Main Menu

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the love

ఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగే సైబర్‌ నేరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయినా సోషల్‌ నెట్‌వర్క్‌లో ఎక్కువగా మోసపోతున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ముప్పు తెచ్చిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల నెట్‌ హింస కూడా పెరుగుతోంది. ఫోటోలను మార్ఫింగ్‌ చేయడం, అబ్యూసివ్‌ ఇమెయిల్స్‌ పంపడం లాంటివి. వీటిని అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు ఎదుర్కోంటున్న సమస్యను సంబంధిత లోకల్‌ పోలీసుకు తెలియ జేయండి లేదా దాని గురించి సైబర్‌ క్రైమ్‌ సెల్‌కు సమాచారం వెబ్‌సైట్‌ ద్వారా www.hyderabad police.gov.in తెలియ జేయాలి. ఆ వ్యక్తి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుని మీ సమస్యను పరిష్కరిస్తారు.

మీకు సంబంధించిన ఇ-మెయిల్‌ మెసేజ్‌లు, ఇతర ఇ-మెయిల్‌ అడ్రస్‌లు, పంపినవారి సమాచారం, ఆ కమ్యూనికేషన్‌కు సంబంధించిన సమాచారం , ఐపి అడ్రస్‌లు, డేట్‌ , టైంకు సంబంధించిన సమాచారం, యూజర్‌ సమాచారం, అటాచ్‌మెంట్స్‌, పాస్‌వర్డ్స్‌, ఆ కమ్యూనికేషన్‌ రిసీవ్‌ చేసుకోవడానికి ఉపయోగించిన కంప్యూటర్‌, ఆ ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ , ఆ మెసేజ్‌ రిసీవ్‌ చేసుకున్న లేదా చూసిన డేట్‌, టైమ్‌ వివరాలు. అంతకు ముందు చేసిన కాంటాక్ట్‌ల డేట్స్‌, టైమ్‌ల వివరాలు అన్ని జాగ్రత్తగా సేవ్‌ చేసుకోవాలి.

ఫిర్యాదు చేసేటపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు:

ఎల్లప్పుడూ మీరు ప్రత్యక్షంగా వెళ్ళి పోలీసులను సంప్రదించి వారికి ఫిర్యాదు చేయడమే సరియైన పని. ఆ వ్యక్తి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు అందజేయండి.

మీకు ఏదైనా ఒక మెయిల్‌ ఐడి లేదా మొబైల్‌ నంబరు మీద అనుమానం ఉన్నట్లయితే, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్‌ చేయవద్దు. ఆ కాల్‌ గురించి వెంటనే పోలీసులకు తెలియజేయండి.

ఎంత ఇబ్బందికరమైన సమాచారమైనా సరే పోలీసులకు తెలియచేసే వరకు డిలిట్‌ చేయవద్దు.






Related News

వాట్సాప్ లో న్యూ ఫీచ‌ర్, ఇక మీ ఫోన్ సేఫ్

Spread the loveవాట్సాప్ మెసేజెస్ తో ఉక్కిరిబిక్కిర‌వుతున్నారా..వ‌రుస‌గా వ‌స్తున్న ఇమేజెస్ వీడీయోల‌తో ఫోన్ మెమెరీ ఫుల్ అయిపోతోంద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారా..అయితే మీకుRead More

ఫేస్ బుక్ వేధింపుల‌పై ఫిర్యాదు ఇలా..

Spread the loveఇంటర్నెట్‌ వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్‌ నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్‌ ద్వారా జరిగేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *