంతో కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. 2014 మార్చి తర్వాత ఒక్క రోజులో ఇంతగా నష్టోవడం ఇప్పుడే. 2014మార్చిలో ఒక్క రోజులో షేరు విలువ 10.8శాతం పడిపోయింది. దాంతో ఈప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.






Related News

ఇక వాట్సాప్ లో టైప్ తో ప‌నిలేదు..!

Spread the loveవాట్సాప్ లో న‌యా ఫీచర్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక వాట్సాప్ లో పలికితేRead More

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *