telugudesam

 
 

టీడీపీ అక్కడ కన్నేసింది..

chandrababu-naidu-650_650x400_41433788794

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. మరోసారి పాగా వేయాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విడదీసి పథక రచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలను మూడు కేటగిరీలుగా విడదీశారు. అందులో కీలక నియోజకవర్గాలుగా 47 స్థానాలను గుర్తించారు. టీడీపీకి అవి కంచుకోటలుగా భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తర్వాత టీడీపీ థింక్ ట్యాంక్ వాటిని నిర్ణయించింది. ఆ తర్వాత వరుసలో గడిచిన ఎన్నికల్లో 5వేల తేడాతో ఓటమి పాలయిన నియోజకవర్గాల జాబితా తయారు చేశారు. వాటికితోడుగా గడిచిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన స్థానాలను కూడా చేర్చారు. మొత్తంగా వాటి సంఖ్య సుమారు 40వరకూ ఉన్నట్టు చెబుతున్నారు.Read More


టీడీపీ నేతలకు థామస్ పరీక్ష

Chandrababu-naidu-NAra-Lokesh

తెలుగుదేశం నేతలకు అనూహ్య పరీక్ష ఎదురయ్యింది. ఇప్పటికే ఫీల్డ్ లో నంద్యాల, కాకినాడ పరీక్షల్లో గట్టెక్కిన నేతలకు కూడా ఈ పరీక్ష చుక్కలు చూపించింది. ప్రశ్నలకు జవాబులు రాయాల్సి రావడంతో ఖంగుతినాల్సి వచ్చింది.అయినా మానసిక స్థితి విశ్లేషణ అంటూ నాయకుడు నిర్ణయంతో నేతలు పరీక్షకు సిద్ధం కావాల్సి వచ్చింది. తమ ముఖ్య నేతలకు టీడీపీ అధినాయకత్వం వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష నిర్వహించడం టీడీపీలో చర్చనీయాంశం అయ్యింది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఇటువంటి పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాతిగాంచిన థామస్‌ కంపెనీ రూపొందించిన ప్రశ్నపత్రాన్ని ప్రతి నేతకు ఒక ట్యాబ్‌లో ఇచ్చి వారితో వాటికి సమాధానాలు ఇప్పించారు. ఈ ప్రశ్నపత్రంలో 24 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు ఇచ్చే వ్యక్తి వ్యక్తిత్వం.. వివిధ సందర్భాల్లోRead More


తెలుగుదేశంలో భగ్గుమన్న విబేధాలు

tdp

తెలుగుదేశం పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలో చిచ్చు రేగడంతో ఇప్పుడు పెను కలకలం రేగుతోంది. ఏకంగా పలువురు నేతలు రాజీనామా చేసేవరకూ సాగింది. ఇది కడప జిల్లా టీడీపీ నేతలను కలవరపరుస్తోంది. ఒక్కసారిగా పెల్లుబికిన విబేధాలతో ఇన్నాళ్లుగా చాపకింద నీరులా ఉన్న వివాదాలు తెరమీదకు వచ్చాయి. కడప జిల్లాలో టీడీపీ చాలాకాలంగా వర్గవిబేధాలతో కొట్టిమిట్టాడుతోంది. ఇటీవల పార్టీలో చేరిన నేతలతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే జమ్మలమడుగు వివాదం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తగాదా చల్లారేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశంలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. దాంతో బ‌ద్వేలు, గోప‌వ‌రం టిడిపి జెడ్పీటీసీ స‌భ్యులు రాజీనామా చేశారు. టిడిపి అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు.Read More


కాకినాడలో కొత్త సంకేతం: టీడీపీలో గుబులు

cbn

ఎంతో ఆసక్తి రేపిన రెండు ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ శ్రేణుల విశ్వాసం రెట్టింపయ్యింది. ఆరునూరయినా మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన అభిమానులు, తెలుగుతమ్ముళ్లు బలంగా నమ్మడానికి నంద్యాల దోహదం పడింది. కాకినాడ మరింత ఊతమిచ్చింది. నంద్యాల అసెంబ్లీలో సీటులో 1999 తర్వాత తెలుగుదేశం జెండా ఎగురగా, కాకినాడలో 1987 తర్వాత తొలిసారిగా పసుపు జెండా విజయగర్వంతో కనిపిస్తోంది. వరుసగా రెండు విజయాలతో టీడీపీ శ్రేణుల్లో ధీమా పెరిగింది. కానీ అదే క్రమంలో ఓ కీలకాంశం పార్టీలో గుబులు రేకెత్తిస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అత్యంత స్పష్టంగా కనిపించిన అంశం ప్రజావ్యతిరేకత. మూడున్నరేళ్ల ప్రభుత్వ విధానాలతో పాజిటివ్ ఓట్ వచ్చిందని పైకి చెబుతున్నప్పటికీ లోలోన మాత్రం పాలక పార్టీలో గుబులు కనిపిస్తోంది. మేకపోతు గాంభీర్యమే తప్ప అసలు వాస్తవం గమనిస్తే పాలకపక్షం వైపల్యాలు ప్రజలను తీవ్రRead More


చంద్రబాబుకి సానుకూలమేనా?

chandrababu cbn

ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇక తిరుగులేదంటున్నారు. తమ తడాఖా చాటామంటున్నారు. ప్రజలంతా తమనే ఆశీర్వదించాలంటున్నారు. సెమీ ఫైనల్ సత్తా చాటామంటున్నారు. ఇక ఫైనల్స్ లో కూడా తమకు పోటీ ఉండదంటున్నారు. వైసీపీలో చాలామంది నేతలు తమవైపు వచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జగన్ మీద దాడి చేసి ప్రతిపక్షనేతను ప్రజల్లో పలుచన చేయడమే పనిగా పెట్టుకున్నారు. అంతేగాకుండా మిత్రపక్ష నేతలను కూడా వదలడం లేదు. తద్వారా 2019లో కూడా చంద్రబాబుకి పోటీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ జోరు ఆగదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాస్తవానికి నంద్యాల పరిస్థితి గమనించిన తర్వాత టీడీపీకి అంత సానుకూలత ఉందా అన్నది ఆలోచించాలి. నంద్యాల వైసీపీ సీటు అయినా ఇప్పుడు టీడీపీ చేజిక్కించుకోవడంRead More


మళ్లీ లగడపాటే..

Lagadapati-488585-300x239

లగడపాటి రాజగోపాల్ ఘనాపాటి అనిపించుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ అంచనాలు మాత్రం తప్పడం లేదు. ఎన్నికల విశ్లేషణలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించిన లగడపాటి తాజాగా నంద్యాల ఫలితాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఎన్నికల సర్వేలలో తాను సిద్ధహస్తుడినని చాటుకున్నారు. తాజాగా నంద్యాల ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు సర్వేలు చేశాయి. అప్ డేట్ ఏపీ కూడా సర్వే చేసినా ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. కానీ లగడపాటి సర్వే మాత్రం వాస్తవాలకు అతి చేరువలో ఉండడం విశేషం. అయితే ఈసారి సర్వేను ఆయన ప్రకటించలేదు. కేవలం మీడియా ఆయన దగ్గర సమచాారం కోసం ఆరా తీసినప్పుడు మాత్రమే వివరించారు. ప్రభుత్వానికి సానుకూలత ఉందని, సానుభూతి ఉందని, పోలింగ్ శాతం పెరగడం టీడీపీకి అనుకూలంగా మారుతోందని ఆయనRead More


మంత్రి గంటాకి అరెస్ట్ వారెంట్

ganta srinivas

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి షాక్ తగిలింది. ఆయన వ్యవహారశైలి మీద సీరియస్ అయిన కోర్ట్ ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్ట్ వాయిదాలకు హాజరుకాకపోవడంతో ఆయన కు ఈ వారెంట్ జారీ అయినట్టు సమాచారం. గతంలో ఆయన మీద ఎన్నికల సందర్భంగా కేసు నమోదయ్యింది. 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయన కోర్ట్ ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఆయనకు వారెంట్ విడుదలయ్యింది అనకాపల్లి కోర్ట్ తాజా ఆదేశాల ప్రకారం మంత్రి తక్షణమే రీకాల్ పెట్టించుకోవాల్సి ఉంటుంది.


టీడీపీని చిక్కుల్లో నెట్టిన సీఎం వ్యాఖ్యలు

chandrababu

ఆశ్చర్యంగా కనిపించినా నంద్యాల వాసుల్లో ఇదే చర్చ సాగుతోంది. ప్రచారంలో పాల్గొన్న చివరి సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్టు కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మీద చంద్రబాబు చేసిన కామెంట్స్ చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. దాంతో టీడీపీ స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. నంద్యాలలో మహిళలకు అండగా నిలుస్తున్న శిల్పా సహకార్ సొసైటీ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. శిల్పా కుటుంబ సభ్యులు రంగంలోకి వచ్చారు. సీసీ ఫుటేజ్ మొత్తం ఇస్తామని, అక్రమాలుంటే చర్యలు తీసుకోవాలని ఛాలెంజ్ చేశారు. దాంతో టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధం కాలేకపోతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. శిల్పా సహకార్ సొసైటీ ద్వారా నంద్యాల ప్రజలకు వడ్డీ లేని రుణాలందిస్తున్నారు. మహిళల స్వయం ఉపాధి కోసం వడ్డీRead More


వియ్యంకుల మంత్రుల వైభోగం చూశారా

20882901_1965122553771674_6205280837650396207_n

ఏపీలో పాలక పెద్దల ఆడంబరాలు ఓ స్థాయిలో కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సీఎం మనవడు, మంత్రి లోకేష్ దేవాన్ష్ అక్షరాభ్యాసం అత్యంత ఆడంబరంగా సాగింది. ఏస్థాయిలో అంటే చివరకు వెండి పలక మీద ఆక్షరాలు దిద్దించేటంత లెవెల్ లో ఆ కార్యక్రమం నడిచింది. అప్పట్లో అది అందరినీ ఆశ్చర్యపరిచింది. నేల మీద ఆక్షరాలు దిద్దిన రోజుల నుంచి చెక్క పలకలు, ప్లాస్టిక్ పలకల దశ దాటి ఇఫ్పుడు అమాత్యులు, అధికార పెద్దలు వెండి పలకల వరకూ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా వియ్యంకులైన మంత్రుల వ్యవహారం ముందుకొచ్చింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణల ముద్దుల మనవడు బారసాల జరిగింది. అది కూడా వారి స్థాయికి తగ్గట్టుగానే నిర్వహించారు. అసామాన్యంగా వెండి ఉయ్యాల, ముత్యాల ఉయ్యాలతో ఈ కార్యక్రమం సాగడంRead More


నంద్యాలపై ఆధారపడి జనసేన భవిష్యత్

chandrababu pawan

మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలైన స్నేహితుడని అందరికీ తెలుసు. కానీ ఆపదలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చి తాను తటస్థం అని ప్రకటించిన పవన్ కల్యాణ్ తీరు టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. నమ్మకమైన మిత్రుడిగా తాము బావిస్తే తమ ఆశలను నీరుగార్చేశారని ఆపార్టీ నేతలు తల్లడిల్లుతున్నారు. చివరి క్షణం వరకూ ఊరించి ఉసూరుమనిపించిన జనసేనాని వ్యవహారం వారికి మింగుడుపడడం లేదు. తాజాగా తెలుగుదేశం అనుకూల పత్రికల్లో పవన్ కి వ్యతిరేక వస్తున్న రాతలు, పలు టీవీ చానెళ్లలో జనసేన విధానం మీద వస్తున్న విమర్శల కూతలు గమనిస్తే పవన్ తీరుతో టీడీపీ చాలా అప్ సెట్ అయినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి మూలస్తంభంగా ఉన్న పవన్ కల్యాణ్ , ఆతర్వాత తానేమీ టీడీపీకి బానిసను కాదని ప్రకటించారు. రాజధానిRead More