ysrcp

 
 

ఒక చిత్రం రేపిన దుమారం

tweet

తెలుగు రాజకీయాలకు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ప్రచారాలకు అన్నింటికీ సోషల్ మీడియా కేంద్రం అవుతోంది. అలాంటి ఆన్ లైన్ వేదికగా వచ్చిన ఓ చిత్రం తీవ్ర దుమారం రేపింది. పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ వ్యవహారం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చుట్టూ కావడంతో ఏపీలో టీడీపీ అనుకూల మీడియా కొంత ఉత్సాహం ప్రదర్శించింది. అయితే అంతకుముందే వైఎస్ జగన్ అనుచరులు వైరల్ గా ప్రచారం చేయాలని భావించిన ఆ చిత్రమే విచిత్రంగా వారు భంగపడేలా చేయడం విశేషంగా భావించవచ్చు.. ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఓ బోరు బావి వద్ద వంగుని నీళ్లు తాగుతున్న చిత్రం, అక్కడ పచ్చని పొలాలు కనిపిస్తున్న ద్రుశ్యం అందరినీ ఆకట్టుకుంది. విపరీతంగా ప్రచారంRead More


వైవీ సుబ్బారెడ్డి అవుట్..

YV SUBBAREDDY

ప్రస్తుతం వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కొద్దిమందిలో వైవీ సుబ్బారెడ్డి ఒకరు. ఒంగోలు ఎంపీగా నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తున్న నాయకుడిగా ఆయనకు కొంత గుర్తింపు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. అదే సమయంలో పార్టీలో ఆయన బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఒంగోలు సీటు కష్టమేనని తెలుస్తోంది. ఆయన కూడా పార్లమెంట్ కి బదులుగా అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దాంతో ఒంగోలు ఎంపీ సీటుకి వైసీపీ కొత్త అభ్యర్థిని రంగంలో దింపే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి ఛాన్స్ దక్కవచ్చని భావిస్తున్నారు. ఎంపీ సీటు ఖాయం చేస్తే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడంతోRead More


కులదేవత మీద ఆన..జగన్ అన్నతోనే

pushpa srivani

పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరమీదకు రావడంతో వైసీపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ వేసిన ఎత్తుగడలతో కలకలం రేగుతోంది. జంప్ జిలానీల లిస్టులో ఫలానా ఎమ్మెల్యే ఉన్నారనే పేరు ఉందంటూ సాగిస్తున్న ప్రచారంతో పార్టీలో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యూ పుష్ప శ్రీ వాణీ పేరు తెరమీదకు వచ్చింది. ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోబోతోందంటూ సాగుతున్న ప్రచారం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో కురుపాం ఎమ్మెల్యే స్పందించారు. కులదేవత సాక్షిగా చెబుతున్న నేను మా జగన్ అన్నను విడిచి వెళ్ళను.. ఎన్ని కష్టాలైనా, నష్టాలైన జగన్ తోనే రాజకీయంగా కొనసాగుతాను.. టీడీపీ ఎగరేసే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను.. ఆలా ఆశపడి పోయినవాళ్లు రాజకీయాల్లో ఎంతోకాలం రాణించలేరని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి తెలిపారు.. కాగా ఇప్పటివరకు వెళ్లిన మా నేతలంతాRead More


కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ

ysrcp

ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షం పరిస్థితి అంత సవ్యంగా కనిపించడం లేదు. నిత్యం జారిపోతున్న నేతలతో కష్టాల సుడిగుండంలోనే సాగుతోంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వైసీపీ అధిష్టానం కోరి కష్టాలు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పగడ్భందీగా వ్యవహరించాల్సి ఉన్నా దానికి భిన్నంగా వెళుతోంది. దాంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ కష్టాలు పెరుగుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో గందరగోళం కనిిపస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి 34 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో కేవలం 5 స్థానాలను మాత్రమే వైసీపీ గెలిచింది. అవి కూడా తూర్పునే కావడం విశేషం. పశ్చిమలో బోణీ కూడా కొట్టలేక జగన్ సేన చతికిలపడడం తెలిసిందే. అలాంటి చోట్ల అత్యంత జాగూరుకతతో వ్యవహరించాల్సిన వైసీపీ వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటోంది. దానికి ఒక ఉదాహరణ రాజమహేంద్రవరంలో ఆపార్టీ పరిస్థితిలో వచ్చిన మార్పు.Read More


చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న జగన్

jagan1

ఇదే చర్చ సాగుతోంది. పాదయాత్ర విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరహాలోనే జగన్ సాగుతున్న తీరు దానికి నిదర్శనంగా ఉంది. సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రతీ రోజూ ఓ సంచలన నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ప్రజల్లో ప్రభావితం చేసే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా భారీ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతీ వర్గానికి వరాల జల్లు కురిపించే పని చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్రలో కూడా ఇదే రీతిలో సాగారు. అప్పట్లో కీలకమైన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. రుణమాఫీ, కాపు రిజర్వేషన్లు వంటి విషయాల్లో ఆచరణ సాధ్యం కాదని పలువురు మొత్తుకుంటున్నా చంద్రబాబు వెనకడుగు వేయలేదు. చివరకు నాటి వైసీపీ నేతలు కూడా చంద్రబాబు హామీలను తప్పు పట్టే స్థాయిలో వరాల జల్లు కురిపించారు. వాటిలో అమలుRead More


ప్రజాసంకల్పం సాగుతుందిలా..

jagan yatra

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఇడుపులపాయ నుంచి జగన్‌ యాత్ర ప్రారంభంకానుంది. దాదాపు ఏడు నెలల పాటు…మూడు వేల కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. జగన్‌ యాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. వైసీపీ అధినేత జగన్‌ చేయనున్న ప్రజా సంకల్ప యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా కడప చేరుకున్నారు. సోమవారం ఇడుపులపాయలో దివంగత వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. పాదయాత్రను ప్రారంభించనున్నారు. తొలుత కడప జిల్లా పులివెందుల-కమలాపురం-జమ్మలమడుగు-పొద్దుటూరు-మైదుకూరు నియోజకవర్గాల్లో ఏడు రోజులు పాదయాత్ర కొనసాగనుంది. తర్వాత కర్నూలులోని ఏడు నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగుతుంది. మొత్తం 125 నియోజకవర్గాల్లో మూడుRead More


ఆ సీటుకి క్యాండిడేట్ ఖాయం చేసిన జగన్

1736_ysrcp

ప్రకాశం జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. మరోసారి పట్టు నిలుపుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో గట్టి పోటీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి బరిలో దిగే వారి విషయంలో స్పష్టత కోసం వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగా ఇప్పటికే పలువురు నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ముందుగా మనసులో మాట వెల్లడిస్తే చివరిలో సమస్యలు రాకుండా చూడవచ్చని వైసీపీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆపార్టీకి గట్టి పట్టు ఉండడంతో ఆశావాహుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా గిద్దలూరు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పిడతలRead More


వైసీపీ చక్కదిద్దుకోలేకపోతే చిక్కులే..!

jagan

ఏపీ రాజకీయాల్లో నంద్యాలకు ముందు..ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. నంద్యాల ఫలితాల ప్రభావంతో కాకినాడలో ఉన్న బలాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిన వైసీపీ శ్రేణులు కొంత ఢీలా పడ్డాయి. అదే సమయంలో రాష్ట్రమంతా చంద్రబాబు సర్కారు తీరు మీద పెరుగుతున్న వ్యతిరేకత ఆపార్టీకి ఊరటగా కనిపిస్తోంది. ఎన్నికల ఊపుతో చెలరేగిపోదామని చంద్రబాబు ఆశిస్తే..సినిమా వాళ్లతో చేస్తున్న ప్రయత్నాలు అసలుకే ఎసరు తెస్తున్నాయి. దాంతో టీడీపీకి నంద్యాల తీర్పు నమ్మకం కలిగిస్తుందని భావించినోళ్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వ్యవహారం మీద మాత్రం విశ్వాసం కలగడం లేదని చెబుతున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇప్పుడు వైసీపీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టింది. కమిటీలంటూ హడావిడి చేసినా అవి ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. దాంతో కిందిస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతRead More


ఆళ్ల అభినందనీయుడు..

MLA Alla Ramakrishna Reddy (2)

సగటు ఎమ్మెల్యే తీరుకి ఆయన భిన్నం. హంగులూ, ఆర్భాటాలు ప్రదర్శించే నేతల తీరుకి ఆయన దూరం. అందుకే గట్టిపోటీలో కూడా నిలదొక్కుకుని గెలిచిన ఆయన ఆ తర్వాత మరింత మందిని ఆకట్టుకోవడంలో విజయవంతమవుతున్నారు. సామాన్యుడితో సమానంగా సాగుతూ చాలామందికి ఆదర్శంగా మారుతున్నారు. సగటు జీవి కడుపు నింపే కార్యక్రమాలతో సాధారణ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. కూలీగా, రైతుగా, సామాన్య పౌరుడిగా కనిపిస్తూ చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపే. మరోవైపు అతనో అసామాన్య యోధుడు. ఆఖరి వరకూ పోరాడే నాయకుడు. న్యాయపోరాటంలో రాటుదేలుతున్న వీరుడు. అందుకే వరుసగా కోర్టులనే కార్యస్థానంగా మార్చుకుని సర్కారును ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతిపక్ష ప్రతినిధిగా కనిపిస్తున్నారు. తాజాగా ప్రజాధనం పరిరక్షణలో ఆయన చేసిన పోరాటం ప్రతిఫలించి సర్కారు డొల్లతనం చాటడడమే కాదు..ప్రజల ఆస్తులు కాపాడడంలో ప్రతిపక్షం తన పాత్రను పోషించడం ద్వారాRead More


జగన్ కి ఝలక్!

GOWTHAM REDDY

జగన్ కి ఝలక్ కి తప్పేలా లేదు. సన్నిహితుడు, బంధువుగా భావించి అందలం ఇస్తే హఠాత్తుగా హ్యాండివ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రాజధాని రాజకీయం రంజుగా మార్చేసిన నాయకుడు ఇప్పుడు మరో అడుగువేసే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశం అవుతోంది. బెజవాడ రాజకీయాల్లో మరో మలుపు ఖాయంగా ఉంది. వైసీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఇప్పుడు జగన్ కి గుడ్ బై చెప్పే యోచనలో ఉణ్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన కమలం గూటిలో కొలువు దీరబోతున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి గౌతమ్ రెడ్డి విజయవాడలో సీనియర్ రాజకీయ నాయకుడిగానే చెప్పాలి. వరుసగా పలుమార్లు కార్పోరేటర్ గా గెలిచిన అనుభవం గౌతమ్ రెడ్డిది. అంతకుముందు ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేశారు. ఆతర్వాత సీపీఐ నేతగా నగర ప్రజలకు సుపరిచితుడే. కానీ తర్వాతRead More