tollywood movies

 
 

హాట్‌ ఫొటోషూట్‌…

kajal_agarwal

టాలీవుడ్‌కి చందమామ కాజల్‌ అగర్వాల్‌.. ఇప్పుడు కెరీర్‌లోనే పీక్‌ స్టేజ్‌లో ఉంది. వరుసగా టాప్‌ లైన్‌లో ఉన్న హీరోలు అందరినీ కవర్‌ చేసేస్తోంది. రిజల్ట్‌ ఎలా ఉన్నా.. అమ్మడికి మాత్రం వరుస ఆఫర్స్‌ రావడం చూస్తూనే ఉన్నాం. మొదట పవన్‌ తో సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌.. ఆ తర్వాత మహేష్‌ బాబుతో బ్రహ్మోత్సవం చేసిన ఈ భామ.. రీసెంట్‌ గా కావలై వేందాం అంటూ కుర్ర హీరో జీవా పక్కన కూడా కనిపించింది. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో ఖైదీ నెంబర్‌ 150 చేస్తూ.. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా కంటిన్యూ అవుతోంది. ఇలాంటి పీక్‌ స్టేజ్‌ లో ఉన్న కాజల్‌కు.. ఏదో ఆలోచన వచ్చినట్లుంది. అందుకే సడెన్‌గా ముందరున్న పుస్తకాన్ని వదిలేసి.. తన్మయత్వంగా పైకి చూస్తోంది. కాసింత చలి వాతావరణం కావడంతో.. చందమామకు చలేసినట్లుంది.. అందుకే చక్కగాRead More


మ‌ళ్లీ ఖాకీలో మాస్ మ‌హారాజ్..!

Ravi-Teja-Power-Audio-Launch-9-1024x682

మాస్ మహరాజ్ రవితేజ మేకప్ వేసుకొని నెలలు గడిపోతుంది. బెంగాళ్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించినా.. తరువాత సినిమా ఎంపికలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ మాస్ హీరో. మూడు ప్రాజెక్ట్‌లు ప్రారంభమైనట్టే అనిపించినా… అవి వెనక్కి వెళ్లిపోయాయి. తాజాగా మరో సినిమాను రవితేజ కన్ఫామ్ చేశాడన్న వార్త వినిపిస్తోంది. రేసుగుర్రం లాంటి సూపర్ హిట్ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించిన విక్రమ్ సిరి దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విక్రమార్కుడు, పవర్ సినిమాల్లో పోలీస్ గెటప్‌లో అదరగొట్టిన రవితేజ, ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో అలరించనున్నాడట. రవి తేజ్ వరస చిత్రాలు చేసుకుంటు హిట్స్ ప్లాప్‌లకు అతీతంగా ఉండే వాడు. సుమారు ఎడాది అవుతున్న మళ్లిRead More


ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న ఎన్టీఆర్..!

janatha garage ntr

ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. సమంత, నిత్యా మీనన్‌ కథానాయికలు. ఈ సినిమాను సెప్టెంబర్‌ రెండున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ పనిలో భాగంగానే ఈ చిత్ర బృందం కేరళకు తరలి వెళ్లింది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ పార్టు పూర్తయిపోతుంది. కేరళలో ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో క్లయిమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించేశారు. కేరళలో కొన్ని సన్నివేశాలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూట్‌ చేస్తారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఐటెమ్‌ సాంగ్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తారు. అప్పటి నుంచి పోస్టు ప్రొడక్షన్‌ పనులు చేపడతారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ప్రకృతి ప్రేమికుడుగా, మెకానికల్‌ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. మోహన్‌ లాల్‌ హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో ఉండే ‘జనతాRead More


ఫ్యాన్స్ కి మ‌హేష్ బ‌ర్త్ డే గిఫ్ట్..!

mahesh

ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను ఆగస్టు 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అభిమానులకు కానుకగా ప్రీ లుక్ ప్లాన్ చేశారట. బ్రహ్మోత్సవం సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని మహేష్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మురగదాస్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో,కొరటాల శివతో మహేష్ కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. మహేష్‌కు ‘శ్రీమంతుడు’తో తిరుగులేని హిట్ ఇచ్చిన కొరటాల ఈసారి అంతకు పెద్ద హిట్ ఇచ్చే కథతో రానున్నారని సమాచారం.


అనుష్క ఏడ్చేసింది..!

Anushka-Photos-at-Singam-First-Look-Launch-latest-hot-photo-gallery-873

అనుష్క మ‌ళ్లీ చిన్న గ్యాప్ త‌ర్వాత బిజీగా మారుతోంది. ఓవైపు బాహుబ‌లి-2 పూర్తి చేసే ప‌నిలో ఉంది. అదే స‌మ‌యంలో ఓం న‌మో వెంక‌టేశాయ సినిమాకు సిగ్న‌ల్ ఇచ్చేసింది. భాగ‌మ‌తి కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల‌తో అన్ని ర‌కాల పాత్ర‌ల‌తోనూ ఏక‌కాలంలో అనుష్క న‌టిస్తోంది. అయితే ఇటీవ‌ల అనుష్క త‌న బాధ‌ను వెళ్ల‌గ‌క్కింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మువీస్ మూలంగా ప‌డే ఇబ్బందుల‌ను ఏక‌రువు పెట్టింది. వ‌రుస‌గా ప‌లు సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లో పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అనుష్క త‌న క‌ష్టం వెల్ల‌డించింది. ఏ రంగంలోనైనా కష్టంలేనిదే ఫలితం ఉండదు. సుఖం అంతకన్నా ఉండదంటున్న అనుష్క అందుకు త‌గ్గ‌ట్టుగానే అరుంధతి, రుద్రమదేవి, సైజ్‌జీరో, బాహుబలి చిత్రాలకు ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి రెట్టింపు కష్టపడ్డానని చెప్పింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చాలా కష్టంతోRead More


జ‌న‌తా గ్యారేజ్ కి అదో స్పెష‌ల్..!

ntr janatha

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చే సినిమాలంటే.. మిగతాదంతా ఓ ఎత్తు అయితే.. ఐటెం సాంగ్ ఒకటీ మరొక ఎత్తు అనే రేంజ్ లో ఉంటుంది. చాలా సినిమాల్లో ఐటెం సాంగులు ఇరగదీసేస్తాడు డీఎస్పీ. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం కూడా ఓ అదిరిపోయే బీట్ తో ఐటెం సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది. కొత్త టైప్ సౌండ్ ట్రాక్ తో డీఎస్పీ ఇచ్చిన బీట్ విన్న యంగ్ టైర్ ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివ విపరీతంగా ఎగ్జైట్ అయ్యారట. తమ సినిమాలో ఈ మ్యూజిక్ ని కచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిందే అనే రేంజ్ లో డీఎస్పీ మరిపించే శాడని అంటున్నారు. అందుకే ముందుగా అనుకోక పోయినా.. తమ మూవీలో ఈ ట్రాక్ సెట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే తమన్నాని అప్రోచ్Read More


అటు సూప‌ర్ స్టార్ ..ఇటు ప‌వ‌ర్ స్టార్ ..మ‌ధ్య‌లో ర‌కుల్!

pawankalyan-maheshbabu

టాలీవుడ్ లో హీరోయిన్ల‌కు ఒక్కో సీజ‌న్ ఉంటుంది. ఆ స‌మ‌యంలో వారికి వ‌రుస‌గా ఛాన్స్ లు వ‌చ్చి ప‌డుతుంటాయి. సద్వినియోగం చేసుకుంటే కొన్నాళ్ల‌పాటు తిరుగుండ‌దు. కానీ సెల‌క్ష‌న్స్ లో తేడాలొస్తే మాత్రం తెర‌మ‌రుగు కావ‌డం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. స‌రిగ్గా ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ హ‌వా చూస్తుంటే ఇప్పుడ‌న్నీ ఆమె రోజులుగానే క‌నిపిస్తున్నాయి. వ‌రుస ఛాన్స్ లతో ఈ భామ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. పెద్ద ప్రాజెక్టుల కోసం యంగ్ హీరోల‌తో అవ‌కాశాల‌ను వ‌దులుకునే వ‌ర‌కూ వ‌చ్చేసింది. ఇటీవ‌ల మ‌హేష్ మువీ ఆమెను వెతుక్కుంటూ రావ‌డంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ ని కాద‌ని చెప్పేసింది. ఇక ఇప్పుడు మ‌రో మెగా హీరోలు ఆమెకు అవ‌కాశం వ‌చ్చేసింది. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌క్క‌న ఆమెకు ఆఫ‌ర్ సిద్ధ‌మ‌య్యింది. ఏకకాలంలో అటు సూప‌ర్ స్టార్ తో ఇటు ప‌వ‌ర్ స్టార్ తో స్క్రీన్Read More


అప్పుడే దూర‌మ‌యిపోతున్న సినీ జంట‌

amalapal

సినిమా పెళ్లిళ్లు ఎంత త్వ‌ర‌గా జ‌రుగుతాయో..అంతే త్వ‌ర‌గా విబేధాలు మొద‌ల‌వుతాయి. అందుకే సినీ జంట‌ల సంసారాలు సామ‌ర‌స్యంగా సాగిన‌వ‌ని చాలా కొన్నే. టాలీవుడ్ అయినా..బాలీవుడ్ అయినా ఇదే తంతు. చివ‌ర‌కు కోలీవుడ్ కూడా మిన‌హాయింపు కాదు. సినిమా ప‌రిశ్ర‌మ అన్ని చోట్లా వివాహ‌బంధాలు బ‌లంగా సాగేవి అరుదుగానే ఉంటాయి. ఇప్పుడు అలాంటి కోవ‌లో అమలాపాల్ కూడా చేరిపోయింద‌ని స‌మాచారం. ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న ప్ర‌చారం ప్ర‌కారం అమలాపాల్ భ‌ర్త‌తో బేధాభిప్రాయాలు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. దాంతో ఇద్ద‌రూ గ్యాప్ కూడా మెయింటైన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. త‌మిళ డైరెక్ట‌ర్ విజ‌య్ తో అమలాపాల్ పెళ్లి రెండేళ్ల క్రిత‌మే జ‌రిగింది. ఆత‌ర్వాత ఆ జంట ఫారిన్ ట్రిప్పులు కూడా తిరుగుతూ హ‌ల్ చ‌ల్ చేసింది. సోష‌ల్ మీడియా నిండా భ‌ర్త‌తో ఫోటోలోను అమలాపాల్ నింపేసేది. అదంతా గ‌తం అని చెబుతున్నారిప్పుడు.Read More


మ‌హేష్ తో మొద‌లు పెట్టాలంటే 100 కావాలి..!

mahesh

బడ్జెట్లు పెరిగిపోయాయి పెరిగిపోయాయి అని గగ్గోలు పెడతారు. కానీ ఇలా అరిచేవాళ్లే స్టార్ హీరోలు, దర్శకుల వెంట పడి వెంటపడి వాళ్ల డేట్ల కోసం పారితోషకం విషయంలో బంపర్ ఆఫర్లు ప్రకటించేస్తుంటారు. బడ్జెట్లు ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల పారితోషకాలు సినిమా సినిమాకూ ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. మామూలుగా ఓ హీరోకు ఒక ఫ్లాప్ వస్తే అతడి తర్వాతి సినిమా విషయంలో డిమాండ్ తగ్గుతుంది. పారితోషకం పెంచడానికి అవకాశముండదు. కొన్నిసార్లు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. కానీ మహేష్ బాబు విషయంలో ఇలా జరగట్లేదు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినా సరే.. కొరటాల శివతో చేయాల్సిన సినిమాకు పాతిక కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడట మహేష్. ఈ సినిమాకు కొరటాలకు రూ.15 కోట్ల దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంటే వీళ్లిద్దరికే రూ.40 కోట్లుRead More


బాల‌య్య గౌత‌మీ పుత్ర షూటింగ్ ఆపేశారు..!

balayya

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ఆగిపోయింది. స్వయంగా బాలకృష్ణే షూటింగ్‌ను ఆపించారు. కార‌ణం ఏమిటా అని ఆరా తీస్తున్నారా..బాల‌య్యకు ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారా..కాదండి బాబు..డైరెక్ట‌ర్ కి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని బాల‌య్య ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అవును..ద‌ర్శ‌కుడు క్రిష్ పెళ్లిబాజాలు మోగ‌బోతున్నాయి. ఆగ‌ష్ట్ 8న పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఈలోగా పెళ్లిప‌నుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌స్తుతం షూటింగ్ నిలిపివేసిన‌ట్టు చెబుతున్నారు. ఆగస్టు 8వ తేదీన హైదరాబాదుకు చెందిన డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి డేటు దగ్గరపడుతున్నా.. క్రిష్ ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటుండంతో బాలయ్యే స్వయంగా జోక్యం చేసుకుని సినిమా షూటింగ్‌ను ఆపించారు. ప్రస్తుతం జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దీంతో జార్జియా షూటింగ్ లొకేషన్ నుంచి క్రిష్‌ను బాలయ్య పెళ్ళి కోసం బయల్దేరమన్నాడు. బాలయ్య చెప్పడంతో రెండు రోజుల్లో క్రిష్ జార్జియాRead More