Main Menu

ttd

 
 

టీడీపీకి దూర‌మ‌వుతున్న ఎమ్మెల్యే?

తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆపార్టీ అధినేత‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఎన్నిక‌ల ముంగిట తెర‌మీద‌కు వ‌స్తున్న ప‌రిణామాల‌తో ఆయ‌న సీరియ‌స్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా స్వ‌యంగా సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఎమ్మెల్యే దూరం కావ‌డం విశేషంగా మారింది. సొంత నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం వ‌చ్చినా ఆమె మొఖం చాటేసిన తీరు ఆశ్చ‌ర్యంగా మారింది. దాంతో అధినాయ‌కుడి మీద ఆగ్ర‌హంతో అల‌క‌బూనిని ఎమ్మెల్యే ఇక టీడీపీకి దూర‌మ‌యిన‌ట్టేనా అన్న ప్ర‌చారం సాగుతోంది. కొద్దిరోజుల క్రితం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కు అవ‌మానం జ‌రిగిందంటూ ఆగ్ర‌హం వెలిబుచ్చింది. సీఎంకి ఫిర్యాదు చేసింది. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంతో ఆమెకు త‌గిన న్యాయం జ‌రగ‌లేద‌ని వాపోతోంది. దాంతో ఏకంగా సీఎం తిరుమల పర్యటనకు డుమ్మా కొట్టి ఝ‌ల‌క్ ఇచ్చారు. తిరుమలలో సుగుణమ్మకు చేదు అనుభవం ఎదురైన నేప‌థ్యంలో సీఎం స్పందించ‌క‌పోవ‌డంRead More


ఆల‌యంలోకి ఎమ్మెల్యేకి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

టీటీడీ అధికారుల వ్య‌వ‌హారంతో ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. త‌న‌కు ఆల‌యంలో ప్ర‌వేశం క‌ల్పించ‌క‌పోవ‌డంతో 40 నిమిషాలు వేచి చూశారు. చివ‌ర‌కు చైర్మ‌న్ కూడా అలా ఎందుకు జ‌రిగింద‌నే దానిపై అధికారుల నుంచి ఆరాతీస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ మాత్రం ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అవుతున్నారు. త‌న‌ను అవ‌మానించార‌ని వాపోతున్నారు. తాను సీఎం ముందు పంచాయితీ పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. తిరుమ‌ల‌లో మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం సాగుతోంది. ఈ సంద‌ర్భంగా స‌దరు కార్య‌క్ర‌మం అనంత‌రం ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌కు ఆల‌య ప్ర‌వేశాలు నిలిపివేశామ‌నే కార‌ణంతో ద‌ర్శ‌నానికి అనుమ‌తివ్వ‌డానికి టీటీడీ సిబ్బంది నిరాక‌రించారు. దాంతో ఆమె సంబంధిత అధికారుల‌ను స్పందించినా త‌గిన స్పంద‌న ల‌భించ‌లేదు. చైర్మ‌న్ కూడా న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. అయినా ఆమె మాత్రం త‌న‌ను అవ‌మానించార‌ని , సీఎంకి ఫిర్యాదు చేస్తాన‌ని మాత్రం తెలిపారు. దాంతో ఈ వ్య‌వ‌హారంRead More


అనిత అలా బ‌య‌ట‌ప‌డింది…!

ఏపీలో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల జాబితాలో వంగ‌ల‌పూడి అనిత ఒక‌రు. గ‌తంలో ఉపాధ్యాయురాలుగా ప‌నిచేసి, టికెట్ సాధించిన తొలిసారే ఆమె పాయ‌క‌రావు పేట నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయినా ఆది నుంచి ఆమె వివాద‌స్ప‌ద‌మే. సొంత కుటుంబంలో త‌గాదాలు. పార్టీ నేత‌ల‌తో విబేధాలు. ప్ర‌త్య‌ర్థి ప్ర‌తిప‌క్ష వైసీపీతో నిత్య వైరం. చివ‌ర‌కు రోజా స‌స్ఫెన్ష‌న్, సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారి అరెస్టులు వంటి వాటికి అనిత ఆధ్యురాలు. ఆఖ‌రికి టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ గా ఎన్నిక‌య్యి పెనుదుమారం సృష్టించారు. టీడీపీకి త‌ల‌నొప్పిగా మారారు. దాంతో ఆమె మ‌తం విష‌యంలో రాజుకున్న వివాదం నుంచి గ‌ట్టెక్క‌డానికి టీడీపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి చివ‌ర‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన మార్గాన్ని అన్వేషించిన‌ట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా తాను హిందువున‌ని, ఎస్సీ మ‌హిళ‌ను కాబ‌ట్టి త‌న మీద దాడిచేస్తున్నార‌ని మాట్లాడిన అనిత ఎట్ట‌కేల‌కు దిగివ‌చ్చారు. తానుRead More


అనిత అవుట్..?

అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న చందంగా మారుతోంది టీడీపీ ప‌రిస్థితి. గ‌డిచిన కొంత‌కాలంగా చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా ప‌రిణామాలు సాగుతున్నాయి. తాజాగా టీటీడీ బోర్డ్ నియామ‌కంలో తీవ్ర జాప్యం త‌ర్వాత కొత్త పాల‌క‌వ‌ర్గానికి జెండా ఊపినా ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. చైర్మ‌న్ నియామ‌క ద‌శ నుంచి దాటిన త‌ర్వాత తాజాగా బోర్డ్ స‌భ్యుల వ్య‌వ‌హారం వివాదం అయ్యి కూర్చింది. ముఖ్యంగా పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే అనిత చుట్టూ వివాదం పెను దుమారం అయ్యింది. టీటీడీని అన్య‌మ‌త‌స్తుల‌తో నింపేస్తున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ఇప్ప‌టికే పుష్క‌రాల సంద‌ర్భంగా బెజ‌వాడ‌లో విగ్ర‌హాల తొల‌గింపు ఓ వివాదం కాగా, తాజాగా టీటీడీ విష‌యంలో టీడీపీ తీరుని చాలామంది సందేహించే ద‌శ‌కు తెచ్చేస్తోంది. నారా లోకేష్ కోట‌రీలో అనిత కీల‌కంగా మారిన‌ట్టు, ఆయ‌న చ‌ల‌వ‌తోనే అనిత‌కి ఈ ప‌ద‌వి ద‌క్కిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. యువ‌నేత శిబిరంలోRead More


తెలంగాణా మంత్రి వియ్యంకుడికి టీటీడీ పదవి

మొత్తానికి టీడీపీలో ఉత్కంఠ రేపిని టీటీడీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అయితే దాని వెనుక జరిగిన రాజకీయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పక్కా కాంట్రాక్టర్ కి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం వెనుక కారణాలపై పలువురు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల మంత్రి యనమలకు ప్రాధాన్యత తగ్గిపోతున్న తరుణంలో తాజాగా ఆయన వియ్యంకుడికి కీలక పదవి కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే సుధాకర్ యాదవ్ కేవలం కేవలం యనమలకే కాకుండా తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కి కూడా వియ్యంకుడే కావడం విశేషం. ఇద్దరు ఉద్దండులైన ఎంపీలు ప్రయత్నించారు. అటు రాయపాటి తన కోరిక తీర్చుకోవాలని పట్టుబట్టారు. అదే సమయంలో మాగంటి మురళీమోహన్ కూడా ఆశించారు. వాళ్లిద్దరికీ ఇప్పటికే పదవులున్న నేపథ్యంలో జోడు పదవులనే పేరు చెప్పిన పక్కన పెట్టేశారు. ఆ తర్వాత నందమూరి హరిక్రుష్ణ పేరుRead More


రాయపాటి ఆశల‌కు జగన్ ఆఫర్…!

ఆయ‌న సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ప‌లుమార్లు పార్ల‌మెంట్ లో అడుగుపెట్టారు. ప‌ద‌వుల కోసం పార్టీలు కూడా మారారు. కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరి, గుంటూరు నుంచి న‌ర్సారావు పేట వెళ్లి జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. కానీ ఆయ‌న ఆశ మాత్రం నెర‌వేర‌డం లేదు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ కావాల‌నే రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఆశ‌కు ప్ర‌తీసారీ అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గ్రూపులు ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. హ‌స్తిన‌లో అనుకూల‌త ల‌భించినా హైద‌రాబాద్ లో ఆమోదం ద‌క్క‌లేదు. ఆఖ‌రి క్ష‌ణంలో ఆయ‌న ఆశ‌లు నీరుగారిపోతుండేవి. పోనీ టీడీపీలో చేరిన త‌ర్వాతైనా త‌న‌కు టీటీడీ హోదా ద‌క్కుతుందా అని రాయ‌పాటి ఆశించారు. ఇప్ప‌టికే రెండు సార్లు ఖంగుతిన్నారు. తాజాగా ఆయ‌న చంద్ర‌బాబు వ‌ద్ద గ‌ట్టి ప‌ట్టుప‌ట్ట‌డంతో అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని భావించారు. కానీ ముర‌ళీమోహ‌న్ కూడా పోటీలోకిRead More


రాయ‌పాటి ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన చంద్ర‌బాబు

న‌ర్సారావుపేట ఎంపీ ఆశ‌లు నీరుగారిపోయాయి. ఆయ‌న చిర‌కాల వాంఛ ఇక నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఎంపీ ప‌ద‌వి వ‌దులుకుంటాన‌ని చెప్పినా చంద్ర‌బాబు క‌రుణించ‌లేదు. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ప్ర‌తిపాద‌న‌లు ఖాత‌రు చేయ‌లేదు. ముర‌ళీమోహ‌న్ ని చూపించి రాయ‌పాటికి, రాయ‌పాటిని చూపించి ముర‌ళీమోహ‌న్ కి మొండిచేయి చూపించారు. చివ‌ర‌కు పార్టీ మారినా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గిరీ కోసం రాయ‌పాటి చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దాంతో ఆయ‌న ఆశ‌లు అడియాశ‌లు కాక‌త‌ప్ప‌లేదు. ఇక చివ‌ర‌కు టీటీడీ చైర్మ‌న్ గిరీ కోసం ఎంపిక‌లు తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని భావించిన చంద్ర‌బాబు పున‌రాలోచ‌న‌లోప‌డ‌నిట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే చ‌ద‌ల‌వాడ ప‌ద‌వీకాలం ముగిసిన‌ప్ప‌టికీ కొత్త చైర్మ‌న్ విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. దాంతో ఆ ప‌ద‌వి కోసం ప‌లువురు టీడీపీ పెద్ద‌లు ఆశ‌ప‌డ్డారు. అయితే వారంద‌రినీ ప‌క్క‌న పెట్టేసిన చంద్ర‌బాబు తాజాగా కొత్త వ్య‌క్తిRead More


మారిన సంప్ర‌దాయం: ఏపీ ఐఏఎస్ ల‌కు అవ‌మానం

తిరుమల-తిరుపతిదేవస్థానం (టీటీడీ) చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తరాది ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు మరికొందరు ఐఏఎస్‌ అధికారులను కూడా సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ జీవో ఇచ్చింది. తెలుగువారినే టీటీడీ కార్యనిర్వహణాధికారులుగా నియమించే సంప్రదాయం ఇప్పటి వరకూ కొనసాగుతూ వచ్చింది. తెలుగువారికే ఈ పోస్టు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాదికి చెందిన 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారనే విషయం సీనియర్‌ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం పేషీ అధికారి, ఢిల్లీలోని కేంద్ర మంత్రిRead More


రాజీనామా ఆలోచ‌న‌లో రాయ‌పాటి

ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు రాజీనామా కి సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే తాను రాజీనామా చేయ‌డానికి రెడీ గా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌న‌కు మాత్రం టీడీడీ చైర్మ‌న్ ప‌ద‌వి మాత్రం కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. జంట ప‌ద‌వుల అభ్యంత‌రం విష‌యంలో అనుమానం అవ‌స‌రం లేద‌ని చెప్పారు. ఎంపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఈ నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి రాయ‌ప‌టి సాంబశివరావు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పదవిని తనకు కేటాయించాలని కోరుతూ తాజాగా సీఎం చంద్రబాబుకు రాయపాటి లేఖ రాశారు. ప్రస్తుతం టీటీడీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో రాయపాటి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా… ఈనెల 4వతేదీన సీఎం చంద్రబాబుRead More


ఆంధ్రా క్యాడ‌ర్ ఐఏఎస్ ల త‌గాదా..!

ఏపీలో అధికార పార్టీలోనే కాదు ఏకంగా ఐఏఎస్ అధికారుల్లోనూ ముస‌లం మొద‌ల‌య్యింది. వ‌ర్గాలుగా విడిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక్క పోస్టు కోసం ఇద్ద‌రు అధికారులు ప‌ట్టుబ‌డుతుండ‌డంతో ఏకంగా నార్త్, సౌత్ విభ‌జ‌న కూడా ముందుకొచ్చింది. దాంతో వ్య‌వ‌హారం ముదురుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. టీటీడీ ఈవో స్థానం కోసం ఏర్పడిన పోటీ పెను దుమారం రేపుతోంది. టీటీడీ ఈవోగా ఉన్న శ్రీనివాస‌రాజు బ‌దిలీ అనివార్య‌మ‌య్యింది. ఆయ‌న్ని గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ గా పంపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాంతో ఆ సీటు మీద ఇద్ద‌రు అధికారులు క‌న్నేశారు. ప‌ట్టుద‌ల‌గా ప్ర‌య‌త్నిస్తున్నారు. దాంతో ఐఏఎస్ ల మ‌ధ్య విబేధాల‌తో రెండు వ‌ర్గాలుగా విడిపోయే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న ఏకే సింఘల్‌ టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఈ చిచ్చు రాజుకుంది. ఉత్తరాది వ్యక్తయిన సింఘల్‌కుRead More