Main Menu

VIZAG

 
 

ఇద్ద‌రు ఎంపీల వెనక‌డ‌గు

ఎన్నిక‌ల వేళ నేత‌లంతా త‌మ భ‌విత‌వ్యం గురించి ఆలోచ‌న‌లు మొద‌లు పెట్టారు. త‌మ‌కు ఏది సుర‌క్షితం అనే విషయంలో ఆచితూచి అడుగులేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీకి విశాఖ నుంచి కంభంపాటి హ‌రిబాబు, న‌ర్సాపురం గోక‌రాజు గంగ‌రాజు ఎంపీలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మద్ధ‌తుతో ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. గ‌తంలో ప‌లుమార్లు బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌యిన హ‌రిబాబు తో పాటు తొలిసారి బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ గోక‌రాజు కూడా విజ‌యం సాధించి మొద‌టి సారిగా పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మారిన రాజ‌కీయాల్లో ఏపీలో బీజేపీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. దానిని అధిగ‌మించేందుకు క‌మ‌లం పెద్ద‌లు క‌స‌ర‌త్త‌లు చేస్తున్నారు. పార్టీకి ఏపీ శాఖ అధ్య‌క్షుడినిRead More


విశాఖ టీడీపీకి కొంచెం చేదు, కొంచెం తీపి

విశాఖ న‌గ‌రంలో వ్య‌వ‌హారాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. నిన్న‌టి వ‌ర‌కూ టీడీపీ నేత‌లపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు ఇప్పుడు అధికార టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డ‌మే దానికి కార‌ణం. వైసీపీలోకి వెళ్లాల‌ని భావించిన‌ప్ప‌టికీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో చివ‌రకు విష్ణుకుమార్ రాజు సైకిల స‌వారీకి సిద్ధ‌మ‌య్యారు. దాంతో ఇప్పుడు విశాఖ ఉత్త‌రం సీటు మీద కొండంత ఆశ‌తో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ప‌రిస్థితి ఏమిట‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్న స‌బ్బం హ‌రిని సంతృప్తిప‌రిచేందుకు ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎలాంటి ఆఫ‌ర్ ఇస్తార‌న్న‌ది ఇప్పుడు చర్చ‌నీయాంశం అవుతుంది. ఉత్త‌ర సీటు అయితే సునాయాసంగాRead More


వైసీపీలో రాజీనామాల ప్ర‌కంప‌న‌లు

విపక్ష వైసీపీ వ్య‌వ‌హారాలు ర‌చ్చ‌కు దారితీస్తున్నాయి. వ‌రుస‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ఆపార్టీ వ్య‌వ‌హారాల్లో వేడి రాజుకుంటోంది. ఇప్ప‌టికే కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో అశోక్ బాబు వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. తాజాగా పెద‌కూర‌పాడులో కోఆర్డినేట‌ర్ తొల‌గింపు త‌ల‌నొప్పిగా మారింది. ఆ త‌ర్వాత మండ‌పేట‌లో కూడా కోఆర్డినేట‌ర్ గా ప‌నిచేసిన వేగుళ్ల లీలా కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఈ వ్య‌వ‌హారం విశాఖ వ‌ర‌కూ చేరింది. పార్టీ ఆవిర్భాం నుంచి వైసీపీలో ఉన్న మ‌హిళా నేత ప‌సుపులేటి ఉషా కిర‌ణ్ పార్టీని వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌రుపున ఉషా కిర‌ణ్ పార్టీ ఆవిర్భావం నుంచి జ‌గ‌న్ వెంట ఉన్నారు. ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేటర్ గా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం పార్టీలో రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శిగా కూడా ఉన్నారు. అంతేగాకుండా వైసీఈప మ‌హిళా విభాగం విశాఖ జిల్లా అధ్య‌క్షురాలిగాRead More


క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ తెలుగు చానెల్

తెలుగు చానెల్ ఏపీ 24*7 ప‌రువు గంగ‌లో క‌లిసింది. తాజాగా వైజాగ్ ఘ‌ట‌న‌లో ఆ చానెల్ చేసిన ప్ర‌చారాలు ప‌రువు తీశాయి. పెను త‌ప్పిదం ప్ర‌సారం కావ‌డంతో చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ పై ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడి ఘ‌ట‌న ప్ర‌సారం స‌మ‌యంలో జ‌రిగిన త‌ప్పిదం ప్ర‌కారం టీడీపీ నేత హ‌ర్ష‌వ‌ర్థ‌న్ కి బ‌దులుగా జ‌న‌సేన నేత సుంద‌ర‌పు విజయ్ కుమార్ ఫోటో ప్ర‌సారం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దాంతో సోష‌ల్ మీడియాలో ఆ చానెల్ పై తీవ్ర‌స్థాయిలో జ‌న‌సైనికులు మండిప‌డ్డారు. చివ‌ర‌కు ఓ అడుగు వెన‌క్కి వేసిన చానెల్ యాజ‌మాన్యం త‌మ త‌ప్పును గుర్తించింది. క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన జ‌నుప‌ల్లి శ్రీనివాస్ ఫ్యూజ‌న్ రెస్టారెంట్ లో ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ రెస్టారెంట్ య‌జ‌మాని తొట్టెంపూడిRead More


ఆఖ‌రికి అంత్య‌క్రియ‌ల్లోనూ అదే తీరు..!

ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వ తీరు ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. ఆఖ‌రికి అంత్య‌క్రియ‌ల్లో కూడా వంద‌ల ఎక‌రాల సొంత భూములు వ‌దిలేసి స‌ర్కారు భూముల‌పై క‌న్నేయ‌డం విశేషంగా మారింది. ఏపీలో భూపందేరం విష‌యంపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. చివ‌ర‌కు నారా లోకేష్ తోడ‌ల్లుడు , బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు భ‌ర‌త్ కి సీఆర్డీయే స‌మీపంలో కేటాయించిన భూముల‌పై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. న్యాయ‌ప‌రంగానూ కొంద‌రు స‌వాల్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అలాంటి భ‌ర‌త్ కి సొంత తాత అయిన ఎంవీఎస్ మూర్తి ఇటీవ‌ల అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచింది. గీతం విద్యాసంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడిగా ఆయ‌న‌కు వంద‌ల ఎక‌రాల భూములున్నాయి. అయినా చివ‌ర‌కు ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత స‌ర్కారు స్థ‌లం తీసుకోవ‌డం విశేషంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండ‌గా చ‌నిపోవ‌డంతో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయించ‌డంలో ఆశ్చ‌ర్యంRead More


విశాఖ‌కు అనుకోని అవ‌కాశం

విశాఖ న‌గ‌రానికి అనుకోని అవ‌కాశం ద‌క్కింది. విండీస్ తో త‌ల‌బ‌డ‌బోతున్న టీమిండియా సిరీస్ లో రెండో వ‌న్డేకి ఆతిథ్యం అందించే అవ‌కాశం విశాఖ చేజిక్కించుకుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) ఈ విషయం స్పష్టం చేసింది. ఇండోర్‌లో అక్టోబర్‌ 24న ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం, బిసిసిఐ మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఆతిథ్యం విశాఖకు దక్కింది. ‘భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగే రెండో వన్డేకు విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది’ అని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. బిసిసిఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియంలోని టికెట్లలో 90 శాతం విక్రయానికి ఉంచాలి. దాంతో కేవలం 10 శాతం కాంప్లిమెంటరీ టికెట్లు మాత్రమే రాష్ట్ర సంఘాలకు ఉంటాయి. ఇండోర్‌లోని హౌల్కర్‌Read More


పాదయాత్రలో పాల్గొన్న పంతుళ్లు సస్ఫెన్షన్

తమ జీవితాలకు భారంగా మారిన సీపీఎస్ విధానం రద్దు చేయాలని అడగడం వారి పాపం అయ్యింది. పాఠాలు చెబుతున్న తమకు జీవిత భద్రత కల్పించాలని కోరడం నేరం అయ్యింది. అంతే ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న తొమ్మిది మంది టీచర్లను సస్ఫెండ్ చేశారు. విశాఖ జిల్లాలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయులను సస్ఫెండ్ చేయడం విశేషంగా మారింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం పోరాడుతోంది. అందులో భాగంగా వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పాదయాత్రలో వైఎస్ జగన్ ని కలిశారు. ఆయనకు వినతిపత్రం అందించారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. ఆయన అధికారంలోకి రాగానే చేస్తానని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. కానీ దానిని విద్యాశాఖాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విద్యామంత్రి గంటా సొంత నియోజకవర్గంలో జగన్ ని కలిసి,Read More


బాక్సైట్ పై బాబు మాట‌ల్లో నిజ‌మెంత‌?

బాక్సైట్‌ తవ్వబోమని ఏపీ సీఎం ప్ర‌క‌టించారు. విశాఖ మ‌న్యంలో క‌ల‌క‌లం రేపుతున్న బాక్సైట్ వ్య‌వ‌హారంలో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌కు , వాస్త‌వానికి పొంత‌న ఉందా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బాక్సైట్ తవ్వకాలకు విడుదల చేసిన జిఒ 97 ర‌ద్దు విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డమే దానికి మూలంగా క‌నిపిస్తోంది. విశాఖ ఏజెన్సీలో జర్రెల, సప్పర్ల అటవీ భూముల్లోని 1,212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు 2015 నవంబరు 5న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసింది. ఇటీవ‌ల అర‌కు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల‌పై మావోయిస్టులు విరుచుకుప‌డ‌డానికి ఆ 97 కార‌ణంగా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే దివంత‌గ‌త ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన చంద్ర‌బాబు బాక్సైట్ పై అస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. బాక్సైట్ త‌వ్వేదిRead More


ఉత్త‌రాంధ్ర టీడీపీలో కొత్త త‌గాదా!

విశాఖ జిల్లా వ్య‌వ‌హారాల‌తో పాటు ఉత్త‌రాంధ్రలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త పంచాయితీ షురూ అయ్యింది. తాజాగా ఏర్ప‌డిన విశాఖ మెట్రో రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ గిరీ కోసం నేత‌లు రేసు ప్రారంభించారు. వీఎంఆర్డీయే ప‌ద‌వి త‌మ‌కంటే త‌మ‌కే కావాల‌ని కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఉడా స్థానంలో వ‌చ్చిన కొత్త సంస్థ మీద పెత్త‌నం సాధిస్తే మూడు జిల్లాల ప‌రిధిలో త‌మ హ‌వా న‌డుస్తుంద‌ని ఆశిస్తున్నారు. దాదాపుగా క్యాబినెట్ హోదాతో స‌మానమ‌ని భావిస్తున్నారు. దాంతో త‌మ‌కు మంత్రి ప‌ద‌వి విష‌యంలో జ‌రిగిన అన్యాయాన్ని స‌రిదిద్ద‌డానికి ఈ ఛాన్స్ కావాలంటూ కొంద‌రు సీనియ‌ర్లు కోరుతున్నారు. దాంతో వీఎంఆర్డీఏ వ్య‌వహారం ఓ కొలిక్కి వ‌స్తుందా రాదా అన్న అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. సీనియ‌ర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ‌సుంద‌ర్ శివాజీ ఈ ప‌ద‌వి ని కోరుకుంటున్నారు. ఆయ‌న‌కు పోటీగాRead More


ఆనం, నేదురుమల్లికి వేదిక ఖ‌రారు

వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి., బీజేపీ నేత నేదురుమ‌ల్లి రాం కుమార్ రెడ్డి చేరిక‌కు ముహూర్తం ఖారార‌య్యింది. వేదిక కూడా సిద్ధ‌మ‌వుతోంది. విశాఖ జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పార్టీ కండువాలు క‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే విశాఖ ఆర్కే బీచ్ లో వైసీపీ నిర్వ‌హించ‌బోయే బ‌హిరంగ‌స‌భ‌లో వైసీపీ లో అధికారిక చేరిక ఖ‌రారు చేయాల‌ని ఈ నేత‌లిద్ద‌రూ వేచి చూస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే సెప్టెంబ‌ర్ 2న ముహూర్తం ఖాయం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ రోజు విశాఖ న‌గ‌రంలో భారీ స‌భ నిర్వ‌హించాల‌ని వైసీపీ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్నాహాలు చేస్తోంది. అదే వేదిక‌పై ఈ నేత‌లిద్ద‌రితో పాటు మ‌రికొంద‌రు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వైజాగ్ బీచ్ బ‌హిరంగ‌స‌భ‌కు త‌గ్గ‌ట్టుగా ఈ నేత‌లిద్ద‌రు నెల్లూరు నుంచి త‌మRead More