Main Menu

telugu news

 
 

తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్

బార్క్ రేటింగ్స్ లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌డం లేదు. తెలుగు న్యూస్ చానెళ్ల‌కు డ్ర‌గ్స్ విచార‌ణ కూడా పెద్ద‌గా తోడ్ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. నిండా 400 రేటింగ్ పాయింట్లు కూడా సంపాదించ‌లేక తెలుగు న్యూస్ చానెళ్లు ఉసూరుమ‌నిపిస్తున్నాయి. ఎంట‌ర్టైన్మెంట్ విభాగంలో ఒక్క బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సంపాదించిన రేటింగ్ లో ప‌దో వంతు కూడా మొత్తం న్యూస్ చానెళ్ల‌కు ద‌క్కిన‌ట్టు క‌నిపించ‌డం లేదంటే వాస్త‌వ స్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి తాజా రేటింగ్స్ ప‌రిశీలిస్తే టీవీ9 టాప్ లో కొన‌సాగుతోంది. ఎన్టీవీ రెండులో ఉండ‌గా, ఏబీఎన్ మూడోస్థానం నిల‌బెట్టుకుంది. టీవీ5, 10టీవీ కూడా త‌మ త‌మ స్థానాల్లో య‌ధావిధిగా ఉన్నాయి. వాటికి స‌మీపంలోనే వీ6, సాక్షి టీవీ కూడా క‌నిపిస్తున్నాయి. తాజా రేటింగ్స్ వివ‌రాలు Total AP+TS, TG:15+, Wk30/Wk29 All NewsRead More


సోష‌ల్ మీడియాపై కొత్త అస్త్రం..!

సోష‌ల్ మీడియా ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. జ‌యంతిని వ‌ర్థంతి అన్న ఒక్క మాట‌కే నారా లోకేష్ ప‌రువు తీసేసింది. ఇలాంటి చిన్న చిన్న విష‌యాల నుంచి కోట్ల ఖ‌ర్చుతో నిర్మించుకున్న చంద్ర‌బాబు కొత్త ఇంటి విష‌యం వ‌ర‌కూ విడ‌వ‌కుండా వెంటాడుతోంది. సొంత ఇల్లు క‌ట్టుకున్నారే గానీ చంద్ర‌బాబు, చిన‌బాబుకి ప్రారంభోత్స‌వ ఆనందం కూడా ఆవిరిచేసేసింది. దాంతో తెలుగుదేశం పెద్ద‌లు ఈ ప‌రిణామాలు స‌హించ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డి చేయాలంటూ ఇప్ప‌టికే రెండుమార్లు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఫ‌లితం రాలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోని చంద్ర‌బాబు ఇప్పుడు కొత్త మార్గం ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారా అనే సందేహం క‌నిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవ‌లి ప‌లు వ్య‌వ‌హారాలు క‌నిపిస్తున్నాయి. చివ‌ర‌కు రెగ్యుల‌ర్ మీడియాలో కూడా సోష‌ల్Read More


విశాల్ కి మ‌రో విజ‌యం

త‌మిళ‌గ‌డ్డ మీద అన్నిర‌కాలుగానూ దూసుకుపోతున్న తెలుగుబిడ్డ విశాల్ మ‌రో ఖ్యాతి గ‌డించాడు. హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ తాను హీరోనేన‌ని చాటుకున్నాడు. నిర్మాత మండ‌లి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కోలీవుడ్ లో మరోసారి చరిత్ర సృష్టించారు. ఏడాదిన్నర క్రితం నటుడిగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విశాల్‌ ఇప్పుడు నిర్మాతగాను తన సత్తా నిరూపించుకున్నారు. 2017-19 సంవత్సరాలకు తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విశాల్‌ సంచలన విజయం సాధించారు. ఆయన జట్టు తరపున పోటీచేసిన ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలుపును సొంతం చేసుకున్నారు. సీనియర్‌ తమిళ నిర్మాత రాధాకృష్ణన్, తెలుగు నిర్మాత కోదండరామయ్య (కేఆర్‌), విశాల్‌ జట్లతో త్రికోణపోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశాల్‌Read More


మ‌ళ్లీ త‌ప్పులో కాలేసిన ఈనాడు..!

ఈనాడు ప‌త్రిక ఎట్ట‌కేల‌కు త‌ప్పు అంగీక‌రించింది. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో వెన‌క‌డుగు వేసింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ మీద త‌న రాత‌ల‌ను స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అదే క్ర‌మంలో మ‌రో తప్పిదం చేసేసింది. మ‌రోసారి తాను త‌ప్పులు కాలేసి, అంద‌రూ వాటిని విశ్వ‌సించాల‌నే స్థాయిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఈనాడు రాత‌ల ప్ర‌కారం 500 టీఎంసీల నీటిని త‌ర‌లించ‌డం సాధ్యం కాద‌ని అంగీక‌రించింది. అదే స‌మ‌యంలో క్ర‌స్టు గేట్లు ఎత్తి 50ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వదులుతామ‌ని రాశారు. అంటే దిగువ‌కు వ‌దిలే జలాలే 500టీఎంసీలు ఒక్క‌రోజుక‌ని లెక్క‌లు చెప్ప‌డం బాగానే ఉంది. కానీ నిజంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి భారీగా గేట్లు సిద్ధం చేసి, అన్ని జాగ్ర‌త్త‌ల‌తో 50ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వ‌దిలితే ఏమ‌వుతుంద‌నే విష‌యాన్ని ఒక్క‌సారయినా ఆలోచించిందా అన్న‌ది సందేహ‌మే. ప్ర‌ధానంగా పోల‌వ‌రంRead More


ఓపెనింగ్ డే బాక్సాఫీస్ రికార్డులివే..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ లేటెస్ట్ మువీ కాట‌మ‌రాయుడు ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. అయితే ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ రికార్డులు ప‌రిశీలిస్తే ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 25 సినిమాలు మాత్ర‌మే ఈస్థాయిలో వ‌సూళ్లు సాగించ‌డం విశేషం. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు రెండు ఉన్నాయి. తాజాగా కాట‌మ‌రాయుడు తో క‌లుపుకుని ప‌వ‌న్ సినిమాలు 25 కోట్ల ఫ‌స్ట్ డే క్ల‌బ్ లో రెండు చేర‌డం విశేషం. ఇక ప‌వ‌న్ క‌న్నా అత్య‌ధికంగా ర‌జ‌నీ కాంత్ 3, విజ‌య్ 3 సినిమాల‌తో ముందున్నారు. వారితో పాటుగా ప‌వ‌న్ తో స‌మానంగా మ‌హేష్ 2 సినిమాల‌తో ఫ‌స్ట్ డే రికార్డ్స్ లో క‌నిపిస్తున్నాడు. ఆత‌ర్వాత ప్ర‌భాస్ 1, ఎన్టీఆర్ 1, చిరంజీవి1, విక్ర‌మ్ 1, అల్లుRead More


దిగువ‌కు టీవీ9 ..!

తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్ లో మ‌రోసారి ఎన్టీవీ అగ్ర‌పీఠానికి చేరుకుంది. టీవీ9 ని అధిగ‌మించింది. బార్క్ రేటింగ్స్ ప్రకారం జీఆర్పీలు బాగా ప‌డిపోతున్న ద‌శ‌లో టీవీ9కి, ఎన్టీవీకి పెద్ద తేడా లేన‌ప్ప‌టికీ తొలి స్థానం ఎన్టీవీకి రావ‌డం ఈ వారంలో విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. దానికి కార‌ణం కూడా ఈ వారంలోనే టీవీ9 ఒకేసారి 10 పాయింట్లు కోల్పోవ‌డంతోనే ఎన్టీవీకి తొలిస్థానం ద‌క్కిన‌ట్టు క‌నిపిస్తోంది. త‌ర్వాతి స్థానాల్లో ఏబీఎన్, 10టీవీ కొన‌సాగుతున్నాయి. అయితే ఈ వారం సాక్షిటీవీ కూడా ముందుకు రావ‌డం విశేషం. చాలాకాలం త‌ర్వాత ఆరో స్థానానికి సాక్షి చేరుకుంది. ఇక ఈ వారం కూడా మొత్తం అన్ని చానెళ్ల జీఆర్పీలు క‌లుపుకుంటే త‌గ్గుదల కొన‌సాగుతోంది. అగ్ర‌స్థానంలో ఉన్న ఎన్టీవీ జీఆర్పీలు కేవ‌లం 50 పాయింట్లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నిస్తే తెలుగు చానెళ్ల జీఆర్పీలుRead More


హెరిటేజ్ లో పెను ప్ర‌మాదం

నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీలో పెను ప్ర‌మాదం జ‌రిగింది. ఇటీవ‌ల వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు తింటున్న చంద్ర‌బాబు కుటుంబానికి చెందిన కంపెనీలో జ‌రిగిన ఈ ప్ర‌మాదం క‌ల‌క‌లం రేగింది. అయితే ఫైర్ సిబ్బంది అప్ర‌మ‌త్త‌తో చాలా వ‌ర‌కూ కంట్రోల్ చేయ‌గ‌లిగిన‌ట్టు చెబుతున్నారు. హైద‌రాబాద్ ఉప్పల్‌ పారిశ్రామికవాడలోని హెరిటేజ్‌ డెయిరీలో  అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఆస్తినష్టం సంభవించింది. పారి శ్రామికవాడలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆందోళన చెందిన కార్మికులు పరుగులు తీశారు. కంపెనీలోని కార్మికులు భోజన విరామ సమయంలో ఉండగా బ్రెడ్‌ తయారీ సెక్షనలో మంటలు వచ్చాయి. అందులోని ఆయిల్‌, వనస్పతి ప్యాకెట్లు, మైదా పిండి బస్తాలకు మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి. సమా చారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక వాహనంలో నీళ్లు అయిపోవడంతో ఉప్పల్‌ జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వగాRead More


ఓవ‌ర్ టూ నంద్యాల‌.!

ఏపీ రాజ‌కీయాల‌కు ఇప్పుడు నంధ్యాల హాట్ స్పాట్ గా మారుతోంది. అటు విప‌క్షం, ఇటు అధికార ప‌క్షం అక్క‌డే దృష్టి కేంద్రీక‌రిస్తున్నాయి. నంద్యాల కేంద్రంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు తొలిపోరుగా ఇప్పుడు నంద్యాల మారుతోంది. దాంతో అక్క‌డ పై చేయి సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇరుప‌క్షాలు పావులు క‌దుపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఏర్ప‌డిన ఖాళీ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఉప ఎన్నిక‌ల అనివార్య‌మా..లేక ఓ ఒప్పందానికి వస్తారా అన్న‌ది ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. అధికార పార్టీ త‌న అంచ‌నా నెర‌వేరుతుందని, త‌మ‌కే నంద్యాల ద‌క్కుతుంద‌ని ఆశిస్తోంది. కానీ విప‌క్షం మాత్రం త‌మ సిట్టింగ్ సీటు అన్న సంగ‌తి మ‌ర‌చిపోవ‌వ‌ద్ద‌ని చెబుతోంది. దాంతో ఉభ‌యుల‌కు ఇప్పుడు నంద్యాల వ్య‌వ‌హారమే కీల‌కంగా మారుతోంది. భూమా నాగిరెడ్డి వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైఎస్సార్సీపీ టిక్కెట్Read More


టీడీపీకి అదో త‌ల‌నొప్పి..!

ఆంధ్ర‌ప్రదేశ్ లో అధికార పార్టీ అనేక అవ‌స్థ‌లు ప‌డుతోంది. ఓవైపు ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరుగుతున్న ద‌శ‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌తో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బ‌డ్జెట్ స‌మావేశాలు అనివార్యంగా నిర్వ‌హించాల్సిన స‌మ‌యంలో రాబోయే ప‌క్షం రోజులు ఎలా గ‌డ‌పాల‌న్న‌దే ఇప్పుడు పాల‌క‌ప‌క్షం ముందున్న ప్ర‌శ్న‌. తొలి రెండు రోజుల స‌మావేశాల్లో ఒక రోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం తో ముగిస్తే రెండో రోజు వైఎస్ జ‌గ‌న్ దూకుడుతో టీడీపీ నేత‌లు బేజారెత్తిపోయారు. ఇప్పుడు మ‌రో రెండు రోజులు భూమా పేరుతో ముగిసిపోవ‌డంతో కొంత ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. ఇక మ‌రో రోజు బడ్జెట్ పేరుతో గ‌డిచిపోతుంది. కానీ ఆత‌ర్వాత జ‌రిగే చ‌ర్చ‌లే ఇప్పుడు చంద్ర‌బాబు అండ్ కో ఠారెత్తిపోయేలా చేస్తున్నాయి. ఏపీలో అనేక స‌మ‌స్య‌ల మీద నిల‌దీయ‌డానికి ఏకంగా 20 స‌మ‌స్య‌ల ఎజెండాతో విప‌క్షం వ్యూహ ర‌చ‌న చేస్తుంటే ఒక్కో స‌మ‌స్యRead More


స్పీక‌ర్ కోడెల‌కు కోర్టు నుంచి స‌మ‌న్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో తాను ఎన్నిక కావటానికి రూ.11 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశానని కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఇంత మొత్తం ఖర్చు చేయటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈ విషయమై కోడెలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు న్యాయస్థానం భాస్కర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్‌ జుడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో మంగళవారం స్పెషల్ మొబైల్ పీసీఆర్ మెజిస్ట్రేట్ సతీష్ కుమార్ వివిధ సెక్షన్లు 171E, 171F, 171B, 171H, 171i, 200 IPCల కింద ఆయనపై కేసులుRead More