Main Menu

VISHAL

 
 

విశాల్ ని పెళ్లి చేసుకోవ‌డం లేదు…!

కోలీవుడ్ హాట్ జంట విశాల్, వ‌ర‌ల‌క్ష్మీ వ్య‌వ‌హారం నిత్యం వార్త‌ల్లో ఉంటుంది. తాజాగా వారి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా పందెంకోడి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి స‌క్సెస్ కొట్టింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన వ‌రూ కామెంట్స్ ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. వ‌రూ త‌న సోల్ మేట్ అంటూ విశాల్ చేసిన వ్యాఖ్య‌లు ఇంకా మ‌ర‌వ‌క‌ముందే వ‌ర‌ల‌క్ష్మీ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యే రీతిలో కామెంట్స్ చేసింది. ఇటీవలే రిలీజైన ‘పందెంకోడి2’ సినిమాలో లేడీ విలన్‌గా ఇంప్రెస్‌ చేసి, తొలి సినిమాకే తెలుగు ఆడియెన్స్‌ దగ్గర మార్కులు కొట్టేసింది వరలక్ష్మి. ఆ ఇంపాక్ట్‌ ఇంకా తగ్గనే లేదు. అప్పుడే విజరు ‘సర్కార్‌’ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఆ నేప‌ధ్యంలోనే విశాల్ కామెంట్స్ పై స్పందించింది. … ”విశాల్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. మాRead More


వ్య‌భిచారం కేసులో శ్రీరెడ్డి అరెస్ట్..?

టాలీవుడ్ సంచ‌న‌ల నటి శ్రీరెడ్డి పై అరెస్టు మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. త్వ‌ర‌లోనే ఆమెను అదుపులోకి తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఇప్ప‌టికే ఆమెపై కేసు నమోదైంది. ప‌లువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అవకాశాలు ఇస్తామని నమ్మించి, నటీమణుల్ని మోసగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తొలుత టాలీవుడ్‌ ప్రముఖుల్ని టార్గెట్‌ చేసిన ఆమె కొన్నిరోజులుగా కోలీవుడ్‌పై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌, రాఘవా లారెన్స్‌ తదితరుల గురించి ఆరోపణలు చేశారు. దీంతో న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్‌ ఇటీవల శ్రీరెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. ఆమె ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయం గురించి ఇటీవల కార్తి మాట్లాడుతూ.. నిజంగా సమస్య ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాRead More


శ్రీరెడ్డికి విశాల్ ఝ‌ల‌క్

కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో ఆయ‌న సీరియ‌స్ గా క‌నిపిస్తున్నారు. ఈ సంచ‌ల‌న న‌టి వ్య‌వ‌హారంపై ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా ఆమెకు నోటీసులు జారీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కొంతకాలంగా ప్రముఖ నటులను క్యాస్టింగ్ క‌\చ్ కాంట్రవర్శీలోకి లాగుతున్న శ్రీరెడ్డి ఇటీవ‌ల విశాల్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేసింది. తన ఫేస్‌బుక్ పేజిలో కొందరు కోలీవుడ్ ప్రముఖుల గురించి ఆరోపణలు గుప్పించింది. అంతేకాకుండా నడిగర్ సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న విశాల్ తనను కాల్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో కోలీవుడ్ త‌రుపున విశాల్ ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా విశాల్ లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో విశాల్Read More


ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. హీరోగా, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కి విశేష‌మైన గుర్తింపు ఉంది. తెలుగువాడ‌యిన‌ప్ప‌టికీ త‌మిళ‌నాటే గుర్తింపు సాధించారు. అయితే తాజాగా ఆయ‌న ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. గ‌తంలో విశాల్‌ ఇరుంబుతిరై అనే చిత్రంలో నటించే సమయంలో గాయపడ్డాడు. అపుడు ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. కానీ, ఆయన తాత్కాలికంగా వైద్యం చేయించుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. దీంతో ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.Read More


విశాల్ కి మ‌రో విజ‌యం

త‌మిళ‌గ‌డ్డ మీద అన్నిర‌కాలుగానూ దూసుకుపోతున్న తెలుగుబిడ్డ విశాల్ మ‌రో ఖ్యాతి గ‌డించాడు. హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ తాను హీరోనేన‌ని చాటుకున్నాడు. నిర్మాత మండ‌లి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కోలీవుడ్ లో మరోసారి చరిత్ర సృష్టించారు. ఏడాదిన్నర క్రితం నటుడిగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విశాల్‌ ఇప్పుడు నిర్మాతగాను తన సత్తా నిరూపించుకున్నారు. 2017-19 సంవత్సరాలకు తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విశాల్‌ సంచలన విజయం సాధించారు. ఆయన జట్టు తరపున పోటీచేసిన ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలుపును సొంతం చేసుకున్నారు. సీనియర్‌ తమిళ నిర్మాత రాధాకృష్ణన్, తెలుగు నిర్మాత కోదండరామయ్య (కేఆర్‌), విశాల్‌ జట్లతో త్రికోణపోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశాల్‌Read More


మ‌రోసారి తానేంటో నిరూపించుకున్న విశాల్

త‌మిళ స్టార్ హీరో అయిన తెలుగు బిడ్డ ఎంత సెల‌బ్రిటీగా ఉన్న సామాన్యుల ప‌క్షానే ఆలోచిస్తాడు. ఇప్ప‌టికే పలుమార్లు ఈ విష‌యం రుజువ‌య్యింది. వ‌ర‌ద‌లొచ్చినా, విప‌త్తులు ముంచుకొచ్చినా సామాన్యుడిలా మారిపోయి అంద‌రికీ చేయూత‌నందించ‌డంలో ముందు నిలుస్తాడు. ఇక ఇప్పుడు ప్ర‌భుత్వ విధానాల మూలంగా న‌ష్ట‌పోతున్న అన్న‌దాత‌ల త‌రుపున త‌న స్వ‌రం వినిపించాడు. క‌ర్ష‌కుల కోసం రోడ్డెక్కాడు. ఏకంగా ఢిల్లీ న‌డివీధుల్లో ధ‌ర్నా చేప‌ట్టాడు.. మ‌రో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు కూడా ఈ ధ‌ర్నాలో పాల్గొన్నారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాల‌ని నిన‌దించారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో రైతు ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి. దాని మీద స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు రైతు సంఘం ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టింది. దానికి సంఘీభావంగా న‌డిగార్ సంఘం త‌రుపున విశాల్ స్వ‌యంగా పాల్గొన్నాడు. రైతు ఆత్మ‌హ‌త్య‌లుRead More


చంపేయాలంటున్న విశాల్

ప్రముఖ మలయాళ నటిపై జరిగిన లైంగిక దాడి దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులను, సామాన్య ప్రజలను కలిచివేస్తోంది. కేరళలోని ఎర్నాకులంలో జరిగిన ఆ ఘటనను ఖండిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. తాజాగా కన్నడ స్టార్‌ హీరో ‘కిచ్చ’ సుదీప్‌, తమిళ నటుడు విశాల్‌ నిందితులపై నిప్పులు చెరిగారు. విశాల్‌ స్పందిస్తూ.. ‘ప్రఖ్యాత నటి అయ్యుండీ ఇలాంటి ఘటన గురించి ధైర్యంగా బయటకు చెప్పడం ఎంతో గొప్ప విషయం. ఎంతో భద్రత ఉండే సెలబ్రిటీకే ఇలా జరిగితే.. ఇక సామాన్య స్త్రీ పరిస్తితి ఏంటి? నటుల సంఘం తరపున కేరళ ముఖ్యమంత్రికి ఓ లేఖ పంపాము. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడే వారిని తుపాకీతో కాల్చి చంపాలని’ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై సుదీప్‌ మాట్లాడుతూ..Read More


విశాల్ కి రిలీఫ్ ద‌క్కింది..!

తమిళ హీరో విశాల్‌‌పై ఉన్న నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌‌ను ఎత్తివేసింది. మండలి నుంచి అన్యాయంగా తనను తొలగించారని విశాల్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మద్రాస్ హైకోర్టు నిశితంగా విచారించిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్మాతల మండలికి కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో నిర్మాత మండలి సస్పెన్షన్ ఎత్తివేసింది. మొత్తానికి సస్పెన్షన్ విషయంలో విశాల్‌‌కు ఊరట లభించినట్లైంది. తమిళ నిర్మాతల మండలి తీరుపై ఆగ్రహించి.. సమస్యలను తీర్చకుండా కట్ట పంచాయితీ నిర్వహిస్తున్నారని మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మండలి విశాల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. కాగా విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు నిర్మాతల మండలిలోనూ సభ్యుడే. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో విశాల్ తరపున బృందం గట్టిపోటీ చేయనుందనిRead More


రేసు నుంచి విశాల్ అవుట్..!

కరెన్సీ కష్టాలు సినీ రంగాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా జనం చేతుల్లో సరిపడ్డా డబ్బులు లేకపోవటంతో థియేటర్ల వరకు వస్తారా అన్న అనుమానం వ్యక్తం చేసుకున్నారు సినీ జనాలు. దీంతో పరిస్థితులు చక్కబడే వరకు తమ సినిమాలు వాయిదా వేసుకోవటమే బెటర్ అని భావిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి ఒకటి రెండు సినిమాలు రిస్క్ చేసినా.. అందరు హీరోలు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తాజాగా విశాల్ కూడా తన సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ నాట వరుస హిట్స్తో దూసుకుపోతున్న విశాల్, టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అదే జోరులో డిసెంబర్ 2న ఒక్కడొచ్చాడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయటం కన్నా వాయిదా వేయటమే బెటర్Read More


హీరో విశాల్ కి షాక్..!

హీరో విశాల్ కి షాక్ త‌గిలింది. తమిళ నిర్మాతల మండలి(టీఎఫ్ పీసీ) నిర్ణ‌యం విశాల్ కి స‌మ‌స్య‌గా మారింది. హీరోగానే కాకుండా ప‌లు సినిమాలు స్వ‌యంగా నిర్మిస్తున్న విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో నిర్మాతల మండలిపై విశాల్ చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలనంటూ టీఎఫ్ పీసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన విశాల్ లేఖ ద్వారా టీఎఫ్ పీసీకి వివరణ ఇచ్చారు. విశాల్ లేఖను పరిశీలించిన నిర్మాతల కార్యనిర్వహణ కమిటీ వివరణ సరిగా లేదని పేర్కొంది. దీంతో తాత్కాలికంగా విశాల్ మెంబర్ షిప్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వ్య‌వ‌హారంపై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం కోలీవుడ్ వ‌ర్గాల్లోRead More