ఫేస్ బుక్ డ‌బుల్ సెంచ‌రీ..!

facebook
Spread the love

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం అత్యధిక వినియోగదారులను సొంతం చేసుకొని రికార్డు స్థాయిలో దూసుకెళుతోన్న ఫేస్‌బుక్‌.. ప్రపంచ వ్యాప్తంగానూ, దేశీయంగానూ మరో రికార్డును నమోదు చేసింది. తాజా లెక్కల ప్రకారం ఏకంగా 200 కోట్ల మందికి ఫేస్‌బుక్‌ అకౌంట్లు ఉన్నాయి. అంటే… ప్రపంచంలోని నాల్గవ వంతుకు పైగా జనాభా ఫేస్‌బుక్‌లో అకౌంట్లను కలిగి ఉంది. వినియోగదార్ల సంఖ్య నిత్యం పెరుగుతుండటంతో పాటు యాక్టివ్‌ వినియోగదార్ల సంఖ్యలోనూ ప్రతినెలా భారీ పెరుగుదల నమోదవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 123 కోట్ల మంది ఫేస్‌బుక్‌ను చూస్తున్నారు. దీనిలో 115 కోట్ల మంది మొబైల్ల్లోనే ఫేస్‌బుక్‌ను చూస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలోని ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ వినియోగదార్ల సంఖ్య 20 కోట్లు దాటింది. అమెరికా తర్వాత అత్యధిక మంది ఫేస్‌బుక్‌ వినియోగదార్లున్నది మన దేశంలోనే కావడం విశేషం. కాగా, 21 కోట్ల 40 లక్షల మంది వినియోగదార్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. కాగా మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ను స్థాపించి 13 సంవత్సరాలైంది. 2012 అక్టోబరులో 100 కోట్ల మార్కుకు చేరుకోగా, అక్కడి ఐదేళ్లు కూడా కాకుండానే మరో 100 కోట్ల మంది వినియోగదారులను పెంచుకోవడం విశేషం.


Related News

google-logo-wordmark-2015-1920-800x450

మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..

Spread the love1Shareమొబైల్‌ వినియోగ దారులు తమ డేటా యూసేజ్‌ను ట్రాక్‌ చేసుకొంటూ నియంత్రించేందుకు వీలుగా ఇంటర్‌నెట్‌ దిగ్గజ సంస్థRead More

youtube go

యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్

Spread the loveయూట్యూబ్ వీడియోలను వీక్షించే వారికి గూగుల్ శుభవార్త చెప్పింది. ‘యూట్యూబ్ గో’ పేరుతో లైట్ వెయిట్ వెర్షన్Read More

 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • వాట్సాప్ లో నయా ఫీచర్
 • BSNL చౌక ఫోన్‌ సిద్ధం
 • ఐ ఫోన్ 7వేలకే..
 • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
 • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *