ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌

fb-2
Spread the love

ఫేస్‌బుక్‌ తాజాగా క్లిక్‌-టూ-వాట్సాప్‌ పేరు మీద సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ ద్వారా 100 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లను అడ్వర్‌టైజర్లు కనెక్ట్‌ చేసుకోవచ్చు. శుక్రవారం ఈ విషయాన్ని టెక్‌క్రంచ్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ధృవీకరించింది. ఈ ఫీచర్‌ను క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు కూడా తెలిపింది. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియాలో పలు ప్రాంతాల్లో తొలుత దీన్ని ప్రారంభించింది. చిన్న చిన్న వ్యాపారాలతో కమ్యూనికేట్‌ అవడానికి చాలా మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.

ఇది చాలా వేగవంతమైనదని, యూజర్లతో టచ్‌లో ఉండటానికి ఇది అనువైన మార్గమమని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ పంచమ్‌ గజ్జర్‌ చెప్పారు. ఫేస్‌బుక్‌ ప్రకటనల కోసం క్లిక్‌-టూ-వాట్సాప్‌ బటన్‌ను యాడ్‌ చేయడం ద్వారా, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను చాలా త్వరగా ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం 10 లక్షల పేజీలు, వాట్సాప్‌ నెంబర్లను తమ పోస్టులకు జతచేర్చాయి. యూజర్లు ఉత్పత్తుల గురించి సంభాషణ జరుపడానికి తమ కాంటాక్ట్స్‌లో వ్యాపారస్తుల వాట్సాప్‌ నెంబర్లను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ అచ్చం గతేడాది నవంబర్‌లో లాంచ్‌ చేసిన క్లిక్‌-టూ-మెసెంజర్‌ బటన్‌ మాదిరే ఉంది.


Related News

whatsapp

వాట్సాప్ లో గ్రూప్ కాలింగ్

Spread the love వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్నీ బంధువులకు, స్నేహితులకు దాని ద్వారానే చెప్పడం మనందరికీRead More

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ ఉక్కిరిబిక్కిరి

Spread the loveన్యూ ఇయర్ దెబ్బకు వాట్సాప్ ఉక్కిరిబిక్కిరయ్యింది. మెసేజ్ ల వెల్లువతో తల్లడింది. చివరకు కొంత సేపు క్రాష్Read More

 • ఫేస్ బుక్ కొత్త ఫీచర్
 • ఆపిల్ ధరలు పెరిగాయి..
 • ఫేస్‌బుక్‌ క్లిక్‌-టూ-వాట్సాప్‌
 • మొబైల్ డేటా ఆదా చేసే యాప్ వచ్చింది..
 • యూట్యూబ్ వీక్షకులకు గుడ్ న్యూస్
 • ఒకేరోజు 8 కొత్త ఫోన్లతో జియోనీ
 • వాట్సాప్ లో కొత్త ఆప్షన్
 • వేటు వేసిన ట్విట్టర్ పై ఘాటు స్పందన
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *