telugunews

 
 

వ‌ర‌ల్డ్ స్మాలెస్ట్ స్మార్ట్ ఫోన్

small phone

స్మార్ట్ ఫోన్ 4 అంగుళాలు ఉన్నాయంటేనే చాలా చిన్నదంటాము. అలాంటిది వాటికంటే అ‍త్యంత చిన్నగా కేవలం 2.45 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లేతో ఓ స్మార్ట్ ఫోన్ బుధవారం లాంచ్ అయింది. జెల్లీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను షాంఘై కంపెనీ యూనిహెర్ట్జ్ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ను ఇది సపోర్ట్ చేస్తోంది. డ్యూయల్ సిమ్(నానో+నానో), 4జీ కనెక్టివిటీ కూడా ఇది కలిగి ఉంది. పెరల్ వైట్, స్పేస్ బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో ఈ జెల్లీ ఫోన్ ను కంపెనీ అందుబాటులోకి వచ్చింది. రెండు ఆప్షన్లు 1జీబీ ర్యామ్/8జీబీ రోమ్, 2జీబీ ర్యామ్/16రోమ్, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, క్వాడ్ కోర్ 1.1 గిగిహెడ్జ్ ప్రాసెసర్, 950ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకతలు.వీటితో పాటు రిమూవబుల్Read More


చెమ‌ట ఎక్కువ‌గా ..!

Woman hands putting sunscreen from a bottle on the beach with the sea in the background

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు.. ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది. రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి. టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపైRead More


మ‌హేష్ తో రెండోసారి..!

rakul

మహేష్‌ బాబు ఓ సూపర్‌ స్టార్‌. రకుల్‌ ప్రీతిసింగ్‌ ప్రస్తుతం తెలుగులో క్రేజీ హీరోయిన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రిన్స్‌ అభిమానులకు పండుగే. త్వరలో ఆ వేడుక రాబోతుంది. ఆ చిత్రమే ‘స్పైడర్‌’. మురగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెలలో షూటింగ్‌ పార్టు పూర్తికానుంది. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో రకుల్‌ మహేష్‌ సరసన చేయాల్సి ఉంది. కానీ డేట్స్‌ కుదరక చేయలేకపోయింది. స్పైడర్‌లో మాత్రం అవకాశాన్ని ఒదులుకోలేదు. ఇప్పుడు మరోసారి రకుల్‌ మహేష్‌కు కథానాయికగా చేయబోతుంది. ఆ చిత్రమే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. దానికి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్లు కైరా అద్వానీ, దిశాపటానీ లాంటి వాళ్లను ముందు అనుకున్నారు కానీ చివరకు రకుల్‌నే నిర్ణయించారు.Read More


ప‌ల్లెకు ఎదురు గాలి

PALLE

అనంత టీడీపీలో వివాదాలు స‌ర్థుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత రాజుకుంటున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా ప‌ట్ట‌ప‌ర్తి మునిసిప‌ల్ చైర్మ‌న్ కి, ప్ర‌భుత్వ చీఫ్ విప్ ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి కి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం కొత్త మ‌లుపు తిరిగింది. మునిసిప‌ల్ చైర్మ‌న్ కి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. పల్లె రఘనాథరెడ్డిపై గత కొంతకాలంగా పత్రికలు, ఇతర మార్గాల ద్వారా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ పి.సి గంగన్నకు టిడిపి జిల్లా అధ్యక్షులు పార్ధసారధి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీస్ అందిన ఐదు రోజుల్లో సంజాయిషి ఇవ్వని పక్షంలో ఆధారాలతో తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. దాంతో పుట్ట‌ప‌ర్తి రాజ‌కీయం మ‌రింత రాజుకుంది. తాజాగా పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో సమన్వయ సమావేశంలోనూ వాగ్వాదం జ‌రిగింది. పార్టీ నీ వల్ల నాశనమవుతోందంటూRead More


గ్లామ‌ర్ అంటే బ‌ట్ట‌లిప్పేయ‌డం కాదు..!

lavanya 2

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులను హోమ్లీగా పలకరించింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత వచ్చిన వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది లావణ్య. ఇప్పటిదాకా ఈ సొట్టబుగ్గల చిన్నది గ్లామరస్ పాత్రల్లో కనిపించింది లేదు. వాస్తవంగా అయితే.. తన నిజజీవితానికి ఈ హోమ్లీ పాత్రలు చాలా దూరం అంటోందామె. అందాల రాక్షసి సినిమాతో తనకు హోమ్లీ అనే ట్యాగ్‌నే వేసేస్తున్నారని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె గ్లామరస్ పాత్రలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. తన వాస్తవ జీవితానికి, అందాల రాక్షసి కేరెక్టర్‌కు అసలు పొంతనే ఉండదని, రియల్ లైఫ్‌లో మోడర్న్‌గా ఉండేందుకే ఇష్టపడతానని లావణ్య చెప్పింది. మోడలింగ్ చేసే రోజుల్లోనూ గ్లామర్‌గానే ఉండేదాన్నని, గ్లామర్ పాత్రలు ఇవ్వాల్సిందిగా చాలా సార్లు డైరెక్టర్లకు కూడా చెప్పానని తెలిపింది. గ్లామర్ అంటే బట్టలిప్పేస్తానని కాదని,Read More


సైనాకి షాక్

sindhu pv

ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్స్ మ‌ధ్య స‌మ‌రం ఆస‌క్తి రేపింది. అయితే సీనియ‌ర్ సైనాని సింధు ఖంగుతినిపించ‌డం ఆస‌క్తిక‌రం తొలిసారి. సింధుకి సైనాపై ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. ఇండియన్ ఓపెన్ సిరీస్ 2017 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధూ నెగ్గింది. దీంతో ఇండియన్ ఓపెన్ సిరీస్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధూ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది.


మ‌రోసారి తానేంటో నిరూపించుకున్న విశాల్

17522573_412878989077755_8913876063153739152_n

త‌మిళ స్టార్ హీరో అయిన తెలుగు బిడ్డ ఎంత సెల‌బ్రిటీగా ఉన్న సామాన్యుల ప‌క్షానే ఆలోచిస్తాడు. ఇప్ప‌టికే పలుమార్లు ఈ విష‌యం రుజువ‌య్యింది. వ‌ర‌ద‌లొచ్చినా, విప‌త్తులు ముంచుకొచ్చినా సామాన్యుడిలా మారిపోయి అంద‌రికీ చేయూత‌నందించ‌డంలో ముందు నిలుస్తాడు. ఇక ఇప్పుడు ప్ర‌భుత్వ విధానాల మూలంగా న‌ష్ట‌పోతున్న అన్న‌దాత‌ల త‌రుపున త‌న స్వ‌రం వినిపించాడు. క‌ర్ష‌కుల కోసం రోడ్డెక్కాడు. ఏకంగా ఢిల్లీ న‌డివీధుల్లో ధ‌ర్నా చేప‌ట్టాడు.. మ‌రో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ స‌హా ప‌లువురు కూడా ఈ ధ‌ర్నాలో పాల్గొన్నారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాల‌ని నిన‌దించారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో రైతు ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి. దాని మీద స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మిళ‌నాడు రైతు సంఘం ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టింది. దానికి సంఘీభావంగా న‌డిగార్ సంఘం త‌రుపున విశాల్ స్వ‌యంగా పాల్గొన్నాడు. రైతు ఆత్మ‌హ‌త్య‌లుRead More


జ‌గ‌నో..పుల్లారావో ఒక‌రే స‌భ‌లో ఉండాలి

chandrababu-naidu-remembers-rela

ఏపీ అసెంబ్లీలో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో వేడెక్కింది. అగ్రిగోల్డ్ అంశంలో వ్య‌వ‌హారం అదుపు త‌ప్పే స్థాయికి చేరింది. అటు జ‌గ‌న్ ఇటు చంద్ర‌బాబు, పుల్లారావు, య‌న‌మ‌ల వంటి వారితో వాదోప‌వాద‌న‌లు సాగాయి. అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం లో సిట్టింగ్ జ‌డ్జితో జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. దానికి సీఎం చంద్ర‌బాబు అంగీక‌రించారు. అయితే మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు స‌వాల్ కి జ‌గ‌న్ అంగీక‌రించాల‌ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల‌ను ప్ర‌త్తిపాటి పుల్లారావు భార్య పేరుతో రిజిస్ట్రేష‌న్ జ‌రిగిన వ్య‌వ‌హారాన్ని స‌భ‌లో జ‌గ‌న్ ప్ర‌స్తావించ‌డంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. దాంతో స‌భా క‌మిటీ వేసి విచార‌ణ జ‌ర‌పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. దానికి జ‌గ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. స‌భా క‌మిటీలో ఐదుగురు అధికార ప‌క్షం నుంచి, ఒక్క‌రు ప్ర‌తిప‌క్షం నుంచి ఉన్న‌ప్పుడు ఏంRead More


నారాయ‌ణ లీకుల భాగోతం

narayana

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఒకరోజు ముందే తెలుగు-1 పేపరు లీకైందా..? ఈ లీకేజీ వెనుక కార్పొరేట్‌ విద్యాసంస్థల హస్తం ఉందా..? పిల్లలకు పేపరు ముందే చెప్పి.. పరీక్షలకు పంపారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అనంతపురం జిల్లా మడకశిరలో పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్‌లో కార్పొరేట్‌ విద్యాసంస్థ నారాయణ స్కూల్‌ సిబ్బంది హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఆ స్కూల్‌ ఎఇ ముత్యాలును పోలీసులు అదుపులో తీసుకున్నారు. మడకశిరలో ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం వాట్సాప్‌ ద్వారా బయటికి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరో కొత్తకోణం వెలుగుచూసింది. హిందూపురం పట్టణంలో ఓ కార్పొరేట్‌ పాఠశాల నుంచి తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రం-1 ఒక రోజు ముందుగానే బయటకు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడయినప్పటికీ.. రాష్ట్ర మంత్రి విద్యాసంస్థల నుంచి లీకు జరిగిన విషయాన్నిRead More


ఆడంబ‌ర పెళ్లికి ఆడొళ్లే కార‌ణం..!

bridegroom

పెళ్లి..ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సందర్భం. అందుకే పెళ్లి వేడుక మతాలకు, కులాలకు అతీతంగా వారివారి సంప్రదా యాల్లో ప్రత్యేకంగానే జరుపుకుంటారు. అయితే, ఆధునిక పెళ్లి వేడుకలు రోజురోజుకూ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుండ టంతో.. అసలంత ఖర్చు అవసరమా..? అన్న చర్చ విజ్ఞతతో జరగాల్సి ఉంది..ఇటీవల ‘టాటా క్యాపిటల్‌’ అనే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. అభిప్రాయ సేకరణ కోసం మహిళలు, పురుషుల నుంచి వివిధ వయసుల వారిని ఆ సంస్థ ఎంపిక చేసుకున్నది. మొత్తమ్మీద 2500 మంది(వివాహితులు, అవివాహితులు) నుంచి అభిప్రాయాలను తీసుకున్న ఆ సంస్థ పలు అంశాలను విశ్లేషించింది. ఆశ్చర్యకరంగా పెళ్లి తంతు ఘనంగా జరగాల్సిందే అన్న అభిప్రాయానికి ఓటేసిన వాళ్లలో పురుషుల కన్నా మహిళలే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. గ్రాండ్‌గా జరపాలని చెప్పిన పురుషులుRead More