Main Menu

trs

 
 

పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తనకు గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఓ నేత ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సాక్షాత్తు మంత్రి మహేందర్‌ రెడ్డి సమక్షంలో వికారాబాద్‌ జిల్లా తాండూరులో చోటుచేసుకుందీ ఘటన. పలువురు పార్టీ ప్రతినిధులు మాట్లాడుతుండగా, పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ వేదిక వద్దకు వెళ్లి మైక్‌ తీసుకున్నారు. 2004 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పార్టీ తరఫున తాను చురుగ్గా పాల్గొన్నానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని, అయినా ఇప్పటివరకూ తనకు ఏ నామినేటెడ్‌ పదవీ ఇవ్వలేదన్నారు. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రసంగాన్ని ముగించి బయటికి వెళ్లిన ఖాన్‌ అప్పటికే వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. శరీరానికి అంటుకున్న మంటలతోనే అరుస్తూ సమావేశంలోకి వచ్చారు. కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఆయనకు ముఖం,Read More


క‌విత‌కు డాషింగ్ బ్యాట్స్ మేన్ ప్ర‌శంస‌లు

ఎంపీ క‌వితపై మాజీ క్రికెట‌ర్ సెహ్వాగ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. రాఖీ పండుగ‌కు హెల్మెట్ కూడా గిఫ్ట్ ఇవ్వాల‌ని ఎంపీ క‌విత సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్ అన్న ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. నిన్న పార్ల‌మెంట్‌లో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఎంపీ క‌విత చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ఓ మంచి ప్ర‌య‌త్న‌మ‌ని సెహ్వాగ్ అన్నాడు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయ‌డం, ఓవ‌ర్‌స్పీడ్‌తో వెళ్ల‌డమంటే పాస్‌పోర్ట్ లేకుండానే శ్మ‌శాన వాటికకు వెళ్ల‌డం అని సెహ్వాగ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు తొంద‌ర‌ప‌డ వ‌ద్దు అని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలని, మీరు అభిమానించే వ్య‌క్తుల‌కు హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని సెహ్వాగ్ సూచించాడు.


చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే..!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి రోజుగా భావిస్తున్నానని మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల కల నిజమైన రోజున ఇక్కడి ప్రజలంతా ఆవిర్భావ వేడుకను పండుగలా భావిస్తుంటే చంద్రబాబు మాత్రం మా సంతోషాన్ని చూడలేకపోతున్నారని, ఈ తీరు సరైనది కాదని పేర్కొన్నారు. ఆయన ఇలా మాట్లాడటం బాధాకరమని, దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు తన అక్కసు వెల్లగక్కారని, నిజ స్వరూపాన్ని చూపారని విమర్శించారు. బాబు మాటలను చూసి ఇప్పటికైనా తెలంగాణ తెదేపా నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇకపైన కూడా బాబు భజన చేసే నాయకులను ప్రజలు ద్రోహులుగా గుర్తిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రRead More


కేసీఆర్ నిరాశ‌ప‌రిచారు..!

తెలంగాణా సీఎం తీరులో ఏదో మార్పు క‌నిపిస్తోంది. అంద‌రిలో ఆసక్తిగా క‌నిపిస్తోంది. మాటల మాంత్రికుడి జోరు త‌గ్గింద‌నే అభిప్రాయం క‌నిపిస్తోంది. మౌనంగా వెనుదిర‌గ‌డం నుంచి చ‌ప్ప‌గా ప్ర‌సంగం ముగించ‌డం వ‌ర‌కూ కేసీఆర్ అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. కానీ కాంగ్రెస్ స‌హా ఇత‌ర విప‌క్షాల‌కు మాత్రం కాస్త ఉప‌శ‌మ‌నంగా మారింది. ల‌క్ష‌ల మంది త‌ర‌లివ‌చ్చిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో కేసీఆర్ తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంత‌కుముందు ఓయూ శ‌త‌వ‌సంత స‌భ‌లో నోరు మెద‌ప‌ని కేసీఆర్ వ‌రంగ‌ల్ స‌భ‌లో విరుచుకుప‌డ‌తార‌ని ఊహించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌న్నాహా స‌భ‌గా చాలామంది భావించారు. దాంతో మాట‌ల యుద్ధానికి కేసీఆర్ తెర‌లేపుతార‌ని అంచ‌నా వేశారు. కానీ అన్నింటికీ భిన్నంగా కేసీఆర్ వైఖ‌రి క‌నిపించింది. చాలా రొటీన్ ప్ర‌సంగంతో ముగించారు. స‌భ‌కు వ‌చ్చిన వారిని ఒక‌ర‌కంగా నిరుత్సాహ‌ప‌రిచార‌నే చెప్ప‌వ‌చ్చు. కేసీఆర్ నుంచి ఆశించిన దానికి బిన్నంగా ఆయ‌నRead More


టీఎస్ లో విప‌క్షం, ఏపీ పాల‌క‌ప‌క్షం వెన‌క‌డుగు

తెలంగాణాలో పాల‌క‌ప‌క్షం దూకుడు మీద ఉంది. వ‌రుసగా తాయిలాలు ప్ర‌క‌టిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు తాము సిద్ధం అని చెబుతోంది.ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా తాము రెడీ అంటోంది. కానీ విప‌క్షం మాత్రం బిత్త‌ర చూపులు చూస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతోంది. జ‌మిలీ ఎన్నిక‌ల మీద ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విష‌యంలో కుస్తీలు ప‌డుతోంది. అదే స‌మ‌యంలో ఏపీలో పాల‌క‌ప‌క్షం తీరు కూడా కాస్త గంద‌ర‌గోళంగా క‌నిపిస్తోంది. పార్టీ అధినేత ముంద‌స్తుకి సై అంటారు. కానీ ఆయ‌న త‌న‌యుడు మాత్రం తాము అలా అన‌లేద‌ని చెబుతారు. ఇలా తెలుగుదేశం పార్టీ విధానంలో ఓ గంద‌ర‌గోళం క‌నిపిస్తోంది. తెలంగాణాలో ప్ర‌తిప‌క్షం తీరుకి త‌గ్గ‌ట్టుగా ఏపీలో పాల‌క‌ప‌క్షం వైఖ‌రి క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విప‌క్ష వైసీపీ ఎన్నిక‌ల కోసం ఎదురుచూస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.Read More


కోదండ‌రామ్ రాజ‌కీయ అడుగు

టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాలతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2001లో తెరాస ఏర్పడినప్పుడు కీలకపాత్ర వహించి ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించిన గాదె ఇన్నయ్య, కోదండరామ్ కొత్త పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 30న హైదరాబాద్‌లో సన్నాహక కమిటీ సమావేశం జరుగుతుంది. రెండు నెలల పాటు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తామని, అనంతరం సెప్టెంబర్‌లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పార్టీ ఏర్పడుతుందని గాదె ఇన్నయ్య తెలిపారు. మొత్తం 31 జిల్లాల నుంచి సన్నాహక కమిటీ సమావేశానికి ప్రతినిధులను ఆహ్వానించారు. ఇద్దరి నుంచి ఐదుగురి వరకు ఒక్కో జిల్లానుంచి హాజరు కావాలని కోరారు. సన్నాహక కమిటీ సమావేశం అనంతరం పార్టీ ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తారు. అదేవిధంగా పార్టీ ఏవిధంగా ఉండాలో నివేదిక రూపొందిస్తారు. వార్డుస్థాయి నుంచి ఎంపీRead More


ఐస్ క్రీమ్ అమ్మిన కేటీఆర్: ఖ‌రీదెంతో తెలుసా?

టీఆర్ఎస్‌ కూలీ దినాల్లో భాగంగా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూలీ పని చేశారు. కొంపల్లిలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో ఆయన ఐస్‌క్రీమ్‌ అమ్మి రూ.లక్షలు సంపాదించారు. ఒక ఐస్‌క్రీమ్‌కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా, మరో ఐస్‌క్రీమ్‌కు స్థానిక నేత శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి రూ.లక్ష చెల్లించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈనెలలో జరగనున్న బహిరంగ సభకు విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ ఐస్‌ క్రీమ్‌ అమ్మారు. అలాగే కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్‌ జ్యూస్‌, ఐస్‌క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్‌గా పనిచేశారు. మొత్తం 25 నిమిషాల పనికి మంత్రి కేటీఆర్‌కు రూ.7.30 లక్షల కూలి గిట్టుబాటు అయింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, బాల్క సుమన్‌, వివేకానంద, శంభీపూర్‌ రాజు పాల్గొన్నారు. ఆనంతరం అక్కడి బస్తీవాసులతోRead More


కేసీఆర్ తో పొత్తు గురించి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో గడచిన మూడేళ్లు కేసీఆర్‌ అనుకూల రాజకీయ పునరేకీకరణ జరిగిందని, ఇక రానున్న 20 నెలలు కేసీఆర్‌ ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని టీడీపీ-టీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రక్రియలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మునిసిపల్‌, మండల, పట్టణ, డివిజన్ స్థాయి పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారుల శిక్షణలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గాలివాటం పార్టీ అని, దానికి సంస్థాగత నిర్మాణం లేదన్నారు. కేసీఆర్‌కు పరిపాలనపై పట్టులేదని, అందుకే అభివృద్ధి, సంక్షేమ పథకాలు దారుణంగా విఫలమయ్యాయ ని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘టీడీపీ ఎక్కడుందని అంటున్నరు.. కేసీఆర్‌కు మాతో పొత్తేకావాలి. కాంగ్రెసోళ్లకు టీడీపీ లీడర్లే కావాలి. బీజేపీ వాళ్లకు టీడీపీ లీడర్లే కావాలి’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు పరిస్థితి టీఆర్‌ఎస్‌లో చచ్చినపాము కంటే అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు.Read More


ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఓ గుణ‌పాఠం

తెలుగు రాష్ట్రాల‌లో ఫిరాయింపుల వ్య‌వ‌హారం అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. అటూ ఇటూ అధికారంలో ఉన్న పార్టీలు విప‌క్షాల నుంచి నేత‌ల‌ను ఆపరేష‌న్ ఆక‌ర్ష్ తో త‌మ‌వైపు తిప్పుకున్నాయి. కానీ క‌నీసం ప్ర‌మాణాలు పాటించిన‌ట్టు క‌నిపించ‌దు. రేపు మ‌రో పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏమ‌వుతుందోన‌నే ఆలోచ‌న కూడా లేకుండా వ్య‌వ‌హరించారు. ఈవిష‌యంలో టీఆర్ఎస్, టీడీపీ ఇద్ద‌రిదీ పార్టీలు వేర‌యినా ధోర‌ణి ఒక‌టే. చివ‌ర‌కు న్యాయ‌స్థానాల వ‌ర‌కూ విష‌యం వెళ్లినా వారిలో మార్పు లేదు. ఇరుపార్టీల నేత‌లు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కానీ ఇలాంటి వారికి భిన్నంగా ఓ ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేగా ఉన్న వేద్ ప్ర‌కాష్ పార్టీ ఫిరాయించేశారు. ఆప్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఈ బావాన నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే కేజ్రీవాల్ కి షాకిచ్చారు. కానీ అదేRead More


కాట‌మ‌రాయుడికి గులాబీ నేత కితాబు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా బ్లాక్ బ‌స్ట‌ర్ కాట‌మ‌రాయుడు చిత్రాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చూశారు. అనంత‌రం కాట‌మ‌రాయుడు చిత్ర‌బృందాన్ని అభినందించారు. పవన్ కళ్యాణ్ శరత్ మరార్ లు నిజ‌మైన విజేత‌ల‌న్నారు మంత్రి కేటీఆర్‌. ప‌వ‌న్‌తో క‌లిసి దిగిన ఫోటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు మంత్రి కేటీఆర్‌. కాట‌మ‌రాయుడు చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించడంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. చేనేత రంగాన్ని ప్ర‌మోట్ చేస్తున్న ప‌వ‌ర్ స్టార్‌కు ప్ర‌తేక అభినంద‌న‌లు తెలిపారు కేటీఆర్. కాట‌మ‌రాయుడు కేటీఆర్ క‌ల‌యిక‌తో అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌, ఇటు కేటీఆర్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ట్వీట్ చూసిన ఇరువురి అభిమానులు ఒకే వేదిక‌పై ప‌వ‌ర్ స్టార్‌ పొలిటిక‌ల్ స్టార్‌లు క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉందంటూ రీట్వీట్ చేశారు.