Main Menu

teluguupdates

 
 

మార్పుల‌కు శ్రీకారం చుట్టిన జ‌గ‌న్..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను మార్చే ప‌నిలో ప‌డ్డారు. రాజ‌కీయ తెర‌మీద వేగంగా పావులు క‌దుపుతూ ర‌స‌వ‌త్త‌రంగా మార్చేస్తున్నారు. అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్నారు. పాల‌క‌ప‌క్షంలో ఓవైపు ఏకంగా టీడీపీ అధినేత మీదే ఎంపీ జేసీ వంటి వాళ్లు నోరి విప్పి సెటైర్లు వేస్తున్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ త‌న పార్టీని చ‌క్క‌దిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు. దేవుడు క‌రుణిస్తే ఏడాదిలోనో, రెండేళ్ల‌కో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోతుంద‌ని ప‌దే ప‌దే చెబుతున్న చంద్ర‌బాబు ఈలోగా రాజకీయ వేడి రాజేయ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ఓవైపు పోల‌వ‌రం నిర్వాసితుల కోసం నినాదం, ఆవెంట‌నే ఆరోగ్య శ్రీ కోసం ఆందోళ‌న‌..అంత‌లోనే మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లికి కండువాలు క‌ప్పే కార్య‌క్ర‌మం..మ‌రుస‌టి రోజే న‌ర్సారావుపేట‌లో భారీ బ‌హిరంగ‌స‌భ‌..రెండు రోజులుRead More


ఎన్టీఆర్ నెంబ‌ర్ కోసం తార‌క‌ర‌త్న ..!

గుంటూరు నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్‌లైన్ వేలంలో ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. 9999 నెంబర్‌ను ఆయన రూ. 6 లక్షలకు దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం పలువురు ప్రముఖులు పోటీపడినప్పటికీ, తారకరత్నకే ఈ నెంబర్ దక్కింది. ఇంతకు ముందు 9999 నెంబర్‌కు పలుచోట్ల నిర్వహించిన వేలం పాటల్లో జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెంబర్ అంటే తనకు చాలా ఇష్టమని, అది తన లక్కీ నెంబర్ అని చాలా ఇంటర్వ్యూలలో జూనియర్ చెప్పారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన తారకరత్న ఈ నెంబర్‌ను దక్కించుకోవడం విశేషం.


ఏం చేసినా మంచిదే..!

ప్రతి రోజు స్నానం అనేది మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. బాక్టీరియాను నశింపజేస్తుంది. కొంతమంది ఎప్పుడూ చన్నీళ్లతో స్నానం చేస్తారు. మరికొంతమంది వేడినీటితో స్నానం చేస్తారు. అలా కాకుండా సందర్భాన్ని బట్టి ఫాలో అయితే రెండూ ఆరోగ్యానికి మంచివే. మీరు ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన్పుడు, ఎక్సర్‌ సైజ్‌ చేసి వచ్చినప్పుడు చన్నీటి స్నానం హాయిగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. హృదయ రేటును తగ్గించడంతో పాటు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఈ వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి ముక్కు రంధ్రాలను ఫ్రీగా చేస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. ు


చెర్రీ కోరిక‌ను కామ‌ట‌రాయుడు క‌రుణిస్తాడా..!?

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి చాలా రోజులైంది. ఈ మధ్య అతని సినిమాలేవీ జనాలను ఆకట్టుకోవడం లేదు. ఆ కొరతను తన రాబోయే సినిమా ‘ధృవ’ తీరుస్తుందని చరణ్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌ను చరణ్‌ సీరియస్‌గా తీసుకుంటున్నాడట. అందుకే ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించాలని అనుకుంటున్నాడట. నిజానికి చరణ్‌ ఆడియో ఫంక్షన్‌లన్నింటికీ మెగాస్టారే చీఫ్‌ గెస్ట్‌. అయితే పవన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన చరణ్‌ సినిమాలు ‘మగధీర’, ‘నాయక్‌’ సూపర్‌ హిట్‌లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌తోనే ‘ధృవ’ ఫంక్షన్‌కు పవన్‌ను ఆహ్వానించాలని ప్లాన్‌ చేస్తున్నాడట. సాధారణంగా అయితే చరణ్‌ రిక్వెస్ట్‌ను పవన్‌ కాదనడు. కానీ, ‘ధృవ’ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్‌. ఆయనతో పవన్‌ రిలేషన్‌ అంతంత మాత్రమే. ‘ప్రజారాజ్యం’ టైమ్‌ నుంచి వారి మధ్యRead More


కాజ‌ల్ కి కొత్త బాబా ఆశీర్వాదం..!

టాలీవుడ్ చందమామ‌కు ఆశీర్వాదాలు ల‌భించాయి అందులోనూ కొత్త బాబా ఆశీస్సులు మాకు ద‌క్కుతున్న‌ట్టుగా ఉన్న ఫోటో ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇంతకీ ఆ కొత్త బాబా ఎవ‌ర‌న్న విష‌యం ఆరా తీస్తే అస‌లు విష‌యం తెలిసిందే. ఆ బుల్లి బాబు ద‌గ్గుబాటి వార‌సుడని తెలిసింది. రానా త‌మ్ముడు, సురేష్ త‌న‌యుడు ఇప్పుడీ ముద్దుగుమ్మ‌ను ఆశీర్వ‌దిస్తున్న‌ట్టు ఉన్న ఫోటో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ చిరుతో ఖైదీ నెంబ‌ర్ 150తో పాటు తొలిసారిగా కండలవీరుడు రానాతో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇన్నేళ్ల కెరీర్‌లో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నటిస్తుండడం కూడా తొలిసారే. అందుకే కాజల్‌ను ఆహ్వానిస్తూ అభిరామ్‌ ఇలా ఆశీర్వదిస్తున్నాడన్నమాట. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.


స‌త్తా చాటిన కోహ్లీ

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కుమ్మేసింది. కివీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కోహ్లీ అజేయంగా 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొదటిగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కివీస్‌ను 190 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే ఈ గెలుపుతో టీమిండియా 5 వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ముందు నిలిచింది.


చిరు సెల్ఫీ కోసం.!

విజరు దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తోన్న సినిమా ‘ద్వారక’. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్‌ కలిసి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా సెట్‌లో విడుదల చేశారు. తన అభిమాన నటుడైన చిరంజీవి ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయడం పట్ల హీరో విజరు దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో విజరు సెల్ఫీలు కూడా దిగాడు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : లక్ష్మీభూపాల్‌, ఫైట్స్‌ : విజరు, ఆర్ట్‌ : బ్రహ్మకడలి, ఎడిటింగ్‌ : ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ : శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం : సాయికార్తీక్‌.


న్యాయ‌మూర్తులు- చంద్ర‌బాబు- తిరుమ‌ల‌

ప‌రిస్థితులు మారుతున్నాయి. అన్ని రంగాల్లోనూ అది స్ప‌ష్ట‌మ‌వుతోంది. న్యాయ‌వ్య‌వ‌స్థ కూడా దానికి మిన‌హాయింపు కాద‌ని తేటతెల్ల‌మ‌వుతోంది. న్యాయ‌మూర్తుల వ్య‌వ‌హార శైలి దానికి అద్దం ప‌డుతోంది. ఓ రెండు దశాబ్దాల క్రితం వరకు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు అసలు కలుసుకునే వారు కారు. అధికారిక సంబంధం ఉన్న మీటింగ్స్ లో కలిసినా, ఆంటీ ముట్టనట్లు ఉండేవారు. రాజకీయ నాయకులతో కలిసి వేడుకల లో పాల్గొంటే తమ మీద ఏదైనా ప్రభావం పడుతుందని న్యాయమూర్తులు శంకించే వారు. రాజకీయాల్లో అవినీతి సహజం కాబట్టి, న్యాయమూర్తులు తో ప్రైవేటు గా కలవడానికి రాజకీయ నాయకులు బిడియపడేవారు. కానీ చంద్రబాబు తీరే వేరు. న్యాయమూర్తులు తిరుమల ప్రయాణం పెట్టుకున్న రోజునే ఆయన కూడా తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు. కుటుంబ స్నేహితుల తో మెలిగినట్లు అక్కడే వారితో గడుపుతారు. నైతికంగా ఇది తప్పు అనిRead More


మ‌హేష్ ఛేజ్ చేస్తున్నాడు..!

మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టైటిల్‌ కోసం కొన్ని పేర్లను పరిశీలిస్తోంది చిత్ర యూనిట్‌. బుధ, గురువారాల్లో ఈ చిత్రం షూటింగ్‌ గచ్చిబౌలిలోని ఫైనాన్సియల్‌ సిటీ రోడ్లపై చిత్రించారు. ఛేజింగ్‌ దృశ్యాలను తెరకెక్కించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలో జరుగనుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగువారికే కాదు … తమిళులకు కూడా దీపావళి పెద్ద పండుగ. అందువల్ల ఆ రోజున ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ లోగా ఈ సినిమాకి టైటిల్‌ పెట్టవలసి వుంది. కొన్ని రోజుల క్రితం ‘అభిమన్యుడు’ అనే టైటిల్‌ వినిపించినా, ఆ తరువాత దాని ప్రస్తావన లేదు. కుదిరితే రెండు భాషల్లోను కలుపుకుని ఒకటే టైటిల్‌ పెట్టాలనీ, లేదంటే వేరు వేరుగా టైటిల్స్‌ను పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుRead More


దుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి..!

కడపలో కొత్త క‌థ తెర‌మీద‌కు వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్‌ నాని పెళ్లి పెద్ద దుమారం రేపుతోంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, కొన్ని రోజులయ్యాక వేధింపులకు పాల్పడుతూ తనను నిరాదరణకు గురి చేస్తున్నాడని పుత్తా వాసంతిరెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారుతోంది. కమలాపురం మండలం సంబటూరుకు చెందిన వాసంతిరెడ్డి ఎంటెక్‌ వరకు చదువుకున్నానని, 2013 నుంచి 2015 వరకు కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తుండగా చంద్ర ఓబుల్‌రెడ్డి తన వెంట తిరుగుతూ పరిచయం పెంచుకున్నాడన్నారు. తనకు మాయమాటలు చెప్పి 2015 ఏప్రిల్‌లో తిరుత్తనిలో ఇరువురం పెళ్లి చేసుకున్నామని, అయితే ఆ సమయంలో మేమిద్దరం ఉండడంతో అదే ఏడాది నవంబర్‌Read More