Main Menu

tollywood updates

 
 

అప్పుడు కాద‌ని ఇప్పుడు చిరుతో సై అంటోంది..!

Nayan

చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ కోసం చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. చివ‌ర‌కు కాజ‌ల్ ఖ‌రారుకావ‌డం, సినిమాలో చిరు స‌ర‌స‌న మెప్పించ‌డం జ‌రిగిపోయింది. కానీ అప్ప‌ట్లో ఆ పాత్ర కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించిన‌ప్పుడు ఆమె కాద‌న్న‌ది. త‌న‌కు వీలు లేద‌ని చెప్పేసింది. కానీ ఇప్పుడీ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ మెగాస్టార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు స‌మాచారం. ఖైదీ నంబర్‌ 150’ తర్వాత ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్న విషయం విదితమే. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించనున్నారు. ఇందులో ఒక నాయికగా నటించేందుకు నయనతార అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మెగా హీరోతో నయనతార జతకట్టనుండటం ఇదే తొలిసారి. ఇదివరకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ప్రారంభించాలనుకున్న ఈ చిత్రాన్ని ఓ వారం ముందుగాRead More


మ‌ల్టీస్టార‌ర్ మెగా ప‌వ‌ర్ స్టార్

ramcharan

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ క‌న్ఫ‌ర్మ్ అవుతోంది. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం మీద ఉన్న చెర్రీ ఆ త‌ర్వాత మ‌ల్టీస్టార‌ర్ మువీని చేయ‌బోతున్న‌ట్టు దాదాపు ఖ‌రార‌య్యింది. దానికి సంబంధించిన పూర్తివివ‌రాలు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. చాలాకాలం క్రిత‌మే మ‌ణిర‌త్నం, రామ్ చ‌ర‌ణ్ మువీకి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ అవి వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను విర‌మించుకున్నారంటూ టాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపించాయి. అయినా ఇప్పుడు వాటికి భిన్నంగా చెర్రీ , మ‌ణిర‌త్నం సినిమా ట్రాక్ ఎక్క‌డం ఖాయ‌మ‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ‘చెలియా’ డిజాస్టర్‌గా నిలవడంతో, రామ్‌చరణ్‌ మనసు మార్చుకున్నాడని చెప్పిన‌ప్ప‌టికీ సుకుమార్‌ సినిమా తర్వాత చెర్రీ చేయబోయేది మణిరత్నం సినిమాయేనని మెగా ఫ్యామిలీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఓ మల్టీస్టారర్‌Read More


బాహుబ‌లి కన్నా అదే గొప్ప‌

ss rajamouli

బాహుబ‌లి సినిమా స‌క్సెస్ త‌ర్వాత రాజ‌మౌళి కీర్తి అమాంతంగా పెరిగిన సంగ‌తి అంతా అంగీక‌రిస్తారు. అయితే తాజాగా ఓ సినీ ప్ర‌ముఖుడు రాజ‌మౌళిని క‌లిసిన త‌ర్వాత చేసిన వ్యాఖ్య చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల లైకా ప్రొడ‌క్ష‌న్ హెడ్ రాజు మ‌హాలింగం ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజు మ‌హాలింగం చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ‘రాజమౌళిని కలిశా. ఆయన వినయం బాహుబలి విజయం కన్నా చాలా గొప్పది’ అంటూ ఆయ‌న ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఉన్న ‘2.ఓ’ చిత్రం గురించి కూడా రాజ‌మహాలింగం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.Read More


కోటికి చేరిన‌ ‘జై ల‌వ‌కుశ‌’

Jai-teaser-640x346

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తార‌క్ న‌టిస్తోన్న ‘జై ల‌వకుశ’ సినిమా టీజ‌ర్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా టీజ‌ర్‌కి సెన్సేష‌న‌ల్ రెస్పాన్స్ వ‌స్తోందని ఎన్టీఆర్ ఆర్ట్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొంది. కేవ‌లం 48 గంట‌ల‌ల్లోపే కోటి డిజిట‌ల్ వ్యూస్‌ను దాటేసిందని, ఈ టీజ‌ర్ గ‌త‌ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టేస్తోంద‌ని పేర్కొంది. ఈ టీజ‌ర్‌కు ఇంత‌గా ఆద‌ర‌ణ చూపిస్తోన్న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నామ‌ని పేర్కొంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తోన్న ‘జై ల‌వ‌కుశ’ సినిమాపై ఈ టీజ‌ర్ అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ టీజర్ ను పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. మొదటిసారిగా రావణుడిలా నెగిటివ్ పాత్రలో కనపడుతున్న ఎన్టీఆర్ ఆహార్యం ‘అదుర్స్’ అంటూ కితాబిస్తున్నారు. ఎన్టీఆర్ డైలాగ్‌లు వదిలిన తీరుకిRead More


చెర్రీకి ఆ సినిమా లేన‌ట్టే!

ramcharan

ప్రస్తుతం భిన్నమైన సినిమాగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఇప్పటికే ఈ సినిమాలోని చరణ్ స్టిల్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1985 నాటి కథ అంటూ సాగుతున్న ఈ సినిమాలో చరణ్ చెవిటివాడిగా నటిస్తున్నాడని, రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ సినిమా తరువాత చరణ్ ఓ పాపులర్ దర్శకుడితో సినిమా చేస్తానని చెప్పాడు. దాంతో ఆ దర్శకుడు స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలుపెట్టాడు. కానీ ఈ సినిమా చేయడానికి ఇప్పుడు చరణ్ ఆసక్తిగా లేడట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా.. అవును మీరు అనుకున్న ఆ దర్శకుడే మణిరత్నం. చాలా రోజులపాటు చర్చలు జరిపి చరణ్‌ని ఒప్పించాడు మణిరత్నం. కథRead More


నితిన్ కి విల‌న్ గా హీరో..!

nithiin31465264403

ఆంజనేయుడు అర్జున్‌..ఆయన భక్తుడు నితిన్‌..ఈ సినిమా ‘శ్రీఆంజనేయం’. ఇందులో భక్తుడికి రక్షణగా ఆంజనేయుడు ఉంటాడు. ఇప్పుడు నితిన్‌కు విలన్‌గా అర్జున్‌ చేయబోతున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది. మేఘా ఆకాష్‌ కథానాయికగా చేస్తుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రూపొందుతోంది. వెంకట్‌ బోయినపల్లి సమర్పకుడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్రబృందం వెల్లడించింది. అనీల్‌ సుంకర మాట్లాడుతూ ”హను ఈ స్టోరీ చెప్పగానే ఈ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనే విషయంలో మూడు నెలలు డిస్కస్‌ చేశాం. అర్జున్‌ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆయన చేస్తారా?లేదా? అనే డౌట్‌ వచ్చింది. అర్జున్‌ స్టోరీ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఇందులో అర్జున్‌ క్యారెక్టర్‌ చాలా స్టైలిష్‌గా ఉంటుంది” అని తెలిపారు. హను రాఘవపూడి మాట్లాడుతూRead More


వాటికి దూరంగా ఎన్టీఆర్ ..

ntr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త రూట్లో రెడీ అవుతున్నారు.. అయితే జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేసిన ఈ మాస్ హీరో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే వ‌రుసగా హిట్లు కొడుతూ టాలీవుడ్ మార్కెట్ లో తానేంటో నిరూపించుకున్న ఎన్టీఆర్ దానికి త‌గ్గ‌ట్టుగా త‌ర్వాత సినిమాలు ఉండాల‌ని ఆశిస్తున్నారు. అందుకు తగ్గ‌ట్టుగానే ప‌లు మార్పుల‌తో సాగుతున్నాడు. తాజాగా పూరీ జ‌గన్నాధ్ స‌బ్జెక్ట్ ను కాద‌ని చెప్పేసిన ఎన్టీఆర్ యంగ్ డైరెక్ట‌ర్స్ అనిల్ ర‌విపూడి, చందు మొండేటి క‌థ‌లు పరిశీలించాడు. అయితే వారిద్ద‌రికీ ఎన్టీఆర్ ఓ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ప్ర‌యోగాల క‌న్నా మాస్ మ‌సాలా మువీతోనే త‌న‌కు సేఫ్ అని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మార్పుల‌తో ముందుకు రావాల‌ని అనిల్ రావిపూడికి ఎన్టీఆర్ ఆదేశించిన‌ట్టు చెబుతున్ఆన‌రు.Read More


త్రివిక్ర‌మ్ కి అరుదైన ఘ‌న‌త‌

trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ విడుదల కానుంది. నేడు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఎబిసి డిజిటల్ మీడియా వారు తెలుగు పరిశ్రమలో తొలిసారిగా ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను వారు రూపొందించారు. అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన దర్శకుడు త్రివిక్రమ్‌కు జన్మదిన కానుకగా ఈ యాప్ విడుదల కానుంది. ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన చిత్రాలకు సంబంధించిన అన్ని తాజా విశేషాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్స్ నుండి ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్‌ను నేటినుంచి డౌన్‌లోడ్ చేయవచ్చని, యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా రూపొందించిన ఇందులో అన్ని అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మెసేజ్‌ల ద్వారా అభిమానులకు అందడమే ఇందులో విశేషమని సంస్థRead More


అనుకున్నా..మ‌ళ్లీ న‌టించాల్సి వస్తోంది!

1478365017.stills-kajalagarwal

‘జీవితంలో చాలా చేద్దామనుకుంటాం. కానీ కొన్ని చేయలేం. కొన్ని చేయకూడదనుకున్నా అవి మనకు తెలియకుండా అలా జరిగిపోతాయి. అంతే. వాటికి మనం బాధ్యలమా? అంటే కాదనే చెప్పాలి. మరో సారి అవును అని చెప్పక తప్పదు” అని కాజల్‌ అగర్వాల్‌ అంటుంది. ఈ హీరోయిన్‌ తన జీవితంలో చాలా అనుకోని, చేయకూడనవి చేసిందట. కొన్ని పరిస్థితుల్లో వాటిని చేయాల్సి వచ్చిందని చెబుతుంది. ఇటీవల తమిళ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది. సినిమాల ఎంపిక విషయంలో కూడా కొన్నింట్లో నటించకూడదని అనుకున్నా ఎందుకో మళ్లీ నటించాల్సి వస్తుందని చెప్పింది. కాజల్‌ ప్రస్తుతం జీవా హీరోగా ‘ఎంత వరకు ఈ ప్రేమ’ సినిమాలో కథానాయికగా చేస్తోంది. చిరంజీవితో ‘ఖైదీ నంబర్‌ 150’లో నటిస్తోంది. వీటితో పాటు తేజ దర్శకత్వంలో రానా హీరోగా చేస్తోన్న ప్రేమ కథా చిత్రంలో చేస్తోంది.


సీఎంగా మ‌హేష్..!

mahesh

సూపర్‌స్టార్ మహేష్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్ చిత్రం కంప్లీట్ కాగానే మహేష్ మరో సినిమాని అప్పుడే లైన్నో పెట్టేసాడు. అది శ్రీమంతుడితో ఇండస్ట్రీకి టాప్ 2 హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఉంటుందని ఎప్పుడో ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కబోతుంది. ఇక ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మహేష్ మురగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమాలోకి దూకేస్తాడన్నమాట. ఈ సినిమాలో మహేష్ పొలిటికల్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇక కొరటాల అప్పుడే ఆ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టేశాడని, మహేష్‌కి జోడిగా నటించే హీరోయిన్స్ వేటలో కొరటాల ఉన్నాడనే టాక్ కూడా బయటకొచ్చింది. ఇక ఇప్పుడు మహేష్ -కొరటాల చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.Read More