Main Menu

telugu politics

 
 

ఒక్క సీటు కోసం వార్ కి సిద్ధ‌మ‌వుతున్న బాబు, జ‌గ‌న్

ఏపీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాక్షిగా ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయాల‌కు తెర‌లేవ‌బోతోంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేదిక‌గా మ‌రోసారి వేడి రాజుకుంటోంది. ఏడో స్థానం సాక్షిగా ఎవ‌రికి వారు ప‌ట్టుద‌ల‌కు పోతుండ‌డంతో ప‌రిణామాలు ఎటుమ‌ళ్లుతాయోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఈ విష‌యంలో జ‌గ‌న్, చంద్ర‌బాబు కూడా ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దాంతో ఏపీ అసెంబ్లీ సాక్షిగా కొత్త కాక మొద‌ల‌యిన‌ట్టే భావించాలి. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాల‌కు ద్వైవార్షిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈసారి ఏకంగా 7 సీట్లు ఖాళీ కావ‌డంతో ఎవ‌రికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. వాస్త‌వ బ‌లం ప్రకారం 5 సీట్లు టీడీపీకి, 2 సీట్లు వైఎస్సార్సీపీకి ఖాయం. కానీ 21 మంది ఎమ్మెల్యేల‌ను చేజార్చుకున్న జ‌గ‌న్ ఒక‌టితో స‌రిపెట్టుకుంటారా లేక రెండో స్థానం కోసం ప్ర‌య‌త్నిస్తారా అన్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. వాస్త‌వానికిRead More


సానుకూల‌త‌ను జ‌గ‌న్ సొమ్ము చేసుకుంటారా?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌స్తోంది. దానికి అనేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చు గానీ తాజాగా సాగిన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం కీల‌కంగా క‌నిపిస్తోంది. జ‌న‌వ‌రి కి ముందు, ఆ త‌ర్వాత అన్నట్టుగా మారుతున్న ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే కొత్త సంవ‌త్స‌రం రాక‌తోనే విప‌క్షానికి ఊపు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షానికి పెద్ద స‌వాల్ గా మారుతోంది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం పుణ్యాన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో బాగా ప‌లుచ‌న‌కావ‌డం, అదే స‌మ‌యంలో విప‌క్షానికి సానుకూల ప‌రిణామాలు క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌డిచిన రెండేళ్ల‌లో జ‌గ‌న్ ఎన్ని మాట‌లు చెప్పినా పెద్ద‌గా ప‌ట్టించుకోని సెక్ష‌న్ కూడా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తోంది. జ‌గ‌న్ మాట‌ల‌కు, చేత‌ల‌కు స్పందిస్తోంది. ఈ విష‌యాన్ని విప‌క్ష నేత కూడా గ‌మ‌నించిన‌ట్టున్నారు. ఆయ‌న మాటల్లో పెరిగిన వాడి, వేడి గ‌మ‌నిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఉర‌వ‌కొండRead More


ఆమె కోరిక‌ను జ‌గ‌న్ మ‌న్నిస్తారా..!?

ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత ఓ వెలుగు వెలిగిన నాయ‌కురాలామే. తెలుగుదేశం పార్టీ అధినేత త‌న‌య‌గా ఏకంగా రాహుల్ గాంధీ శిబిరంలోనే ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. హ‌స్తిన‌లో హ‌ల్ చ‌ల్ చేశారు. కీల‌క‌మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. కానీ తీరా కాంగ్రెస్ పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని గ్ర‌హించిన త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు ముందు భాజ‌పం ప్రారంభించారు. అప్ప‌టికే రెండు మార్లు కాంగ్రెస్ నుంచి బాపట్ల‌, విశాఖ ప‌ట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వ‌రి మూడోసారి మూడో స్థానం నుంచి పోటీ చేశారు. కానీ క‌మ‌లం క‌లిసిరాక‌పోవ‌డంతో రాజంపేట‌లో వైఎస్సార్సీపీ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. పోనీ త‌మ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింద‌న్న సంతృప్తితో స‌రిపెట్టుకందామంటే రాష్ట్రంలో కుటుంబ శ‌త్రువు చంద్ర‌బాబు సీటులో ఉండ‌డంతో ఏవిధంగానూ పురందేశ్వ‌రి సంతోషంగా క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి బాబు కార‌ణ‌మ‌న్న అభిప్రాయంలోRead More


మోడీకి మూడిందా..!?

కేంద్రంలో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత నోట్ల మార్పిడితో మోడీ తీసుకున్న నిర్ణ‌యం అంద‌రినీ విస్మ‌య ప‌రుస్తోంది. వాస్త‌వానికి ఇది మోడీ చెబుతున్న‌ట్టు ఇది నోట్ల ర‌ద్దు కాదు. వెనిజులా గానీ ఆస్ట్రేలియాలో గానీ జ‌రిగింది నోట్ల ర‌ద్దు. కానీ మ‌న దేశంలో మాత్రం నోట్ల మార్పిడి జ‌రుగుతోందంతే. ఇప్ప‌టికే 500 నోటుకి ప్ర‌త్యామ్నాయం విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో కొత్త వెయ్యి నోటుకి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. వాటికితోడుగా 2వేల నోటును కూడా ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా నోట్ల మార్పిడి మాత్ర‌మే చేశారు. దాంతో ఈ నిర్ణ‌యం వెలువ‌రించిన న‌వంబ‌ర్ 8 త‌ర్వాత దేశంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయు. మోడీ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌గానే జైజైలు ప‌లికినోళ్లే వేగంగా స్వ‌రం స‌వ‌రించారు. స‌మ‌స్య‌లు చవి చూడ‌గానే స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టారు. నిర్ణ‌యం అమ‌లులో చేతులెత్తేసిన తీరుతో తీవ్ర ఆగ్ర‌హంRead More


అనంత‌లో ప‌వ‌న్ కి కాపు కాస్తుందా..!?

ప‌వ‌న్ క‌ల్యాణ్ మళ్లీ పొలిటిక‌ల్ తెర‌మీద‌కు వ‌స్తున్నారు. ఈసారి రెండు నెల‌ల విరామంతో ఆయ‌న మూడో బ‌హిరంగ‌స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. తిరుప‌తి స‌భ త‌ర్వాత కాకినాడ‌లో జీత్ నే త‌క్ ల‌డేంగే అంటూ నిన‌దించిన జ‌న‌సేనాని మ‌రోసారి రాయ‌ల‌సీమ‌లో స‌మ‌ర నినాదం వినిపించ‌బోతున్నారు. జ‌న‌సేన సొంతంగా నిర్వ‌హిస్తున్న తొలి బ‌హిరంగ‌స‌భ ఇదే కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కి ప్ర‌జ‌ల్లో ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిదాయ‌కం. వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదా సెగ ఇప్పుడు రాజుకుంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ ద్వారా వేడి రాజేశారు. దాంతో ప‌వ‌న్ స‌భ మ‌రింత ఆస‌క్తిగా మారింది. అందులోనూ రాయ‌ల‌సీమ‌లో కీల‌క‌మైన అనంత‌పురంలో అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర‌..ఇప్పుడు ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ బ‌లంగా ఉంది. అందుకే ఈ ప్రాంతంలో నిర్వ‌హించ‌బోతున్న స‌భ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మార‌బోతోంది. అయితే ప‌వ‌న్ ఏంRead More


జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రం సిద్ధ‌మ‌వుతోంది..!

వైఎస్ జ‌గ‌న్. ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద దూకుడుగా వెళుతున్న ఈ నాయ‌కుడు స్పీడ్ పెంచే ఆలోచ‌న చేస్తున్నారు. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మాస్త్రం సంధించాల‌ని చూస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే రెండు మార్లు స‌క్సెస్ అయిన మంత్రాన్ని మ‌రోసారి జ‌గ‌న్ కూడా ప‌ఠించ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు. అప్ప‌ట్లో వైఎస్ హ‌వాకు ఢోకా లేకుండా చేసిన పాద‌యాత్ర ఆత‌ర్వాత చంద్ర‌బాబు ఆశ‌లు చిగురించేలా చేసింది. దాంతో ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ కూడా మ‌రోమారు పాద‌యాత్ర‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా ఆయ‌న పాద‌యాత్ర చేయ‌డానికి వైఎస్సార్సీపీ నేత‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. పాద‌యాత్ర ఇప్పుడు అధికారం అందించే ఓ ప్ర‌ధాన అస్త్రంగా మారిపోయింది. అయితే సుదీర్ఘ పాద‌యాత్ర‌ల విష‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఓ బ్రాండ్ గా క‌నిపిస్తారు. ఆత‌ర్వాత చంద్ర‌బాబు వైఎస్Read More


చిరు ప్యాక‌ప్ ..!

మెగాస్టార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. చాలాకాలంగా అనుకుంటున్న‌ట్టే ఆయ‌న రాజ‌కీయ జీవితం త్వ‌ర‌లో ముగియ‌బోతోంది. ఎంపీగా ఆయ‌న ప‌ద‌వీకాలం మ‌రో ఏడాదిన్న‌ర పాటు ఉంటుంది. 2018లో ఆయ‌న ఎంపీగా రిటైర్ కాబోతున్నారు. దాంతో ఆ త‌ర్వాత ఇక పూర్తిగా పొలిటిక‌ల్ స్క్రీన్ నుంచి దూరం కావాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. దాంతో మ‌రోసారి వెండితెర మీదే పూర్తిగా దృష్టి సారించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న 150 వ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. రిలీజ్ ముహూర్తం కూడా దాదాపు ఖ‌రార‌య్యింది. వ‌చ్చే సంక్రాంతికి చిరు మ‌రోసారి సంద‌డి చేయ‌బోతున్నాడు. ఖైదీనెంబ‌ర్ 150 అంటూ సిల్వ‌ర్ స్క్రీన్ మీద హ‌ల్ చ‌ల్ చేయ‌బోతున్నాడు. అయితే అదే స‌మ‌యంలో అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాలు రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం శ్రేయ‌స్క‌రం కాద‌ని ఆయ‌న నిశ్చ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.Read More


జ‌గ‌న్ సొమ్ము చేసుకుంటారా..!?

క‌లిసొచ్చే కాలం వ‌స్తే న‌డిసొచ్చే కొడుకు పుడ‌తాడ‌న్న‌ది నానుడి. రాజ‌కీయాల్లో అది చ‌క్క‌గా వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా వేగంగా ప‌రిణామాలు మారిపోతున్న వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో ఇది మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అందులోనూ ద్విముఖ పోరు మాత్ర‌మే క‌నిపించే ఆంధ్రప్ర‌దేశ్ వ్య‌వ‌హారాల‌కు అది స‌రిగ్గా స‌రిపోతుంది. రాజ‌కీయంగా ఒక్క నిర్ణ‌య‌మే మొత్తంగా ప‌రిస్థితుల‌ను త‌ల‌కిందులు చేస్తుంది..లేక అన్నీ త‌న చేతుల్లోకి వ‌చ్చేలా మార్చేస్తోంది. మ‌రికొన్ని సార్లు మ‌న ప్ర‌య‌త్నాల‌కు తోడుగా ప్ర‌త్య‌ర్థుల త‌ప్పిదాలే మ‌న‌కు పెద్ద వ‌రంలా మారిపోతాయి. ఊహించ‌ని స్థితికి చేర్చుతాయి. ఇదే ప‌దే ప‌దే రుజువ‌వుతున్న విష‌య‌మే. మ‌రోసారి అదే త‌ప్ప‌దా అన్న‌ట్టుగా ఉంది వ‌ర్త‌మానం. ముఖ్యంగా అధికార‌ప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి కంటే విప‌క్షంలో ఉన్న‌ప్పుడే నాయ‌కుల‌కు గుర్తింపు ల‌భిస్తుంది. వారి గొంతును ప్ర‌జ‌లు స్వీక‌రించే అవ‌కాశం వ‌స్తుంది. దానిని సానుకూలంగా మల‌చుకోగ‌లిగితే స్థానాల మార్పిడి ఖాయం అనిRead More


ఆంధ్ర‌ప్ర‌జ‌ల మీద రెండుక‌ళ్ల సిద్ధాంతం

ఏపీలో బంద్ స‌క్సెస్ అయ్యింది. విప‌క్షాల‌న్నీ విడివిడిగా బంద్ పాటించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు మాత్రం స్వ‌శ్ఛందంగా స్పందించారు. ప్ర‌భుత్వానికి ఐక్యంగా నిర‌స‌న తెలిపారు. త‌ద్వారా ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌భుత్వ పెద్దల తీరును నిర‌సించారు. ఏపీకి అన్యాయం జ‌రిగితే స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ బంద్ విజ‌య‌వంతం వెనుక అంద‌రి హ‌స్తం ఉన్న‌ప్ప‌టికీ ఏపీ వాసుల్లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తికి, ఆగ్ర‌హానికి ఇది తార్కాణంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఆంధ్రప్ర‌దేశ్ లో అధికార‌ప‌క్షంగా ఉంటూ కేంధ్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న తెలుగుదేశం మాత్రం రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ఆప‌డం లేదు. గ‌తంలో రెండు క‌ళ్ల సిద్ధాంతంతో ఏపీ తెలంగాణా అని చెప్పి ఇప్పుడు ఒక క‌న్ను లొట్ట‌పోయిన త‌ర్వాత కూడా బాబు గోడ మీద పిల్లివాటం ఆప‌డం లేదు. తాజాగా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో ఆయ‌న పాత్ర‌ను గ‌మ‌నిస్తే ఇదేRead More


వైఎస్సార్సీపీ చింతిస్తోంది..!

అవును..ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఇప్పుడు త‌ల ప‌ట్టుకుంటోంది. ఓ స‌దావ‌కాశం చేజార్చుకున్నామ‌ని చింతిస్తోంది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ ఇప్పుడు హెడ్ లైన్స్ లో క‌నిపిస్తుంటే..బ‌లం, బ‌లగం ఉన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా తాము క‌నిపించ‌కుండా పోతున్నామ‌న్న బాధ‌తో క‌నిపిస్తోంది. త‌గిన వ్యూహం లేక‌పోతే రాజ‌కీయాల‌లో ఎలా అవ‌కాశాలు నీరుగార్చుతారో వైఎస్సార్సీపీ వ్య‌వ‌హారం అద్దంప‌డుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఎత్తుగ‌డ‌లు మార్చుకోక‌పోతే ప్ర‌జ‌ల‌కు దూరంగా ఎలా ఉండిపోవాల్సి వ‌స్తుందో ఈ అనుభ‌వం చాటుతోంది. అందుకే ఇప్ప‌టికైనా జ‌గ‌న్ థింక్ ట్యాంక్ అటు వైపు దృష్టిసారిస్తే మంచిద‌నే వాద‌న వినిపిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం గ‌డిచిన నాలుగు రోజులుగా మరోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. అయినా ఈ విష‌యంలో ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద‌గా పాత్ర లేకుండా పోయింది. ప్ర‌జ‌ల ముందు తాము బ‌ద్నాం కాకుండా చూసుకోవ‌డానికి చంద్ర‌బాబు వ్యూహం మార్చిRead More