Main Menu

telugu updates

 
 

లోకేష్ కి షాకిచ్చిన నెటిజ‌న్స్

ఏపీ సీఎం త‌న‌యుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ వ్య‌వ‌హారం మారుతున్న‌ట్టుగా లేదు. ఆయ‌న ప‌దే ప‌దే అభాసుపాల‌వుతున్నా తీరు మార్చుకోవ‌డం లేదు. అనేక‌సార్లు సోష‌ల్ మీడియాలో ఆయ‌న మీద సెటైర్ల హోరు క‌నిపిస్తున్నా ప‌దే ప‌దే అదే త‌ర‌హాలో సాగుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా మాట్లాడేట‌ప్పుడు త‌డబ‌డి జ‌నాల‌కు దొరికిపోయిన నారా లోకేష్ ఈసారి ట్వీట్ తో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఇది నెటిజ‌న్స్ కి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌రాలు వెల్లువ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నారా లోకేష్ కూడా నంద్యాల సమీపంలోని అబండం తండా ఫోటో అంటూ ఓ ఇమేజ్ ని లోకేష్ పోస్ట్ చేశారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా మురికినీరు, నిండిపోయిన డ్రైనేజీల‌తో ఉన్న ఆ వీధి అనూహ్యంగా మారిపోయిందంటూ మ‌రో ఇమేజ్ పోస్ట్Read More


పాల‌క పార్టీకి షాకిచ్చిన ప్ర‌తిప‌క్షం

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ముగింపు ద‌శ‌కు వ‌చ్చాయి. స‌భ ఆరంభంలోనే ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టిన ప్ర‌తిప‌క్షం మ‌ధ్య‌లో త‌డ‌బ‌డింది. కొన్ని కీల‌కాంశాల‌లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో స‌త‌మ‌త‌మ‌య్యింది. అయితే తాజాగా పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో ప్ర‌ద‌ర్శించిన దూకుడుతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఊహించ‌ని దాడితో ఉక్కిరిబిక్కిరి చేశారు. అనూహ్య నిర్ణ‌యంతో అధికార పార్టీని ఇబ్బంది పెట్టేశారు. నారాయ‌ణ‌, గంటా శ్రీనివాస‌రావులు వియ్యంకులు కావ‌డం, నారాయ‌ణ సంస్థ‌ల్లో లీకేజీలు కావ‌డంతో ఆ అంశాన్ని సంపూర్ణంగా వినియోగించ‌కుంది. రాష్ట్ర మంతా పెద్ద చ‌ర్చ‌ను ముంద‌కు తీసుకొచ్చింది. నారాయ‌ణ సంస్థ‌ల బండారాన్ని, ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌ను, విద్యార్థుల భ‌విత‌వ్యాన్ని పెద్ద‌స్థాయిలో ఫోకస్ చేయ‌గ‌లిగింది. దాంతో పాల‌క‌ప‌క్షం షాక్ కి గుర‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. 25వ తేదీన ఈ పేప‌ర్ లీకేజీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. నెల్లూరు నారాయ‌ణ సంస్థ‌ల్లో జ‌రిగిన ప‌రిణామాల‌తో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌డానికి కూడాRead More


ప‌దే ప‌దే అదే త‌ప్పులతో టీడీపీ

అధికార పార్టీ అన‌గానే అన్నీ చేసేశామ‌ని చెప్ప‌డం..ప్ర‌తిప‌క్షం అన‌గానే అన్నింటిలో ఒక్క‌టి కూడా స‌రిగా లేద‌ని చెప్ప‌డం చాలా స‌హ‌జం. అందులో ఏది నిజం అన్న‌ది ప్ర‌జ‌లు తేల్చుకుంటారు. ఎవ‌రి వాద‌న స‌త్య‌మ‌న్న‌ది బేరీజు వేసుకుంటారు. ఎవ‌రు ప్ర‌జాభిప్రాయానికి దగ్గ‌ర‌గా ఉంటే వారికి నైతిక మ‌ద్ధ‌తిస్తారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న వాణీ వినిపిస్తారు. ఇది చాలా స‌హ‌జ‌మైన ప్ర‌క్రియ‌. కానీ తెలుగుదేశం పాల‌న‌లో ఇలా కుద‌ర‌ద‌ని చెబుతున్నారు. అందుకే ఇప్ప‌టికే వివిధ ప‌క్షాల ఆందోళ‌న‌ల మీద పోలీసుల‌ను ప్ర‌యోగిస్తున్నారు. లాఠీల‌తో అణ‌చివేస్తున్నారు. కృష్ణా జిల్లా ఇల‌ప‌ర్రులో ద‌ళితుల భూములు కాజేసిన పెత్తందారుల‌కు వంత‌పాడుతూ క‌మ్యూనిస్టు కార్య‌క‌ర్త‌ల మీద లాఠీఛార్జ్ కి పాల్ప‌డ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆ ఘ‌ట‌న జ‌రిగి 24 గంట‌లు గ‌డ‌వ‌కముందే అలాంటి వ్య‌వ‌హార‌మే మ‌రోటి అదే జిల్లాలో త‌లెత్తింది. అయితే ఈసారి నేరుగా తెలుగుదేశంRead More


మీడియాలోకి మ‌ధుయాష్కీ..!

ఎన్ఆర్ఐ కోటాలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని వ‌రుస‌గా రెండుసార్లు నిజామాబాద్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన మ‌ధు యాష్కీ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ చిర‌ప‌రిచితుడే. కాంగ్రెస్ హ‌యంలో చ‌క్రం తిప్పిన బీసీ నేత‌ల్లో మ‌ధు యాష్కీ ఒక‌రు. అయితే మొన్న‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాల‌తో యాష్కీ ఓట‌మి పాల‌య్యారు. రాజ‌కీయాలు అలా ఉండ‌గానే ఇప్ప‌డు ఆయ‌న మీడియాలోకి ప్ర‌వేశిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యాల‌లో భాగంగా తెలుగులో ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసే బాధ్య‌త‌ను ఆయ‌న తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. రాహుల్ కోట‌రీలో మ‌ధు యాష్కీ ఒక‌రు. అందుకే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియా మీద దృష్టిపెట్టిన కాంగ్రెస్ తెలుగు భాష‌కు సంబంధించి కూడా ఓ చానెల్ ప్రారంబించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ప్ర‌స్తుతం అది యూట్యూబ్ చానెల్ గా ఉండ‌బోతోంది. దానికి సంబంధించిన బాధ‌త్య‌నుRead More


జ‌గ‌న్ తీరుతో వాళ్ల‌కు అన్యాయం..!

ఏపీలో వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకుంటోంది. ఒక్కొక్క‌రుగా వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నారు. అందులో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ స‌హా వివిధ సెక్ష‌న్స్ ఉన్నాయి. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న వారు, యువ‌త‌రం కూడా జ‌గ‌న్ తో చేతులు క‌ల‌ప‌డానికి ఆతృత‌ప‌డుతున్నాయి. దాంతో వైఎస్సార్సీపీ శిబిరంలో చాలాకాలం త‌ర్వాత ఎక్క‌డా లేనంత ఉత్సాహం క‌నిపిస్తోంది. ఏపీలో పార్టీకి మంచిరోజులొచ్చాయ‌న్న అభిప్రాయం ఆపార్టీ అభిమానుల్లో బ‌ల‌ప‌డుతోంది. బ‌ల‌మైన నేత‌లంతా త‌మ అధినేతను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో పడ్డార‌న్న వార్త‌లు వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆనందంలో ముంచుతున్నాయి. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది ..కానీ కొత్త‌గా వ‌స్తున్న నేత‌ల‌తో త‌మ‌కు ఎక్క‌డ ఎస‌రు పెడ‌తారేమోన‌న్న బెంగ చాలామందికి ప‌ట్టుకుంది. ఏపీలో మంత్రివ‌ర్గంలో ఉన్న‌నేత‌లు కూడా జ‌గ‌న్ తో చేతులు క‌లిపే ప్ర‌య‌త్నంలో ఉండ‌డంతో ముందొచ్చిన చెవుల క‌న్నా వెన‌కొచ్చిన కొమ్ములే వాడి అన్న‌ట్టుగా త‌మ నాయ‌కుడుRead More


బాబు ఆయుధ‌మే చేజారిపోయిందా..!?

అనుమానం కాదు. నిజ‌మే అనిపిస్తోంది. చంద్ర‌బాబు శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను భూత‌ద్దంలో చూపించ‌గ‌ల మీడియానే ఇప్పుడు చంద్ర‌బాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మీడియా సాయంతో గోదావ‌రినే కాదు కృష్ణా న‌దినైనా ఈద‌వ‌చ్చ‌ని ఆయ‌న ఆశిస్తుంటారు. దానికి త‌గ్గ‌ట్టుగా మీడియా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో సాగుతుంటుంది. మాట జ‌వ‌దాటితే నిషేధానికి కూడా గుర‌వుతుంది. ఏపీలో ఎన్టీవీ ని ఒక‌మారు, సాక్షి టీవీనీ ప‌దే ప‌దే నిలిపివేస్తున్న దాఖ‌లాలు అంద‌రికీ తెలిసిందే. న‌యానా, భ‌యానో త‌న‌దారికి తెచ్చుకోవ‌డంలో చంద్ర‌బాబు అండ్ కో చేసిన ప్ర‌య‌త్నాల‌తో దాదాపుగా మీడియా ఆయ‌న‌కు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌త్రిక‌ల్లో ఆయితే సాక్షి, ప్ర‌జాశ‌క్తి , ఆంధ్ర‌భూమి మిన‌హా మిగిలిన‌వి బాబు కి సానుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అయినా చంద్ర‌బాబుని మీడియా క‌ల‌వ‌ర‌పెడుతుండ‌డం విశేషంగానే భావించాలి. బాబు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని అర్థం చేసుకోవాలి. ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు చంద్ర‌బాబునిRead More


సానుకూల‌త‌ను జ‌గ‌న్ సొమ్ము చేసుకుంటారా?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌స్తోంది. దానికి అనేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చు గానీ తాజాగా సాగిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం కీల‌కంగా క‌నిపిస్తోంది. జ‌న‌వ‌రి కి ముందు, ఆ త‌ర్వాత అన్నట్టుగా మారుతున్న ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే కొత్త సంవ‌త్స‌రం రాక‌తోనే విప‌క్షానికి ఊపు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షానికి పెద్ద స‌వాల్ గా మారుతోంది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం పుణ్యాన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో బాగా ప‌లుచ‌న‌కావ‌డం, అదే స‌మ‌యంలో విప‌క్షానికి సానుకూల ప‌రిణామాలు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌డిచిన రెండేళ్ల‌లో జ‌గ‌న్ ఎన్ని మాట‌లు చెప్పినా పెద్ద‌గా ప‌ట్టించుకోని సెక్ష‌న్ కూడా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. జ‌గ‌న్ మాట‌ల‌కు, చేత‌ల‌కు స్పందిస్తోంది. ఈ విష‌యాన్ని విప‌క్ష నేత కూడా గ‌మ‌నించిన‌ట్టున్నారు. ఆయ‌న మాటల్లో పెరిగిన వాడి, వేడి గ‌మ‌నిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఉర‌వ‌కొండRead More


వాళ్ల‌తో జ‌గ‌న్ కి మేలెంత? కీడెంత‌?

ఏపీ రాజ‌కీయాల‌లో మార్పు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప‌లువురు నేత‌లు త‌మ దృష్టిని వైఎస్సార్సీపీ మీద కేంద్రీక‌రిస్తున్నారు. లోట‌స్ పాండ్ వైపు చూస్తున్నారు. ఓవైపు జ‌గ‌న్ మీద మాట‌ల యుద్ధం తీవ్ర చేస్తున్న అధికార పార్టీ వ్య‌వ‌హారం ఆస‌క్తి రేపుతుంటే మ‌రోవైపు ఇత‌ర పార్టీల నుంచి జ‌గ‌న్ వైపు చూస్తున్న నేత‌ల సంఖ్య పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ మార్పులు, చేర్పులు మొద‌లవుతున్నాయి. అందులో యువ‌నేత‌లు మొద‌లుకుని సీనియ‌ర్లు కూడా చాలామందే ఉంటున్నారు. త‌ల‌పండిన నేత‌లు కూడా జ‌గ‌న్ శిబిరం వైపు క్యూ క‌డుతున్నారు. అంద‌రికీ కండువాల క‌ప్పే ప‌నిలో ఇప్పుడు జ‌గ‌న్ బిజీగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌ల్నాడులో కాసు మ‌హేష్ రెడ్డి ఫ్యాన్ పంచ‌న చేరారు. భారీ బ‌హిరంగ‌స‌భ‌తో పాల‌క‌ప‌క్షాన్ని ప‌రుగులు పెట్టించారు. ఆ త‌ర్వాత మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర్ రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీధ‌ర్ రాక‌తోRead More


ఝ‌ల‌క్ ఇచ్చిన చోట జ‌గ‌న్ గుణ‌పాఠాలు..

రాజ‌కీయంగా తొలిసారి సాధార‌ణ ఎన్నిక‌ల్లో పార్టీని బ‌రిలో దింపి వైఎస్ జ‌గ‌న్ ప‌లు పాఠాలు నేర్చుకున్నారు. విప‌క్షంతో స‌రిపెట్టుకున్న‌ప్ప‌టికీ రాజ‌కీయ అనుభ‌వం సాధించారు. అయితే ఆయ‌న‌కు మొన్న‌టి ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల్లో త‌గిలిన ఝ‌ల‌క్ నుంచి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ముఖ్యంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో క‌లిపి మొత్తం 34 స్థానాలుంటే అందులో కేవ‌లం 5 సీట్లు మాత్ర‌మే వైఎస్సార్సీపీకి ద‌క్కాయి. ఇంకా చెప్పాలంటే ఏపీలో టీడీపీకి మెజార్టీ వ‌చ్చిన 30 సీట్లు గోదావ‌రి జిల్లాల‌ల‌వే కావ‌డం విశేషం. అందులో ప‌శ్చిమ‌గోదావ‌ర‌యితే సున్నా. ఒక్క చోట్ల కూడా ఆ పార్టీ ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ అదే తంతు. జిల్లాలో 46 ఎంపీపీలుంటే కేవ‌లం 2 చోట్ల మాత్ర‌మే వైఎస్సార్సీపీ గెల‌వ‌గ‌లిగింది. మునిసిపాలిటీల‌లో అయితే త‌ణుకు లాంటి చోట్ల ఒక్క కౌన్సిల్Read More


అల్లు అర్జున్ కూతురి విషెస్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఆయన తన కూతురు తరపున ఆ ట్వీట్‌ చేయడం గమనార్హం. ఇటీవల జన్మించిన తన మద్దుల కూతురు అర్హ తరపున రిపబ్లిక్‌ డే విషెస్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌తో పాటు బన్నీ పోస్ట్‌ చేసిన అర్హ క్యూట్‌ ఫోటో అభిమానులను అలరిస్తోంది.