Main Menu

ys jagan

 
 

చిన‌బాబు చ‌ల‌వతోనైనా ఆ ఎంపీ గ‌ట్టెక్కేనా?

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాల‌కు కొద‌వ‌లేదు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉంటుంది క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక రాజ‌కీయ ప‌య‌నం. భ‌ర్త క‌నుస‌న్న‌ల్లో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి అంత‌లోనే బ‌రిలో దిగిన తొలిసారి ఏకంగా పార్ల‌మెంట్ కి ఎన్నిక‌యిన రేణుక ఆ వెంట‌నే సొంత పార్టీకి సెల‌వు చెప్పే సాహ‌సం చేశారు. కానీ చివ‌రి క్ష‌ణంలో భ‌ర్త‌ను పంపించి , ఆమె మాత్రం వైసీపీలో ఆగిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర అంశంగా మారింది. ఆ త‌ర్వాత మూడేళ్లు వైసీపీ శిబిరంలో చేరి, చావైనా, రేవైనా జ‌గ‌నన్న‌తోనే అని ప్ర‌క‌టించి ఆఖ‌రికి గ‌త ఏడాది జంప్ చేసేవారు. టీడీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ సీన్ చూస్తుంటే ఆమెకు చుక్క‌లు క‌నిపించేలా ఉన్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే క‌ర్నూలు లోక్ స‌భ స్థానానికి ఆమె పేరుని నేరుగా ప్ర‌క‌టించిన నారా లోకేష్Read More


సీఎం ర‌మేష్ ఎదుగుద‌ల‌లో ఆయ‌న పాత్ర ఎంత‌?

ఓ సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సీఎం ర‌మేష్ అసాధార‌ణంగా ఎదిగారు. ఏపీలోని కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా మారారు. చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితుడు కాగ‌లిగారు. అనేక ర‌కాల ప్ర‌య‌త్నాల త‌ర్వాత కాంట్రాక్ట‌ర్ అవ‌తారం ఎత్తి అమాంతంగా ఎదిగారు. రాజ‌కీయాల్లో కూడా అదే స్థాయిలో ప‌దేళ్ల‌లోనే దేశ‌వ్యాప్తంగా ప్రాధాన్య‌త గ‌డించారు. తాజాగా ఐటీ దాడుల‌తో ఆయ‌న పేరు మ‌రోసారి మారుమ్రోగుతోంది. ఆయ‌న సంస్థ‌ల మీద‌, ఇళ్ల మీద సాగుతున్న దాడుల‌తో పెద్ద చ‌ర్చ మొద‌ల‌వుతోంది. వాస్త‌వానికి సీఎం ర‌మేష్ స్వ‌ల్ప‌కాలంలో సాధించిన అబివృద్ధి వెనుక చంద్ర‌బాబు చేదోడుతో పాటు మాజీ సీఎం వైఎస్ స‌హ‌కారం కూడా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అయినా వైఎస్ వ్య‌తిరేక పార్టీలో ఉన్నారు కాబ‌ట్టి, ర‌మేష్ స‌క్సెస్ లో వైఎస్ పాత్ర‌ను చాలామంది ప‌ట్టించుకోరు. కానీ వాస్త‌వానికి సీఎం ర‌మేష్ కి 2004-09 మ‌ధ్య‌లోRead More


గండికొడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వేగంగా పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. పార్టీ శ్రేణుల్లో కొంద‌రు అభ్యంత‌రాలు పెడుతున్నా మాజీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే ఇత‌ర పార్టీల‌ను గ‌ట్టి దెబ్బ కొట్టే ప‌నిలో ప‌డ్డారు. తాజాగా గోదావ‌రి జిల్లాల్లో ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు రాపాక వ‌ర‌ప్ర‌సాద్, పాముల రాజేశ్వ‌రి జ‌న‌సేన కండువాలు క‌ప్పుకున్నారు. వారి కార‌ణంగా వైసీపీకి న‌ష్టం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. వాస్త‌వానికి వారిద్ద‌రూ వైసీపీలో ఉండాల్సిన నేత‌లు. పాముల రాజేశ్వ‌రి వైసీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేర‌గా, రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా జ‌గ‌న్ తో భేటీ అయిన‌ప్ప‌టికీ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో జ‌న‌సేన గూటిలో వాలిపోయారు. దాంతో ఈ ఇద్ద‌రి రాక‌తో జ‌న‌సేన‌కుRead More


బొత్సాకి జ‌గ‌న్ బ్రేకులు


స‌హించ‌లేక‌పోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత వ్య‌క్తిగ‌త శైలి భిన్నంగా ఉంటుంది. చంద్ర‌బాబు త‌న అధికారాన్ని కాపాడుకునేందుకు రాజ‌కీయాలు చేస్తారు. జ‌గ‌న్ ఈసారి ఖ‌చ్చితంగా అధికారం సాధించాల‌న్న త‌ప‌న‌తో ఉంటారు. కానీ ప‌వ‌న్ మాత్రం వారిద్ద‌రికీ భిన్నం. జ‌న‌సేన‌కు అధికారం వ‌స్తుంద‌న్న విశ్వాసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో కూడా క‌నిపించ‌డం లేదు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేప‌డ‌తాం అని ఓమారు చెబుతూ..మ‌ళ్లీ ఆ వెంట‌నే త‌మ‌కు అధికార‌మే ప‌ర‌మావ‌ధి కాద‌ని ప్ర‌క‌టిస్తుంటారు. మ‌ళ్లీ అంత‌లోనే క‌ర్ణాట‌క త‌రహాలో కీల‌క‌పాత్ర పోషిస్తామ‌ని చెప్పుకొస్తారు. ఇలా ప‌దే ప‌దే త‌న భ‌విష్య‌త్ విష‌యంలో గంద‌ర‌గోళ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డం ప‌వ‌న్ ప్ర‌త్యేక‌త‌. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత‌గూటి వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. జ‌న‌సేన‌లో వ‌ర్గ‌పోరు తార‌స్థాయికి చేరుతోంది. దిగువ స్థాయిలో కాకుండా ఏకంగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలోనే ఇలాంటి వ్య‌వ‌హారాలు ముందుకొస్తున్నాయి. ఇది చివ‌ర‌కుRead More


‘సాక్షి’లో మార్పులు త‌ప్ప‌వా?

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కి చెందిన సాక్షి సంస్థ‌ల వ్య‌వ‌హారంపై చాలాకాలంగా పాఠ‌కుల్లోనే కాకుండా వైసీపీ అభిమానుల్లోనూ అస‌హ‌నం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో సాక్షి క‌థ‌నాల‌పై సెటైర్ల‌తో విరుచుకుపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేప‌థ్యం లో అటు ప‌త్రిక‌, ఇటు టీవీ చానెల్ లో ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా సాక్షి కీల‌క రాజ‌కీయ క‌థ‌నాల విష‌యంలో జ‌గ‌న్ కూడా అసంతృప్తి ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఎడిటోరియ‌ల్ బోర్డ్ డైరెక్ట‌ర్ గా ఉన్న రామ‌చంద్ర‌మూర్తి తో పాటు టీవీ షోలు నిర్వ‌హిస్తున్న అమ‌ర్, కొమ్మినేని ప‌ట్ల కూడా జ‌గన్ సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. దాంతో పొలిటిక‌ల్ ఎఫైర్స్ టీమ్ లో కొన్ని మార్పుల‌కు రంగం సిద్ధం చేసిన‌ట్టు సాక్షి వ‌ర్గాల్లోనే ప్ర‌చారం సాగుతోంది. అయితే సాక్షి సంస్థ‌ల్లోRead More


బాబు కి షాక్, జెండా ఎగ‌రేస్తున్న జ‌గ‌న్!: తాజా స‌ర్వే

స‌ర్వేల విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌తీ ఒక్క‌రికీ రోజూ నేను మీ చంద్ర‌బాబు అంటూ పదే ప‌దే స‌ర్వే కాల్స్ వ‌స్తున్న విష‌యం అంద‌రికీ అనుభ‌వ‌మే. అలాంటి చంద్ర‌బాబుకి షాకిచ్చే రీతిలో స‌ర్వే విడుద‌ల‌య్యింది. అయితే రిప‌బ్లిక్ టీవీ ప్ర‌సారం చేయ‌డంతో లైట్ తీసుకొవ‌చ్చ‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ, స‌ర్వేల విష‌యంలో కొంత స‌మ‌గ్ర‌త ఉంటుంద‌ని భావించే సీ ఓట‌ర్ సంస్థ చేసిన స‌ర్వే ఫ‌లితాలు కావ‌డం చంద్ర‌బాబు క్యాంపులో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ స‌ర్వే ప్ర‌కారం కేంద్రంలో ఎన్డీయే అత్తెస‌రు సీట్ల‌తో గ‌ట్టెక్కుతుంది. అదే స‌మ‌యంలో తెలంగాణాలో టీఆర్ఎస్ కి గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. కాంగ్రెస్ పుంజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు కొన్ని చేజార్చుకుంంటుంద‌ని స‌ర్వేలో పేర్కొన్నారు. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం ఫ్యాన్ గాలికి ఎదురులేదు. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం అనివార్యంRead More


కోటలో సెట్ చేసిన జగన్

విజయనగరం లో వైసీపీ వ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. వాస్తవానికి బొత్సా సత్తిబాబుతో విబేధించి వైసీీపీలో చేరిన కొలగొట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. కానీ అంతలోనే బొత్సా ఫ్యామిలీ వైసీపీ గూటికి చేరడంతో కొలగొట్ల ప్రాధాన్యత తగ్గినట్టు కనిపించింది. పైగా విజయనగరంలో ఇలాకాలో నిత్యం ఆధిపత్య పోరు సాగుతుండేది. అయితే తాజాగా జగన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో విజయనగరం వ్యవహారాలు ఇప్పుడు దాదాపుగా సర్థుకున్నట్టేనని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం విజయనగరం సీటుపై పలువురు కన్నేశారు. మాజీ ఎమ్మెల్యే కూడా అయిన వీరభద్రస్వామి మరోసారి అసెంబ్లీ బరిలో దిగాలని ఆశించారు. అంతలోనే ఈ సీటు తనకే దక్కుతుందంటూ బొత్సా మేనల్లుడు చిన్ని శ్రీను ప్రచారం చేసుకున్నారు. వారితో పాటుగా అవనాపు బ్రదర్స్ గట్టిగా ప్రయత్నించారు. దాంతో ఈ సీటు ఎవరికి కేటాయిస్తారోననేRead More


పాదయాత్రలో పాల్గొన్న పంతుళ్లు సస్ఫెన్షన్

తమ జీవితాలకు భారంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేయాలని అడగడం వారి పాపం అయ్యింది. పాఠాలు చెబుతున్న తమకు జీవిత భద్రత కల్పించాలని కోరడం నేరం అయ్యింది. అంతే ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న తొమ్మిది మంది టీచర్లను సస్ఫెండ్ చేశారు. విశాఖ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయులను సస్ఫెండ్ చేయడం విశేషంగా మారింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం పోరాడుతోంది. అందులో భాగంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పాదయాత్రలో వైఎస్ జగన్ ని కలిశారు. ఆయనకు వినతిపత్రం అందించారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఆయన అధికారంలోకి రాగానే చేస్తానని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. కానీ దానిని విద్యాశాఖాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విద్యామంత్రి గంటా సొంత నియోజకవర్గంలో జగన్ ని కలిసి,Read More


వైసీపీకి ఊహించ‌ని షాక్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార ఊహాల్లో ఉన్న వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఏకంగా ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే పేరుతో స్థానికంగా బ‌ల‌మున్న నేత‌ను కాద‌ని ఎంపిక చేయ‌డ‌మే కాకుండా, ఏకంగా ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత కూడా ఓ నాయ‌కుడు క‌నిపించ‌కుడా పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో ప్ర‌త్యామ్నాయంగా కొత్త నేత‌ల కోసం వెదుకులాట ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి కొంత ప‌ట్టుంది. కానీ దానికి త‌గ్గ‌ట్టుగా నాయ‌క‌త్వం స‌మ‌న్వ‌యంతో సాగుతార‌న్న ధీమా క‌నిపించ‌డం లేదు. దాంతో తాజాగా మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ద‌ర్శిలో త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ ని కాద‌ని ఇక్క‌డి నుంచి బాదం మాధ‌వ‌రెడ్డిని జ‌గ‌న్ ఎంపిక చేశారు. జ‌నాల‌కు ప‌రిచ‌యం కూడా చేసేశారు. కానీ తీరా చూస్తే మాధ‌వ‌రెడ్డి అనూహ్యంగా దూర‌మ‌య్యారు.Read More