Main Menu

vijayawada

 
 

వంగ‌వీటి వ‌ర్థంతి నాడు రాధా సంచ‌ల‌న నిర్ణ‌యం?

బెజ‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం ఖాయం అయిన‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ రాజ‌కీయాల‌తో మిళిత‌మైన వంగ‌వీటి కుటుంబం ప్ర‌తినిధి వంగ‌వీటి రాధా కీల‌క నిర్ణయం తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే దానికి ముహూర్తం కూడా ఖ‌రార‌యిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన వంగ‌వీటి రాధా ఈసారి మ‌రో కొత్త పార్టీలోకి జంప్ చేయ‌డానికి , జెండా మార్చ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టు భావించ‌వ‌చ్చ‌ని స‌న్నిహితులే చెబుతున్నారు. వంగ‌వీటి రాధా గ‌తంలో కాంగ్రెస్ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆత‌ర్వాత పీఆర్పీ నుంచి పోటీ చేసిన ఓటమి పాల‌య్యారు. గ‌డిచిని ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగానూ ప‌రాజ‌యం చ‌విచూశారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థిగా రంగంలో దిగేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు చెబుతున్నారు. వాస్త‌వానికి ఆయ‌న వైసీపీ నుంచి విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు ఆశించారు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో ఆయ‌న పెట్టుకున్న ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతూ తూర్పు నుంచిRead More


వంగ‌వీటి రాధా ప‌య‌నం ఎటు?

వైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. తాజాగా పార్ల‌మెంట‌రీ కోఆర్డినేట‌ర్ల నియామ‌కం కొత్త ర‌చ్చ‌కు దారితీస్తోంది. కృష్ణా జిల్లా వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా వంగ‌వీటి రాధా కేంద్రంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌య‌వాడ నుంచి బ‌రిలో దిగాల‌ని రాధా ఆశిస్తున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో తూర్పు స్థానం నుంచి బ‌రిలో దిగి ఓట‌మి పాల‌యిన త‌ర్వాత ఆయ‌న సెంట్ర‌ల్ సీటు మీద క‌న్నేశారు. అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు కూడా చేశారు. అయితే ఇప్పుడు సెంట్ర‌ల్ సీటు దాదాపుగా మ‌ల్లాది విష్ణుకి ఖాయం చేస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా రావాలి జ‌గ‌న్-కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మాన్ని మ‌ల్లాది విష్ణు ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు అభ్య‌ర్థిగా ఆయ‌న్ని ఖ‌రారు చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. వెస్ట్ స్థానాన్నిRead More


మీడియాలో క‌మ్యూనిస్టుల‌ ‘లెప్ట్’..!

మీడియాలోనే కాదు..అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అది నిత్యం జ‌రుగుతూనే ఉంటుంది. అయితే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, ప్ర‌జ‌లంద‌రి ప్ర‌యోజ‌నాల‌క‌నుగుణంగా సాగితే అది స‌మాజ వికాసానికి దారితీస్తుంది. కానీ దానికి భిన్నంగా కొంద‌రి ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా కార్పోరేట్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌రిణామాలు మారుతుంటే అది పెనుముప్పున‌కు సంకేతంగా భావించ‌వ‌చ్చు. ఇక మీడియాలో ఈ మార్పు మ‌రింత న‌ష్టం చేకూరుస్తుంది. వాస్త‌వానికి మీడియా అంటే ప్ర‌జాభిప్రాయం వినిపించే సాధ‌నం అనుకున్న‌ప్పుడు , అందులో అన్ని త‌ర‌గ‌తుల‌కు, అన్నివ‌ర్గాల‌కు ప్రాతినిథ్యం ఉండాలి. అందులోనూ సామాన్యుల‌కు, అట్ట‌డుగువ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే అది ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధం అని చెప్ప‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం దానికి భిన్నం. అభిప్రాయాల‌ను రూపొందించేందుకే మీడియా అన్న‌ట్టుగా మారిపోయింది. కొన్ని త‌ర‌గతుల ప్ర‌జ‌ల‌ను త‌మ‌క‌నుకూలంగా మ‌లుచుకునే ఉద్దేశంతో వార్త‌ల ప్ర‌సారం, ఇత‌ర రూపాల్లో ప్ర‌య‌త్నిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌మాచార పంపిణీRead More


అభిమాని అంత్య‌క్రియ‌ల‌కు ప‌వ‌న్ వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీర‌భిమాని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. బెజ‌వాడ‌లో ఈ విష‌యం క‌ల‌క‌లం రేపుతోంది. పైగా చ‌నిపోయే ముందు నేరుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి లేఖ రాసి మ‌ర‌ణించ‌డం విశేషంగా మారింది. ఆ లేఖ‌ను త‌న అభిమాన హీరో చ‌ద‌వాల‌ని అత‌డు పేర్కొన‌డం విశేషంగా మారింది. విజయవాడకు చెందిన కొమరవల్లి అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ని విషాదంలో ముంచింది. తల్‌వాకర్స్‌ జిమ్‌లో ట్రైనర్‌గా అనిల్‌ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయే ముందు పవన్‌ కల్యాణ్‌కు అనిల్‌ ఓ లేఖ రాశారు. దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారనిRead More


రోడ్డు ప్ర‌మాదం, త‌ప్పించుకున్న ఎమ్మెల్యే, ఇద్ద‌రు మృతి

మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈసారి విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో భార్య‌, భ‌ర్తలు ప్రాణాలు కోల్పోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం తృటిలో త‌ప్పించుకున్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్ప‌డంతో స్కూటీపై పెళుతున్న భార్య‌, భ‌ర్త చ‌నిపోయారు. నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వస్తున్న ఎమ్మెల్యే పోతుల రామారావు కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లో హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పోతుల రామారావు తన కారులో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ ఎమ్మెల్యే కారు ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న భార్య, భర్తల్లో భార్య అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా, భ‌ర్త ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌డంతో విషాదం అల‌ముకుంది. ఇదేRead More


న‌గ్న‌ఫోటోల‌తో బెదిరింపు, జ‌ర్న‌లిస్టుల అరెస్ట్

పాత్రికేయం ఎప్పుడో ప‌క్క‌దారి ప‌ట్టింద‌న‌డంలో సందేహం లేదు గానీ, ఓ వృద్ధుడిని తీవ్ర మానసిక వేధనకు గురిచేసిన విష‌యంలో జ‌ర్న‌లిస్టుల తీరు విస్మ‌యానికి గురిచేస్తోంది. దాంతో ఈ వ్య‌వ‌హారంలో పోలీసులు జోక్యం చేసుకుని అరెస్టులు చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లాలో జ‌రిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్‌కు చెందిన విజయవాడ రిపోర్టర్ ఏడుకొండలు, అదే ఛానల్‌కు చెందిన మచిలీపట్నం రిపోర్టర్ కొనకళ్ల గిరిబాబు, ఐ న్యూస్ ఛానల్‌కు చెందిన మోటేపల్లి కోటేశ్వరరావులు.. మ‌చిలీప‌ట్నం ప్రాంతానికి చెందిన రైతు చేసిన త‌ప్పిదాన్ని సాకుగా చూపించి వృద్ధుడ‌యిన అత‌డిని బెదిరించి వివస్త్రను చేశారు. ఆ వ్యక్తిని వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేశారు. పది లక్షలు ఇవ్వమని బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని తన గ్రామస్థులకు చెప్పడంతో.. వారి ముగ్గురిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకుRead More


అశోక్ బాబుకి చేదు అనుభ‌వం

ఏపీ ఎన్జీవో నాయ‌కుడు ప‌రుచూరి అశోక్ బాబుకి చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది. ఆయ‌న్ని వ్య‌తిరేకిస్తూ ఫ్యాఫ్టో ఉపాధ్యాయ‌సంఘాల ప్ర‌తినిధులు నినాదాలు చేశారు. అశోక్ బాబు ఉప‌న్యాసాన్ని అడ్డుకున్నారు. ఆయ‌న్ని వేదిక మీద‌కు పిల‌వ‌డాన్నే నిర‌సించారు. దాంతో ఫ్యాఫ్టో ఆధ్వ‌ర్యంలో సీపీఎస్ కి వ్య‌తిరేకంగా విజ‌య‌వాడలో సాగుతున్న ఆందోళ‌న ఉద్రిక్తంగా మారింది. ప‌లువురు ఉపాధ్యాయులు అశోక్ బాబు తీరుని తీవ్రంగా నిర‌సించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వంత పాడుతూ ఉద్యోగ‌, ఉపాధ్యాయుల‌కు అన్యాయం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. దాంతో చివ‌ర‌కు అశోక్ బాబు ఉప‌న్యాసం ముందుకు సాగ‌లేదు. ఏపీ జేఏసీ నాయ‌కుడి హోదాలో వ‌చ్చిన అశోక్ బాబుకి ఇదో ఘోర అవ‌మానంగా భావిస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విధానాల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్నందుకు ఉపాద్యాయుల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని ఇది ప్ర‌స్ఫుటం చేస్తోంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లో టీడీపీలో చేరే అవ‌కాశం ఉంది.ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఈ విష‌యాన్నిRead More


ఆర్టీసీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎదురుదెబ్బ‌

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీ అధికార ప‌క్షానికి చెంప‌దెబ్బ త‌గిలింది. ఏకంగా మంత్రి అచ్చెన్నాయుడు స్వ‌యంగా ప్ర‌చారంలో దిగి ఎన్ఎంయూ విజ‌యం కోసం శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఐక్య కూట‌మి ముందు పాల‌క‌ప‌క్ష మ‌ద్ధ‌తుదారు త‌ల‌వంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప‌క్షం మీద తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపించింది. దాంతో సిట్టింగ్ యూనియ‌న్ ఎన్ఎంయూ ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూగో, విజ‌య‌వాడు. గుంటూరు. నెల్లూరు. అనంత‌పురం , తిరుప‌తి స‌హా అన్ని రీజియ‌న్ల‌లోనూ ఎన్ఎంయూ ఓటమి పాల‌య్యింది. కేవ‌లం ప‌గోలో మాత్ర‌మే విజ‌యం సాధించి ప‌రువు కాపాడుకున్న‌ట్ట‌య్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియ‌న్ ఐక్య కూట‌మి సాధించిన ఫ‌లితాలు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ విధానాల‌కు చావుదెబ్బ వంటిద‌ని ఈయూ, స‌హా ప‌లువురు నేత‌లు పేర్కొన్నారు. ఎస్ డ‌బ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూడా ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు.Read More


చీర ఎత్తుకెళ్లింది టీడీపీ నేత‌..!

బెజ‌వాడ అమ్మ‌వారి ఆల‌యంలో చీర ఎత్తుకెళ్లిన సంగ‌తి దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన పెద్ద‌లే ఈ వ్య‌వ‌హార‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాజ‌కీయంగానూ దుమారం రేపుతోంది. క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ఆల‌యంలో చీర దొంగ‌త‌నం కేసులో ఇప్పుడు అంద‌రి వేళ్లూ పాల‌క‌మండ‌లి స‌భ్యురాలు సూర్య‌ల‌త‌కుమారి వైపు క‌నిపిస్తున్నాయి. చివ‌ర‌కు ఈవో కూడా ఆమెను దోషిగా చూపుతూ ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అర్చ‌కులు కూడా బ‌హిరంగంగానే మీడియా స‌మావేశంలో ఆమె మీద విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేగాకుండా వాంగ్మూలంలో కూడా చీర తీసుకెళ్లిన విష‌యం మీద ఆమె అభిప్రాయం స్వీక‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు పోలీసులు కూడా కేసు న‌మోదు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. విజ‌య‌వాడ‌కు చెందిన ఓ కీల‌క‌నేతతో స‌న్నిహితంగా మెలిగే మ‌హిళా నాయ‌కురాలిగా ఆమెకు పేరుంది. స‌దరు నాయ‌కుడి సిఫార్సుతోనే సూర్య‌ల‌త‌కి ఆల‌యంRead More


దక్షత లేకుండా దీక్షలేల..!

అధికారంలో ఉన్నవారు దీక్షలు చేయడం ఒకప్పుడు కొంత చిత్రంగా కనిపించేది. విపక్షంలో ఉన్నవాళ్లు చేయకపోయినా, పాలనలో ఉన్నవాళ్లు చేసినా అది పెద్ద విశేషంగా భావించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మోడీ పాలనలో వారు వీరయ్యారన్నట్టుగా ఉంది. అధికారంలో ఉండి దీక్షలు చేయడం సీఎంగా ఉన్న కాలంలో మోడీ ప్రారంభించిన ఆనవాయితీ కావడం విశేషం. దానిని చంద్రబాబు మరింత ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకు తోడుగా మంత్రులు, ఇతర నేతలు, అధికార యంత్రాంగం అంతా దీక్షలు సాగించాల్సిన పరిస్థితి తీసుకొచ్చేశారు. తాజాగా నవనిర్మాణ దీక్ష నాలుగో దశ సాగుతోంది. చంద్రబాబు ప్రారంభించిన ఈ దీక్ష రాష్ట్రమంతా సాగుతోంది. అంతకుముందు ధర్మపోరాట దీక్ష కూడా సాగింది. ఈ దీక్షల పలితాలేమిటన్నదే ప్రశ్నగా తయారయ్యింది. ముఖ్యమంత్రి ఎవరి మీద దీక్ష చేస్తున్నారన్నది నాలుగేళ్లుగా నేటికీ స్పష్టత రాలేదు. ధర్మపోరాటంRead More