Main Menu

vijayasaireddy

 
 

వైసీపీ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్న నేత‌లు?

ఏపీలో ఈసారి అధికారం కోసం ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ ఆశ‌ల‌కు ఆపార్టీ నేత‌లే గండికొడుతున్నార‌నే వాద‌న ముందుకొస్తోంది. ముఖ్యంగా ఏపీలో అన్ని జిల్లాల క‌న్నా విశాఖ‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ బ‌ల‌హీనంగా ఉండ‌డానికి ఆ రెండు జిల్లాల నాయ‌కులే కార‌ణ‌మ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లే వాపోతున్నారు. విశాఖ జిల్లాలో సిటీ అధ్య‌క్షుడిగా మ‌ళ్ల విజ‌య్ ప్ర‌సాద్ వ్య‌వ‌హారాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌ల‌కు స‌హ‌క‌రించిన విష‌యంలో మ‌ళ్లీ విజయ్ ప్ర‌సాద్ మీద తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో అప్ప‌ట్లో అధినేత కూడా దానిని అంగీక‌రించిన విష‌యాన్ని కొంద‌రు గుర్తు చేస్తున్నారు. అలాంటి నేత‌కే ఇప్పుడు న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో కీల‌క‌మైన విశాఖ‌లో వైసీపీ భ‌విత‌వ్యం గంద‌ర‌గోళంగా మారుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల‌తో స‌ఖ్య‌త‌గా మెలుగుతున్నRead More


బాబు చుట్టూ భోగాపురం రగడ

భోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారం చంద్రబాబు సర్కారు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్ట్ లో మొదటి విడత టెండర్లు రద్దు చేసిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కి టెండర్లు కేటాయించకుండా జీఎంఆర్ ప్రయోజనాల కోసం చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల షార్ట్ టైమ్ టెండర్లు జారీ వ్యవహారాన్ని విపక్ష నేతలు తప్పుబడుతూ ప్రభుత్వ వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకుడు సోము వీర్రాజు కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు టెండర్ల ప్రక్రియ వద్ద ఆందోళన చేశాయి. తాజాగా వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు వ్యవహారం మీద మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్‌ వెనుక భారీ దోపిడీకి కుట్రRead More


అలా అయితేనే ఆంధ్ర‌జ్యోతికి స‌మాధాన‌మిస్తా…!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయన ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధిని అవాక్క‌య్యేలా చేశారు. బీజేపీతో వైసీపీ సంబంధాల‌పై ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలంటే త‌న కండీష‌న్స్ కి అంగీక‌రించాల‌ని విజ‌య‌సాయి రెడ్డి కోర‌డం విశేషంగా మారింది. త‌ను చెప్పింది, చెప్పిన‌ట్టు రాస్తానంటే ఆంధ్ర‌జ్యోతి విలేకరికి స‌మాధానం ఇస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఆవెంట‌నే బీజేపీకి తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ధ‌తిచ్చే ప్ర‌స‌క్తేలేద‌ని ఆయ‌న తేల్చేశారు. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి గానీ, వారి మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థికి గానీ తాము మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. త‌మ‌కు ఏపీ ప్ర‌యోజ‌నాలే కీల‌కం అన్నారు. సుప్రీంకోర్ట్ లో ప్ర‌త్యేక హోదాపై ఇచ్చిన అఫిడ‌విట్ త‌ర్వాత బీజేపీకి అండ‌గా ఉండే ప్ర‌స‌క్తేలేద‌న్నారు. అదే స‌మ‌యంలో జ‌మిలీ ఎన్నిక‌ల విష‌యంలోRead More


వైసీపీలో పెను మార్పులు

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో పెద్ద మార్పులు ఖాయంగా మారింది. ఇప్ప‌టికే త‌న‌కు ప‌ట్టున్న జిల్లాలో మ‌రింత ప‌ట్టుద‌ల‌గా వైసీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప‌లువురు సీనియ‌ర్లు ఫ్యాన్ పంచ‌న చేర‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి మానుగుంట మ‌హిధ‌ర్ రెడ్డి జ‌గ‌న్ గూటిలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈనెల 11న పార్టీ కండువా లాంఛ‌నంగా క‌ప్పుకునే అవ‌కాశం ఉంది. దాంతో కందుకూరులో వైసీపీ అభ్య‌ర్థిగా ఆయ‌న రంగంలో దిగ‌డం ఖాయంగా మారింది. ఆయ‌న‌కు తోడుగా ప‌లువురు సీనియ‌ర్ టీడీపీ నేత‌లు కూడా వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి మానుగుంట చాలాకాలంగా రాజ‌కీయంగా క్రియాశీలం కావాల‌ని ఆతృత‌ప‌డుతున్నారు. దాంతో ఆయ‌న కోసం టీడీపీ నేత‌లు కూడా ప్ర‌య‌త్నాలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌మ‌స్య‌లున్న‌ప్ప‌టికీ టీడీపీ టికెట్ ఆయ‌న‌కే కేటాయించ‌డానికి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం సాగింది.Read More


ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయ్..!

ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఇప్ప‌టికే పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశారు. దానికి తోడుగా విప‌క్ష వైసీపీ కీల‌క నేత విజ‌య‌సాయి రెడ్డి కూడా అదే రీతిలో స్పందించారు. ఏ క్ష‌ణాన్న‌యినా ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తుంద‌ని తేల్చేశారు. దాంతో పార్టీ కార్య‌క‌ర్త‌లంతా విజ‌యం కోసం గ‌ట్టిగా శ్ర‌మించాల‌ని పిలుపునిచ్చారు. ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సూచ‌న చేశారు. అర‌కు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ బూత్ క‌మిటీ స‌భ్యుల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. త్వ‌రలోనే ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని తేల్చేశారు. విజయనగరం పేరులోనే విజయం ఉందని, జిల్లాలోని ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లుRead More


జ‌గ‌న్ త‌ర్వాత విజ‌య‌సాయిరెడ్డే!

వైసీపీ ఎంపీ వేణుంబాక విజ‌య‌సాయి రెడ్డికి మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాత నెంబ‌ర్ టూ గా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధాన బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తాజాగా మ‌రిన్ని ముఖ్య బాధ్య‌త‌లు ఆయ‌న‌కు ద‌క్కాయి. ఇప్ప‌టికే ఉత్త‌రాంద్ర వ్య‌వ‌హారాలను ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. కీల‌క‌మైన విశాఖ లో పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. రాజ్య‌స‌భ‌లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జాతీయ స్థాయి నేత‌ల‌తో నిత్యం ట‌చ్ లో ఉంటూ వైసీపీకి ఉప‌యోగ‌ప‌డే రీతిలో వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే హ‌స్తిన‌లో విజ‌య‌సాయి రెడ్డి ఉంటే టీడీపీ నేత‌ల క‌ళ్ల‌న్నీ ఆయ‌న మీదే ఉంటున్నాయి. చివ‌ర‌కు మోడీని క‌ల‌వ‌డానికి గ‌డిచిన పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్బంగా విజ‌య‌సాయి ప్ర‌య‌త్నించిన స‌మ‌యంలో దాని మీద చంద్ర‌బాబు అనుకూల మీడియాలో తీవ్ర స్థాయిలో క‌థ‌నాలు రావ‌డం విశేషం. అంత‌కుమించి రాష్ట్ర‌ప‌తిగా కోవింద్ ఎన్నికకాకRead More


విశాఖ మీద గురిపెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దృష్టి మ‌ర‌ల్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న విశాఖ మీద కేంద్రీక‌రించారు. గ్రేట‌ర్ సిటీలో పాగా వేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే టీడీపీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ల‌తో ర‌హ‌స్యంగా స‌మావేశాలు నిర్వ‌హించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లో కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈలోగా న‌గ‌రంలో విస్తృతంగా ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. ఓవైపు పార్టీ అధినేత పాద‌యాత్ర సాగుతుండ‌గా మ‌రోవైపు విశాఖ న‌గ‌రంలో స‌మ‌స్య‌ల‌పై యాత్ర‌కు విజ‌య‌సాయి రెడ్డి స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర సాగ‌బోతోంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 72 వార్డుల్లోనూ పాద‌యాత్ర నిర్వ‌హించ‌బోతున్నారు. 10 రోజుల పాటు 180 కిలోమీటర్ల మేర యాత్ర సాగించ‌బోతున్న‌ట్టు వైసీపీ ప్ర‌క‌టించింది. వైసీపీ త‌రుపున గ‌డిచిన ఎన్నిక‌ల్లోRead More


వైసీపీతో మంత్రి మంత‌నాలు?

ఏపీలో ప‌లువురు ఎమ్మెల్యేలు మాతో ట‌చ్ లో ఉన్నార‌ని వైసీపీ ప్ర‌క‌టించింది. టీడీపీ ఎంపీలు త‌మ‌వైపు రావ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారంటూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంకేతాలు ఇచ్చేశారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే జ‌న‌సేనాని కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి చేశారు. అయితే తాజాగా విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డితో ఓ కీల‌క మంత్రి త‌రుపున చ‌ర్చ‌లు సాగిన‌ట్టు ప్రచారం మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన స‌ద‌రు మంత్రి తాజాగా టీడీపీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయ‌న బంధువ‌ర్గం కూడా టీడీపీలోనే ఉన్నారు. దాంతో ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ద‌క్కుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఆయ‌న మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మంత్రి స‌మీప బంధువు ఒక‌రు నేరుగా విజ‌య‌సాయిరెడ్డితో భేటీ కావ‌డం విశేషంగాRead More


చంద్ర‌బాబుపై సంచ‌ల‌నాస్త్రం

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశాన్ని ముంచేసిన వ్య‌క్తితో చంద్రబాబుకి చెలిమి ఉంద‌ని ఆరోపించారు. ఏకంగా బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టిన విజ‌య్ మాల్యా నుంచి భారీగా చందాలు వ‌సూలు చేశార‌ని ఆరోపించారు. లండ‌న్ లో విజ‌య్ మాల్యాని క‌లిసి ముడుపులు తీసుకున్న చంద్ర‌బాబు అంటూ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం అవుతున్నాయి. గ‌డిచిన 2016 మార్చి నెల‌లో లండ‌న్ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా విజ‌య్ మాల్యా నుంచి 150 కోట్లు ముడుపులు చంద్ర‌బాబు అందుకున్నార‌ని విజ‌యసాయి వాదిస్తున్నారు. దేశంలో ప్ర‌జ‌ల సంప‌దకు ఎగ‌నామం పెట్టేసి, ప‌లు కేసుల్లో ఇరుక్కున్న వ్య‌క్తి నుంచి చంద్ర‌బాబు చందాలు తీసుకున్నార‌నే వాద‌న తీవ్రంగా క‌ల‌క‌లం రేపుతోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుపై ప్రివిలైజ్ నోటీసు కూడా ఇవ్వ‌డం మ‌రో విశేషం. ఏకంగా ఓ ముఖ్య‌మంత్రిపై రాజ్య‌స‌భ‌లో ప్రివిలైజ్ నోటీసు ఇవ్వ‌డంRead More


విజ‌య‌సాయి ఇమేజ్ పెంచుతున్నారు..!

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయ‌న ఏం చేసినా అది విశేషంగా మారుతోంది. చాలాకాలంగా ఆయ‌న మోడీతో భేటీ అవుతున్నారు. వీలు దొరికిన ప్ర‌తీసారి ప్ర‌ధానితో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నారు. అందుకు కొన‌సాగింపుగానే అంద‌రి స‌మ‌క్షంలో రాజ్య‌స‌భ‌లోనే మోడీని క‌లిశారు. కానీ ఇప్పుడ‌ది పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. ఈసారి ఆయ‌న మోడీతో వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదంగా మారుతోంది. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌కు దారితీసింది. ఆయ‌న నోటికి పని చెప్పి చంద్ర‌బాబు మీద విరుచుకుప‌డ‌డంతో దుమారం చెలరేగుతోంది. వాస్త‌వానికి విజ‌య‌సాయిరెడ్డి ఐదేళ్ల క్రితం చాలామందికి తెలియ‌దు. కేవ‌లం జ‌గ‌న్ వ్య‌వ‌హారాలు చూసే ఆడిట‌ర్ గా మాత్ర‌మే అంద‌రికీ తెలుసు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ తో పాటు జైలు జీవితం గ‌డ‌ప‌డంతో ఆయ‌న భాగ‌స్వామిగా భావించారు. అలాంటిదిప్పుడు ఏకంగా ప్ర‌ధానితో నేరుగా ట‌చ్ లోకి వెళ్ల‌డ‌మే కాకుండా,Read More