Main Menu

ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ సంచలనం

Spread the love

టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న జియోకు పోటీగా తక్కువ ధరకే ఎయిర్‌టెల్‌ ఓ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తోంది. కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి రూ.1399కే స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్‌’ పేరిట ఈ మొబైల్‌ను ప్రకటించింది.

రూ.1500కే 4జీ ఫోన్‌ను జియో తీసుకొచ్చిన నేపథ్యంలో దానికి పోటీగా ఎయిర్‌టెల్‌ కూడా స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తానని గతంలో ప్రకటించింది. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరిపింది. చివరికి కార్బన్‌ మొబైల్స్‌తో జట్టుకట్టి కార్బన్‌ ఏ40 మొబైల్‌ను ఈ పథకం కింద అందిస్తుంది.

దీని మార్కెట్‌ ధర రూ.3,499 కాగా.. ఎయిర్‌టెల్‌ దీన్ని రూ.2899కే వినియోగదారులకు విక్రయించనుంది. ఇందులో రూ.1500 మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వాపసు ఇస్తారు. అంటే ఫోన్‌ ధర రూ.1399కే వినియోగదారులకు దక్కనుంది. క్యాష్‌బ్యాక్‌ పొందేందుకు వినియోగదారులు తొలి 18 నెలల్లో కనీసం రూ.3వేలు రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అప్పుడు తొలి విడతగా రూ.500 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తారు. ఆ తర్వాతి 18 నెలలకూ అంతేమొత్తంలో రీఛార్జి చేయడం ద్వారా మిగిలిన రూ.1000ని పొందుతారు. మూడేళ్ల తర్వాత ఫోన్‌ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం జియో తరహాలో ఎయిర్‌టెల్‌ ప్రత్యేకమైన ప్యాక్‌ను ప్రకటించింది. నెలకు రూ.169 రీఛార్జిపై అపరిమిత కాల్స్‌తో పాటు, రోజుకు 500 ఎంబీ డేటాను ఈ ప్యాక్‌ ద్వారా వినియోగదారులు పొందొచ్చు. ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాలన్న లక్ష్యంతో దీన్ని తీసుకువచ్చినట్టు భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ (కన్జూమర్‌ బిజినెస్‌, సీఎంవో) రాజ్‌ పూడిపెద్ది తెలిపారు. ఆఫ్‌లైన్‌లో స్టోర్లలో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నారు.






Related News

వాట్సాప్ యూజర్లకు గుడ్, బ్యాడ్ న్యూస్

Spread the loveవాట్సాప్ యూజర్లకు తీపి, చేదు వార్తలు ఒకేసారి బయటకు వచ్చాయి. ఆంఢ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయనిRead More

వాట్సాప్ మెస్సేజ్‌ల నిర్ధారణకు యాప్..!

Spread the love వాట్సాప్‌లో వాస్తవమైన పోస్టుల కన్నా, అవాస్తవాలతో కూడిన పోస్టులే ఎక్కువ ప్రచారంలో ఉంటున్నాయని నిపుణలు పేర్కొంటున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *