trivikram

 
 

త్రివిక్ర‌మ్ ని కాద‌న్న సీనియ‌ర్ హీరోయిన్

Will-Trivikram-Bring-Her-Back--1520229564-1719

టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తీరు భిన్నంగా ఉంటుంది. ఆయ‌న ప్ర‌తీ సినిమాలోనూ ఓ సీనియ‌ర్ హీరోయిన్ కీల‌కంగా క‌నిప‌స్తుంది. అత్తారింటికి దారేది సినిమా ద్వారా న‌దియా ని అలానే తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అజ్ఞాత‌వాసిలో కూడా ఖుష్బూ ప్ర‌ధాన‌పాత్ర పోషించారు. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి కూడా అలాంటి పాత్ర ఒక‌టి సిద్ధం చేశారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌బోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రో కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ హీరోయిన్ ల‌య‌ని త్రివిక్ర‌మ్ సంప్ర‌దించారు కానీ ఆమె మాత్రం ప్ర‌పోజ‌ల్ ని కొట్టి పారేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తివ్రిక‌మ్ స్టోరీ లైన్ విన్న త‌ర్వాత సున్నితంగా తిర‌స్క‌రించార‌ని స‌మాచారం. గ‌తంలో ప‌లు హిట్ సినిమాల్లో న‌టించిన ల‌య పెళ్లి త‌ర్వాత అమెరికాRead More


పవన్ కల్యాణ్ వారణాశి వెళ్లుతున్నదందుకే

pawan trivikram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మువీ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా టైటిల్ విషయంలో ఫ్యాన్స్ లో తీవ్ర చర్చ సాగుతోంది. దానికి సంబంధించిన ఓ ప్రకటన కోసం తాజాగా పవన్ కల్యాణ్ అండ్ కో వారణాశి బయలుదేరుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దాన్నే వర్కింగ్‌ టైటిల్‌గా కూడా కొనసాగిస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకూ చిత్రబృందం స్పష్టత ఇవ్వలేదు. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందడంతో భారీగానే అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్‌, అనుఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా చేస్తోన్న ఈ చిత్రం కుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రబృందం ఇటీవలే యూరప్‌ వెళ్లి వచ్చింది. ఈనెల 27వ తేదీ నుంచి చివరి షెడ్యూల్‌ పనులు మొదలుRead More


త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తగాదా..

ntr

స్టార్ డైరెక్టర్ తో యంగ్ టైగర్ వ్యవహారం వీధికెక్కింది. సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినట్టు సాగుతున్న ప్రచారం జోరుగా ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా భవితవ్యం గందరగోళంలో పడిందనే సమాచారం ఆసక్తి రేపుతోంది. మాటల మాంత్రికుడితో కథ విషయంలో మొదలయిన తగాదా తీవ్రస్థాయికి చేరుతున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నుంచి పూర్తి స్థాయిలో ప‌ట్టాలెక్క‌నుంది. హారిక హాసిని బ్యాన‌ర్ మీద తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా తాజాగా ఎన్టీయార్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మ‌ధ్య అభిప్రాయRead More


నవలా చిత్రంలో తారక్..

ntr pawan1

జై లవ కుశ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నెక్ట్స్ మువీ కోసం ఫ్యాన్స్ లో ఆత్రుత కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్‌ మార్క్‌ స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడట. 80లలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆ నవల హక్కులను కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.Read More


ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కల్యాణం

ntr

జై లవకుశ చిత్రంతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస టీజర్లు, ఆడియో వేడుకలతో ఆడియోన్స్ లో జైలవకుశ హల్ చల్ చేస్తోంది. ఇక లవకుశ తర్వాత ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ తో జతకట్టబోతున్నాడు. మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ సినిమా చర్చనీయాంశం అవుతోంది. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం పూర్తైన తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ సూపర్‌హిట్ చిత్రం శ్రీనివాస కళ్యాణం గుర్తుందా.. ఆ టైటిల్‌నేRead More


పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశే!

pawan3

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే 70 శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. తాజా షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్న ఈ టీమ్ పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికితోడు చిత్ర యూనిట్ కూడా ఫస్ట్‌లుక్ వస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఏమైందో ఏమో మరి, ప్రస్తుతానికి ఆ రోజు పవన్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగలనుందట. దానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంలేదని సమాచారం. ఇంకా టైటిల్ నిర్ణయించకపోవడంతోపాటు పవన్ విదేశాల్లో వుండడంతో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం కుదరడంలేదట! దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్‌కు నిరాశే మిగలనుంది. త్వరలోనే టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట.


పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ సిద్ధం

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే గిఫ్ట్ సిద్దమయ్యింది. ఫ్యాన్స్ ని అలరించడానికి త్రివిక్రమ్ దానిని తీర్చిదిద్దారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో కుతూహలం కనిపిస్తోంది .దానికి తగ్గట్టుగానే పవన్ లేటెస్ట్ మువీ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంశాల్లో ఆయన తర్వాత సినిమా ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడు, టైటిల్‌ ఏమిటి అనేవి చర్చనీయాంశంగా మారాయి.. కొత్త చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఎదురుచూస్తున్న అభిమానుల్ని ఇకపై వెయిట్‌ చేయించడం ఇష్టంలేని టీమ్‌ మొదటిలుక్‌ విడుదలతేదీని ప్రకటించేసింది. సెప్టెంబర్‌ 2న పవన్‌ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పటి నుండే సోషల్‌ మీడియాలో అభిమానుల కోలాహలం మొదలైపోయింది. హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కీర్తిRead More


పీకే, త్రివిక్రమ్ మువీకి ఆసక్తికర టైటిల్

pawan2

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మువీ ఆసక్తి రేపుతోంది. పవర్ స్టార్ స్టామినాకు తగ్గట్టుగా అత్తారింటికి దారేది లాంటి మెగా హిట్ మువీని అందించిన మాటల మాంత్రికుడు మరో హిట్ అందిస్తారన్న ఆశాభావంతో అభిమానులున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమాకు సంబందించి త్రివిక్రమ్ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే టైటిల్ ను ఆసక్తికరంగా ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘రాజు ఒచ్చినాడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారంలో సాగుతోంది. ఈ సినిమా పవన్ కల్యాణ్ పొలిటికల్ లైఫ్ కి కూడా తోడ్పడేలా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని సమచాారం. దానికి తగ్గట్టుగా రాజు ఒచ్చినాడు అంటే ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారని భావిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే బల్గేరియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా షూటింగ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. విక్టరీRead More


రికార్డ్ బ్రేక్ చేసిన ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ జోడీ

pawan2

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులను జెమినీ టీవీ ఆల్‌టైం రికార్డు ధరకు కొనుగోలు చేసిందట. ఈ సినిమా తెలుగు శాటిలైట్‌ హక్కుల కోసం ఆ చానెల్‌ ఏకంగా రూ. 21 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇక హిందీ శాటిలైట్‌ హక్కులకు రూ. 11 కోట్ల ధర పలికిందట. మొత్తం శాటిలైట్‌ హక్కుల రూపంలో రూ. 32 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘జల్సా’, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌, అనుRead More


రంగంలోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్

nithin-trivikram

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ పేరుతో సినిమా ప్రారంభించారు. త‌న అభిమాని నితిన్ హీరోగా సినిమా ప్రారంభోత్స‌వం కూడా నిర్వ‌హించారు. త‌ద్వారా నిర్మాత‌గానూ ప‌వ‌న్ స‌త్తా చాటాల‌ని చూస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. నితిన్‌ ప్రస్తుతం తన చిత్రం ‘లై’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆత‌ర్వాత రూపొంద‌బోతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్మాణ సార‌ధ్యంలో వ‌స్తున్న సినిమాలో నితిన్ న‌టించ‌బోతున్నాడు. తాజాగా ఆ సినిమా షూటింగ్ ప్రారంభించారు. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కథను అందించారు. ‘రౌడీ ఫెలో’ ఫేమ్‌ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలోనూ మేఘ ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.Read More