Main Menu

ysjagan

 
 

వెన‌క‌బ‌డుతున్న వైసీపీ,జ‌న‌సేన‌

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి. అదే స‌మ‌యంలో జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌కు ముందుగా రాష్ట్రంలో వివిధ వ‌ర్గాల మ‌నోభావాలు తెలుసుకునే అవ‌కాశం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రూపంలో వ‌స్తోంది. ముఖ్యంగా కీల‌క‌మైన గోదావ‌రి జిల్లాలు, కృష్ణా-గుంటూరు ప‌రిధిలో జ‌ర‌గ‌బోతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఈ రెండు ప‌ట్ట భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఫ‌లితాలు రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌, వైసీపీ నేత‌లు అటువైపు క‌న్నేసిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. క‌నీసం పోటీ చేయ‌క‌పోయినా ప్ర‌భావితం చేయ‌డానికి త‌గ్గ‌ట్ట‌గా కూడా ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 2017లో అనంత‌పురం-క‌డ‌ప‌-క‌ర్నూలు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంత‌గా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డంతో అధికార పార్టీ ఢీలా ప‌డింది. ఇప్పుడు ఆ అనుభ‌వంతోనే ఈసారి ఈ రెండుRead More


బాబు, జ‌గ‌న్ కి తొలి ప‌రీక్ష‌, సందిగ్ధంలో ప‌వ‌న్

ఏపీలో ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల‌కు తొలి ప‌రీక్ష ఎదుర‌వుతోంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే పెద్ద ప‌రీక్ష ఎదురుకాబోతోంది. దాంతో అన్ని పార్టీల్లోనూ ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట వ‌చ్చి ప‌డుతున్న పెద్ద‌ల స‌భ‌ల ఎన్నిక‌ల‌తో పెద్ద స‌మ‌స్య త‌ప్ప‌ద‌ని భావిస్తున్నాయి. దాంతో ఆరు నెల‌ల ముందు నుంచే ప‌లువురు నేత‌లు శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ఏపీలోని నాలుగు శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందులో ఉత్త‌రాంధ్ర టీచ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం, గోదావ‌రి, కృష్ణ‌-గుంటూరు జిల్లాలప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలు కీల‌కంగా క‌నిపిస్తున్నాయి. ఈ స్థానాల్లో పాగా వేయాల‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఈ మూడు సీట్ల‌కు గానూ రెండు చోట్ల ప్ర‌స్తుతం టీడీపీ కి అనుబంధంగా ఉన్న నేత‌లున్నారు. దాంతో అధికార పార్టీకి వాటిని నిల‌బెట్టుకోవ‌డం అనివార్యం కాబోతోంది.Read More


వైసీపీలో కృష్ణుడు

వైసీపీకి కొత్త ఊపు వ‌స్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. సినీ గ్లామ‌ర్ అద్దుకుంటున్నట్టు క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి ప‌లువురు సినీ న‌టులను పార్టీలోకి ఆహ్వానిస్తుండ‌డం విశేషం. ఇప్ప‌టికే పోసాని కృష్ణ‌ముర‌ళీ, ప్ర‌థ్వీరాజ్ వంటి వారు పాద‌యాత్ర‌లో కాలు క‌ద‌ప‌గా, తాజాగా న‌టుడు కృష్ణుడు నేను సైతం అంటూ జ‌గ‌న్ ముందు వాలిపోయారు. వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాకే చెందిన క్షత్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కృష్ణుడు ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించారు. కొంత గుర్తింపు సాధించారు.దాంతో వైసీపీలో సినీ ప్ర‌ముఖుల చేరిక ప్ర‌య‌త్నాలు ఓ మేర‌కు ఫ‌లిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను తూర్పు గోదావ‌రిలో కొన‌సాగిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైఎస్‌ జగన్ ప‌ర్య‌టిస్తున్నారు. సినీ నటుడు కృష్ణుడు అక్క‌డికి వెళ్లి జ‌గ‌న్ చేతుల మీదుగా పార్టీ కండువాRead More


టీడీపీకి ఎదురుదెబ్బ‌


పవన్ కి అడ్డంకిగా మారిన జగన్!

ఇదో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీలో ఇద్దరు ప్రతిపక్ష నేతల మధ్య ఎన్నికల నాటికి అవగాహన ఖాయమనే వాదన పలువురు ముందుకు తెస్తున్నారు. ఉమ్మడి ప్రత్యర్థిని ఓడించేందుకు ఒక్కటవుతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, జనసేన చేతులు కలపవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటనకు వైఎస్ జగన్ అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటనకు మధ్యలో బ్రేక్ రావడానికి అసలు కారణం జగన్ అనే చెబుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండటంతో రంజాన్‌ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ఇచ్చినట్టు ప్రకటించారు. రంజాన్‌ అనంతరం యాత్ర విశాఖ జిల్లాలోనే ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నారు. పవన్‌ భీమిలి బీచ్‌రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్‌లోRead More


జనసేనకు కన్నం కొట్టి..వైసీపీ కి?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తిరిగింది. జనసేనకు కొంత సమస్య తప్పేలా కనిపించడం లేదు. ఏదో మేరకు పవన్ కళ్యాణ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే దాని మూలంగా వైసీపీకి ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ వ్యవహారాలను కాపులకు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కన్నా లక్ష్మీనారాయణకు, ఎన్నికల బాధ్యతను సోము వీర్రాజుకి బీజేపీ అప్పగించింది. తద్వారా కాపు వర్గం ఓట్లకు గేలం వేయవచ్చని భావిస్తోంది. తద్వారా కాపుల ఓట్లు జనసేన వైపు మళ్లుతాయని ఆశిస్తున్న వారికి ఆశాభంగం తప్పేలా లేదు. దాంతో కాపుల ఓట్లలో చీలిక వస్తే జనసేన ఆశలకు గండిపడుతుంది. ఆ మేరకు వైసీపీ లాభపడుతుంది. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో కాపు ఓట్లను జనసేనాని కారణంగా టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల్లో ప్రయోజనం పొందింది. కానీ ప్రస్తుతంRead More


ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ

తెలుగుదేశం పొలిటిక‌ల్ లైన్ లో మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో విధానాల‌లో స్ప‌ష్ట‌మైన మార్పులు ఖాయం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో మోడీని ఢీ కొట్టాలంటే దేశవ్యాప్తంగా అనేక‌మంది మిత్రుల‌ను క‌లుపుకుని సాగాల‌ని ఆశిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎన్డీయే భాగ‌స్వాముల‌ను కూడా క‌లుపుకుపోవాల‌ని భావిస్తోంది. కేవ‌లం బీజేపీ, కాంగ్రెస్ మిన‌హా అన్ని పార్టీల‌తో క‌లిసి సాగుతామ‌ని చెబుతోంది. అయితే అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్ తో స‌ఖ్య‌త‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. వైసీపీతో పొత్తు పెట్టుకున్నందువ‌ల్లే తాము ఎన్డీయేని వీడామ‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పేశారు. పైకి మాత్రం ఏపీకి హోదా, విభ‌జ‌న హామీలు అని చెప్పిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థిని ప‌క్క‌న పెట్టుకోవ‌డంతో స‌హించలేక దూర‌మ‌య్యామ‌ని నేరుగా చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. దాంతో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కార‌ణంగానేRead More


పార్టీ పరువు తీసుకుంటున్న వైసీపీ నేతలు

ఏపీలో వైసీపీ పరిస్థితి అసలే అంతంతమాత్రంగా ఉంది. వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. నంద్యాల, కాకినాడ ఓటములతో తీవ్రంగా ఇరకాటంలో పడింది. గట్టెక్కడానికి ఏం చేయాలనే విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అందరి వేళ్లూ అధినేత వైపే ఉన్న తరుణంలో ఆయన ఏమేరకు మారతారనే చర్చ మొదలయ్యింది. కానీ ఈలోగానే ఆపార్టీ నేతలు ఉన్న పరువు కూడా బజారున పడేసుకుంటున్నారు. పార్టీని అభాసుపాలుజేస్తున్నారు. తాజాగా విజయవాడ వ్యవహారం దానికి నిదర్శనం. ఆపార్టీ కార్మిక విభాగం నేత గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వంగవీటి రంగాకి వ్యతిరేకంగా గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపాయి. అసలే పార్టీ పరిస్థితి సమస్యాత్మకంగా మారడంతో తాజాగా గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఓ సామాజికవర్గం, ముఖ్యంగా విజయవాడలోని వైసీపీ నాయకుడిగా ఉన్న వంగవీటి రాధా వర్గమే తీవ్రంగాRead More


వైసీపీకిది గుణపాఠమే!

వైసీపీలో అంతర్మథనం మొదలయ్యింది. ఓటమి తర్వాత కాకినాడలో ఆపార్టీ కార్యకర్తలు ఢీలా పడ్డారు. సుదీర్ఘకాలంగా టీడీపీకి చోటులేని చోట ప్రత్యర్థి ముందు తలవంచాల్సి రావడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఓటమి కూడా ఊహించిన దానికి భిన్నంగా భారీ తేడాతో ఎదుర్కోవాల్సి రావడడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. కారణాలను అన్వేషిస్తూ ఆపార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు. తీవ్రమైన ప్రజావ్యతిరేకత…కాపుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం…స్మార్ట్ సిటీ నిధుల మాటే లేకపోవడం అన్నీ కలిసి తమకే విజయం దక్కుతుందని వైసీసీ ఆశించింది. కాకినాడ కిరీటం దక్కించుకుంటామని కలలు గన్నది. కానీ చివరకు ఫలితాలు తారుమారయ్యాయి. ఈవీఎంలు తెరిచిన తర్వాత వైసీసీ పరిస్థితి దయనీయంగా కనిపించింది. ఒకదశలో సిింగిల్ డిజిట్ తో సరిపెట్టుకుంటారా అని సందేహించినప్పటికీ చివరకు 10 స్థానాలతో సంత్రుప్తి చెందాల్సి వచ్చింది. దాంతో 48 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కేవలంRead More


రాయపాటి ఆశల‌కు జగన్ ఆఫర్…!

ఆయ‌న సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ప‌లుమార్లు పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు. ప‌ద‌వుల కోసం పార్టీలు కూడా మారారు. కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరి, గుంటూరు నుంచి న‌ర్సారావు పేట వెళ్లి జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. కానీ ఆయ‌న ఆశ మాత్రం నెర‌వేర‌డం లేదు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ కావాల‌నే రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆశ‌కు ప్ర‌తీసారీ అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గ్రూపులు ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. హ‌స్తిన‌లో అనుకూల‌త ల‌భించినా హైద‌రాబాద్ లో ఆమోదం ద‌క్క‌లేదు. ఆఖ‌రి క్ష‌ణంలో ఆయ‌న ఆశ‌లు నీరుగారిపోతుండేవి. పోనీ టీడీపీలో చేరిన త‌ర్వాతైనా త‌న‌కు టీటీడీ హోదా ద‌క్కుతుందా అని రాయ‌పాటి ఆశించారు. ఇప్ప‌టికే రెండు సార్లు ఖంగుతిన్నారు. తాజాగా ఆయ‌న చంద్ర‌బాబు వ‌ద్ద గ‌ట్టి ప‌ట్టుప‌ట్ట‌డంతో అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని భావించారు. కానీ ముర‌ళీమోహ‌న్ కూడా పోటీలోకిRead More