tollywood

 
 

స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…

ktr samantha

అక్కినేని వారి కాబోయే కోడలు ఏమి చేసినా ఆస‌క్తిదాయ‌క‌మే. తాజాగా తెలంగాణా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ట్వీటు ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. కేటీఆర్ స్పంద‌న‌తో మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పై స‌మంత పొగ‌డ్త‌ల వ‌ర్షం వెనుక కార‌ణాల‌పై ప‌లువురు ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డం విశేషం. కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్వీట్ చేసిన స‌మంత . ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అని ట్వీట్ చేసింది. సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని రిప్లయ్ ఇచ్చారు.Read More


పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్టీఆర్

ntr jailavakusa

ఎన్టీఆర్‌ ఏంటీ సమ సమాజ్‌ పార్టీ ఏంటీ…అనుకుంటున్నారా? ఇది నిజమేనండీ బాబూ… ఆయన పార్టీ అదే..కానీ రియల్‌ లైఫ్‌లో కాదు సుమా…రీల్‌ లైఫ్‌లో మాత్రమే.. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ఎన్టీఆర్‌ ‘జై’గా ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇందులో రాజకీయ నాయకుడిగా కూడా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. ఇప్పుడివి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇందులో ‘సమ సమాజ్‌ పార్టీ’ బ్యానర్లపై ఎన్టీఆర్‌ ఫొటో కనిపిస్తోంది. ఈ బ్యానర్లను బట్టి ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం కూడా ఉండొచ్చునని తెలుస్తుంది. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు.Read More


నో కామెంట్ అంటూ స‌రిపెట్టిన స‌మంత‌

samantha

ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్‌ సికు బ్రాండ్ అంబాసిడర్‌గా అక్కినేని వారి కాబోయే కోడలు సమంత వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ తన 150వ షో రూమ్‌ను వరంగల్‌ హన్మకొండలో ఏర్పాటు చేసింది. ఆ షోరూమ్‌ను సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో సమంత మాట్లాడుతూ అక్టోబర్ 6, 7న నాగ చైతన్యతో తన వివాహం గోవాలో జరుగుతుందని చెప్పారు. తమ వివాహం చాలా సింపుల్‌గా జరుగుతుందని సమంత అన్నారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు గురించి సమంతను మీడియా ప్రశ్నించగా.. ఆమె సింపుల్‌గా ‘నో కామెంట్’ అని దాని గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంగ్లండ్‌తో వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడబోతున్న ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్‌కు ఈ సందర్భంగా సమంత ఆల్ ది బెస్ట్ చెప్పారు.


బాల‌య్య 102కి వాళ్లు ఫిక్స్

nbk

తన వందో చిత్రం ‘గౌతమిపుత్రి శాతకర్ణి’ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘పైసా వసూల్’ సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమాను పట్టాలెక్కించేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాకు సైన్ చేసిన బాలయ్య.. ఆగస్టు 3 నుంచి ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారని, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి స్వరాలు సమకూర్చిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నట్లుRead More


అకున్ సబర్వాల్ కి సినిమా చూపిస్తున్నారు..!

Akun

సినిమా వాళ్ళ‌తో పెట్టుకుంటే సినిమా ఎలా ఉంటుందో అకున్ స‌బ‌ర్వాల్ కి క‌నిపిస్తోంది. అచ్చు సినిమా సీన్ లో ఆయ‌న‌కు జీవితంలో ఎదుర‌వుతున్నాయి. తాజాగా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చిన త‌ర్వాత ఎక్సైజ్ డీఐజీ అకున్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాంతో ఆయ‌న మీద డ్ర‌గ్స్ మాఫియా గురి పెట్టిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్టు క‌నిపిస్తున్న‌ సబర్వాల్ కు బెదిరింపులు వస్తున్నాయి. 10 రోజులుగా డ్రగ్ మాఫియా అకున్ సబర్వాల్ ను బెదిరిస్తోంది. ప్రతిరోజూ ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా…నిన్నటి రూట్ మార్చింది. నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు…అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. అకున్ సబర్వాల్ కుRead More


నో చెప్పిన ఎన్టీఆర్

ntr

టాలీవుడ్ లోనే కాదు సినీ ఇండ‌స్ట్రీలో రీమేక్ లకు ప్రాధాన్య‌త ఉంది. మినిమ‌మ్ గ్యారంటీ అనే విశ్వాసం ఉంటుంది. అయితే తాజాగా తార‌క్ అలాంటి సినిమాకు నో చెప్పాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. దాంతో ఇది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర అంశంగా మారింది. ప్రస్తుతం ‘జై లవకుశ’ షూటింగ్‌లో బిజీగా వున్న ఎన్టీఆర్ మరోవైపు బిగ్‌బాస్ టీవీ షోను నడిపిస్తున్న విషయం తెలిసిందే. జై లవకుశ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతోంది. దీన్ని దసరాకు విడుదల చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు దర్శకుడు బాబీ. ప్రస్తుతం జై లవకుశ చిత్రంలో ఏకంగా మూడు పాత్రలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమా తరువాత కొరటాల శివ, త్రివిక్రమ్‌లతో ఎన్టీఆర్ పనిచేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ముందు త్రివిక్రమ్Read More


డ్ర‌గ్స్ లో కాలేసిన మీడియా..!

charmi

తెలుగుమీడియా కి డ్ర‌గ్స్ మ‌త్తు బాగా ఎక్కిన‌ట్టుగా ఉంది. వాస్త‌వాలు విస్మ‌రించి ఊగిపోతోంది. వారం ప‌దిరోజులుగా డ్ర‌గ్స్ త‌ప్ప మ‌రో మాటే క‌నిపించ‌డం లేదు. టీవీలో న్యూస్ చానెల్ పెడితే చాలు డ్ర‌గ్స్ గోల వినలేక‌పోతున్నామ‌ని సాధార‌ణ ప్రేక్ష‌కులు వాపోతున్నా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. టాలీవుడ్ సెలబ్రిటీల వ్య‌వ‌హారం కావ‌డంతో ఎక్క‌డ వెనుక‌బ‌డిపోతామోన‌నే ఆలోచ‌న‌ల‌తో అన్ని చానెళ్లు అదే దారిలో సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే వార్త‌లు వ‌దిలేసి డ్ర‌గ్స్ చుట్టూ తిర‌గ‌డం చాలామందిని విస్మ‌యం క‌లిగిస్తోంది. అదే క్ర‌మంలో ఏకంగా పప్పులో కాలిసేన‌ట్టు క‌నిపిస్తోంది. పూరీ జ‌గన్నాథ్ అండ్ కో ని ఇర‌కాటంలో పెట్టాల‌నే తాప‌త్ర‌యంలో భాగంగా ఓ ఫోటోను తెర‌మీద‌కు తెచ్చారు. ప్ర‌స్తుతం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చార్మీ, పూరీల‌కు సంబంధించిన ఓ ఫోటోను విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఆ ఫోటోలో డ్ర‌గ్ డీల‌ర్Read More


మీడియాను తాకిన డ్ర‌గ్స్

journalists-quotes-4

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం మీడియాను కూడా తాకింది. జ‌ర్న‌లిస్టులు కూడా మిన‌హాయింపు కాద‌ని స్ప‌ష్ట‌మ‌య్యింది. తాజాగా వెల్ల‌డయిన వివ‌రాల‌తో పాత్రికేయుల్లో క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. 15మంది జ‌ర్న‌లిస్టుల‌కు నోటీసులు అందిన‌ట్టు సాగుతున్న ప్ర‌చారంతో ప‌లువురు ఖంగుతిన్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ లో సినీ, క్రైమ్ విభాగాల్లో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు డ్ర‌గ్స్ ముఠాతో స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే ప్ర‌చారం ఉంది. దాంతో ఈ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అంతేగాకుండా ఓ ప‌త్రికాధిప‌తి పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం విశేషం. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సిట్ అధికారులు ఇప్ప‌టికే పూరీ, శ్యామ్ వంటి వారిని విచారించారు. సుబ్బ‌రాజు విచార‌ణ సిద్ద‌మ‌య్యింది. ఇద్ద‌రినీ విచారించిన అధికారుల‌కు ప‌లు అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా గోవా కేంద్రంగా సాగుతున్న‌వ్య‌వ‌హారాల గుట్టు ర‌ట్ట‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మరి కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చినట్లు తెలిసింది. వారిRead More


డ్ర‌గ్స్ మ‌త్తులో పొలిటిక‌ల్ స్టార్లు..!

drugs

చిన్న చిన్న చినుకులుగా మొద‌ల‌యిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం పెను తుఫానుగా మారుతుంద‌నుకుంటే అది కాస్తా అల్ప‌పీడ‌నంగా మిగిలిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బ‌డాబాబులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌డంతో ఈ వ్య‌వ‌హారాన్ని సాగ‌దీసి స‌రిపుచ్చే ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే క్ర‌మంలో కొంద‌రు బ‌ల‌ప‌శువుల‌ను కూడా సిద్ధం చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. వాస్త‌వానికి డ్ర‌గ్స్ భాగోతంలో తొలుత ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్ల వ్య‌వ‌హారం ముందుకొచ్చింది. ప‌లు స్కూళ్లలో డ్ర‌గ్స్ చాలా య‌ధేశ్ఛ‌గా సాగుతున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ఏకంగా విస్కీని వాట‌ర్ బాటిళ్ల‌లోనూ, ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ పెన్సిల్ బాక్సుల్లోనూ పెట్టుకుని స్కూళ్ల‌కు వెళుతున్న విద్యార్థుల వ్య‌వహారం అధికారులే బ‌య‌ట‌పెట్టారు. కానీ అంత‌లోనే అదే అధికారుల దృష్టంతా టాలీవుడ్ మీద ప‌డింది. ఇంట‌ర్నేష‌న్ స్కూళ్ల‌న‌గానే హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌డాబాబుల వార‌సులంతా చ‌దివే స్కూళ్లు. ఆ స్కూళ్ల జోలికి వెళితేRead More


జీవితం నాశ‌నం చేశారు..!

puri jagannadh