జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్

BSNL20Rs2014920plan
Spread the love

ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చౌక ధరల ఫీచర్‌ ఫోన్‌ యుద్ధంలోకి దిగింది. జియోతో పాటు ఇతర టెల్కోలు తక్కువ ధరకే ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో తాను కూడా ఏమి తక్కువ కాదంటూ బిఎస్‌ఎన్‌ఎల్‌ తనదైన శైలిలో పోటీకి సిద్ధమయ్యింది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో రూ.2000కే బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానుంది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ టెల్కోలు దీపావళి కల్లా చౌక ధరలో 4జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ఇదే బాటలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా కసరత్తు ప్రారంభించింది. తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానున్నామని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

ఇందుకోసం తాము లావా, మైక్రోమాక్స్‌ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. రెండు మొబైల్‌ తయారీ కంపెనీల భాగస్వామ్యంతో అక్టోబర్‌లో దీపావళి నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత ఉచిత వాయిస్‌ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తామన్నారు బిఎస్‌ఎన్‌ఎల్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు 10.5కోట్ల మంది వినియోగదారులున్నారు. ధరల పోటీకి తెరలేపిన జియో ఇప్పటికే వినియోగ దారుల నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకుంది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడంతో పోటీ మరింత తీవ్రతరం కానుంది. అన్ని కంపెనీలు కూడా దీపావళికి ఈ చౌక ధరల ఫోన్లను అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నాయి. టెల్కోల మధ్య నెలకొన్న ఈ పోటీ తీవ్రత వల్ల దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ పూర్తిగా కుదుపులకు లోనుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 57 శాతం మంది ఫీచర్‌ ఫోన్లను వినియోగిస్తున్నారని సైబర్‌ మీడియా రీసెర్చ్‌(సిఎంఆర్‌) ఇటీవలే ఒక రిపోర్టులో వెల్లడిచ్చింది. ఇందులో 85 శాతం మంది కూడా స్మార్ట్‌ఫోన్లకు మారడానికి ఆసక్తి చూపడం లేదని మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌(ఎంఎంఎ), కంతర్‌ ఐఎంఆర్‌బి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది.


Related News

1469807832WhatsApp-Not-Delete-Conversations

వాట్సాప్ లో నయా ఫీచర్

Spread the love1Shareసోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌Read More

BSNL20Rs2014920plan

BSNL చౌక ఫోన్‌ సిద్ధం

Spread the love2Sharesప్రయివేటు టెల్కోలకు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో అద్బుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలంRead More

 • ఐ ఫోన్ 7వేలకే..
 • ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం
 • స్యామ్ సంగ్ కొత్త ట్యాబ్
 • గూగుల్ ఫోన్లు వచ్చేశాయ్..
 • వాట్సాప్ లో కొత్తగా…
 • సోనయా ఎక్స్ పీరియా ఎక్స్ జెడ్
 • జియోనీ నయా ఫోన్
 • బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *