Main Menu

telugu media

 
 

స్వ‌రం స‌వ‌రించుకున్న చానెల్

ntv

తెలుగుమీడియాలో చాలాకాలంగా చంద్ర‌బాబుకి సానుకూల‌త ఉంటుంది. దానికి అనేక కార‌ణాలున్నాయి. సామాజిక స‌మీక‌ర‌ణాలు అందులో ఒక‌టి. ముఖ్యంగా రామోజీరావు బ‌హిరంగంగానే కాంగ్రెస్ వ్యతిరేక‌తో భాగంగా తొలుత టీడీపీని, ప్ర‌స్తుతం బీజేపీని భుజాన‌మోయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల స్ఫూర్తిగా చాలామంది మీడియా సంస్థ‌ల య‌జ‌మానులు చంద్ర‌బాబు భ‌జ‌న‌లో క‌నిపిస్తుంటాయి. అందులో రాధాకృష్ణ ఓ అడుగు ముందుకేసి, చివ‌ర‌కు టీడీపీ నేత‌ల‌కే వెగ‌టు పుట్టే స్థాయిలో సాగుతున్న వైనం కొంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటుంది. ఇక అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన తుమ్మల న‌రేంద్ర చౌద‌రి ఎన్టీవీ మాత్రం కొంత భిన్న తీరులో స్పందించింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎన్టీవీలో కీల‌క వాటాదారులు, తెర‌వెనుక సూత్ర‌ధారులు ఇత‌ర సామాజిక‌వ‌ర్గీయులే కాకుండా చంద్ర‌బాబు వ్య‌తిరేకులు కూడా కావ‌డం ప్ర‌ధానాంశంగా క‌నిపిస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ ప‌ట్ల సానుకూలంగాRead More


మీడియా సంద‌డి మొద‌ల‌య్యింది..!

The-Media

మ‌ళ్లీ క‌ద‌లిక మొద‌ల‌య్యింది. తెలుగు మీడియాకి జోష్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాలు మారుతున్నాయి. మ‌రికొన్నింటిలో మార్పుల‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్ప‌టికే 99 చానెల్ ని జ‌న‌సేన స్వాధీనం చేసుకుంది. ఆపార్టీ నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్ సార‌ధ్యంలో ఆదిత్య గ్రూప్ నుంచి న్యూస్ వేవ్ మీడియా ఈ చానెల్ న‌డుపుతోంది. ఇక త్వ‌ర‌లో 10టీవీ కూడా చేతులు మారుతోంది. ఈ చానెల్ వైసీపీ సానుభూతిప‌రుడైన జ‌గ‌న్ స‌న్నిహితుడు కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఇక వాటికితోడుగా స్టూడియో ఎన్ చానెల్ కూడా ప్ర‌స్తుతం తాత్కాలికంగా మూత‌ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త ఆఫీసులో ప్రారంభిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌ల్కి భ‌గ‌వ‌న్, అమ్మ భ‌గ‌వాన్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఈ చానెల్ లో మార్పులు కూడా ఆస‌క్తిగా క‌నిపిస్తున్నాయి. ఇక కొత్త‌గా ఎట్ రిప‌బ్లిక్ పేరుతో కొత్త‌చానెల్ తెరంగేట్రానికి రంగంRead More


చానెల్ సిబ్బందితో యాజ‌మాన్యం ఆట‌లు

36836418_10212010246266747_5869466340657463296_n

అంద‌రికీ ఆధ్యాత్మిక‌త గురించి మాధ‌వ సేవ గురించి మాట‌లు చెప్పే క‌ల్కి భ‌గ‌వాన్, అమ్మ భ‌గ‌వాన్ ల ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న చానెల్ లో చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే నెల‌ల త‌ర‌బ‌డి వేత‌నాల బ‌కాయిల‌తో సిబ్బంది స‌త‌మ‌తం అవుతున్నారు. అప్పుల బాధ‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే మేక‌ప్ ఆర్టిస్ట్ ఆనంద్ ఏకంగా స్టూడియో ఎన్ ఆఫీస్ బిల్డింగ్ ఎక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. మ‌రో ఉద్యోగి బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చి తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నాడు. అయినా యాజ‌మాన్యానికి క‌నిక‌రం లేదు. చివ‌ర‌కు ఓ ఉద్యోగి అప్పులవాళ్ల ఒత్తిడితో గుండెపోటు కార‌ణంగా ప్రాణాలు కోల్పోయాడు.అయినా ప‌రిస్థితిలో మార్పు లేదు. దాంతో చివ‌ర‌కు గ‌త జూన్ లో స‌మ్మెకు దిగ‌డంతో యాజ‌మాన్యం డిమాండ్లకు అంగీక‌రించింది. వేత‌న బ‌కాయిలు విడుద‌ల చేస్తామ‌నిచెప్పింది. అమ్మ భ‌గ‌వాన్, క‌ల్కి భ‌గ‌వాన్ ల సుపుత్రుడు కృష్ణాజీRead More


కొత్త మీడియాలో అడుగుపెట్టిన రామోజీ గ్రూప్

0cbe9536-13d3-4e12-ab9f-cb594184b8c4

ఈనాడు సంస్థ‌లు కొత్త మీడియాలో అడుగుపెట్టాయి. ఇప్ప‌టికే ప్రింట్., ఎలక్ట్రానిక్ మీడియాల‌తో పాటు డిజిట‌ల్ మీడియాలో కూడా ఈనాడు హ‌వా చాటుతోంది. తాజాగా రెడియోలు చానెళ్లు ప్రారంభిస్తోంది. ఈనెల 5న ఏపీ, తెలంగాణాలోని 5 న‌గ‌రాల్లో ఎఫ్ ఎం చానెళ్లు ప్రారంభించ‌డానికి రంగం సిద్ధం చేసింది. వ‌రంగ‌ల్, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం న‌గ‌రాల్లో ఈ ఎఫ్ ఎం పేరుతో కొత్త చానెళ్ల‌కు శ్రీకారం చుడుతోంది. ప్రైవేటు ఎఫ్ ఎం చానెళ్ల‌కు అనుమ‌తిచ్చి చాలాకాలం అవుతున్న‌ప్ప‌టికీ వాటి ప‌ట్ల ఎవ‌రూ దృష్టి పెట్ట‌లేదు. కానీ ప్ర‌స్తుతం రామోజీ గ్రూపు ఈ రంగంలో అడుగుపెడుతున్న నేప‌థ్యంలో అంద‌రి దృష్టి అటు మ‌ళ్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రెడ్ ఎఫ్ ఎం పేరుతో స‌న్ గ్రూప్ ఈ వ్య‌వ‌హారంలో పాగా వేసింది. తాజాగా రామోజీ గ్రూపు కూడా అడుగుపెడితే పోటీ పెరిగేRead More


తెలుగు మీడియా కళ్లు తెరవదా?

media

ఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మీడియా పరిపరి విధాలుగా ప్రహసనాలు నడుపుతుందన్నది పలువురి అభిప్రాయం. తాజాగా టీవీ చానెళ్ల తీరు దానికి తగ్గట్టుగానే ఉంది. ముఖ్యంగా టీటీడీ ఆభరణాల వివాదంలో తెలుగు న్యూస్ చానెళ్ల ధోరణి విస్మయకరంగా కనిపిస్తోంది. ఒకప్పుడు విపక్ష నేత డిక్లరేషన్ లేకుండా ఆలయంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై ఇదే చానెళ్లలో రోజుల తరబడి చర్చలు జరిపారు. ఆలయంలో అన్యమతస్తులు ప్రవేశించారనే అర్థం వచ్చే రీతిలో నానా హంగామా చేశారు. వాస్తవాలు చెప్పడం అవసరం కాబట్టి, అటు జగన్ అయినా మరొకరయినా నిబంధనలను ఉల్లంఘిస్తే వాటిని చాటిచెప్పడం అవసరం. అదే సమయంలో తాజాగా టీటీడీ ఆభరణాల వివాదంలో మీడియా మౌనం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రధాన చానెళ్లన్నీ అసలు విషయాన్ని విస్మరించి విన్యాసాలుRead More


రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!

abn md radha krishna

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. జ‌న‌సేన అధినేత తీరు రోజురోజుకి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాగిస్తున్న ట్వీట్ల ప‌ర్వం దుమారం రేపుతోంది. నిన్న ర‌వి ప్ర‌కాష్‌, శ్రీనిరాజు చుట్టూ చ‌ర్చ జ‌రిప‌న జ‌న‌సేనాని, ఈరోజు ఏబీఎన్ రాధాకృష్ణని ఎంచుకున్నారు. మ‌ధ్య‌లో అరే ఓ సాంబ అంటూ టీవీ5 సాంబ‌శివ‌రావుని కూడా గుర్తుచేసిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఏబీఎన్ ఆర్కే మీద పీకే సెటైర్లు మాత్రం పాపుల‌ర్ అవుతున్నాయి. ముఖ్యంగా రాధాకృష్ణ‌ని టీడీపీ జాతిర‌త్న అంటూ సంబోధించ‌డం ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌గ‌టు రాజ‌కీయాల‌కు కొత్త భాష్యం చెబుతున్న‌ట్ట‌వుతోంది. ఇన్నాళ్లుగా తెలుగు నేత‌లంతా తాము సెటైర్లు విసిరినా, విమ‌ర్శ‌లు చేసినా అన్నీ రాత‌, మాట రూపంలో చెప్పేవారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ల‌తో త‌న త‌డాఖా చూపిస్తున్న‌ట్టుగా ఉంది. అందులోనూRead More


మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

paw

ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. ముఖ్యంగా ప‌వ‌న్ ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. ద‌గ్గుబాటి అభిరామ్ వ్య‌వ‌హారం స‌మ‌సిపోయి కొణిదెల వారి కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల పాత్ర ముందుకొచ్చింది. టీవీ9, టీవీ5, ఏబీఎన్ చానెళ్లు ఒక‌వైపు జ‌న‌సేనాని మ‌రోవైపు అన్న‌ట్టుగా మారిపోయింది. ప‌వ‌న్ మీడియా మీద గురిపెట్ట‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌డుతుండ‌గా, ప‌లువురు అభినందిస్తున్నారు. తెలుగు మీడియాలో మాఫియాగా మారిన ఓ వ‌ర్గం పెత్త‌నాన్ని నిల‌దీసినందుకు అభినందలు తెలుపుతున్నారు. అండ‌గా నిలుస్తున్నారు. పీకేకి తోడుగా నిలుస్తామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి మీడియాలో కొంద‌రి పెత్త‌నాన్ని తొలుత నిల‌దీసింది వైఎస్ జ‌గ‌న్. కానీ ఆయ‌న కొంత వ‌ర‌కూ ప్ర‌య‌త్నించి ప్ర‌స్తుతం ఏబీఎన్ మిన‌హా మిగిలిన వారితో స‌ఖ్యంగా సాగిపోతున్న‌ట్టుRead More


రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం

tv9 srini raju

టీవీ9 చానెల్. తెలుగులో పేరెన్నిక‌గ‌న్న చానెల్. న్యూస్ చానెళ్ల విభాగంలో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే వివాదాల్లో కూడా ఉంటుంది. అయితే అనేక ఏళ్లుగా ఎవ‌రికి ఎటువంటి వివాదం ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ టీవీ9 పేరు చెప్ప‌గానే రవిప్ర‌కాష్ మీద విమ‌ర్శ‌లు చేసేవారు. ఆయ‌న తీరుని నిర‌సించేవారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు తొలిసారిగా జ‌న‌సేన అధినేత రూటు మార్చారు. ఆయ‌న టీవీ9 మీద విమ‌ర్శ‌ల‌ను ఏకంగా శ్రీనిరాజు మీద గురిపెట్టారు. శ్రీనిరాజు స‌ద‌రు చానెల్ లో 88.69 శాతం వాటా క‌లిగిన వ్య‌క్తి అంటూ ప‌వ‌న్ పేర్కొన్నారు. దాంతో ఇది విశేషంగా మారింది. ప్ర‌స్తుతం ఫిల్మ్ ఛాంబ‌ర్ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న త‌ల్లి మీద వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. దానికి వంత‌పాడిన చానెళ్ళ మీద ఘాటుగా స్పందిస్తున్నారు.Read More


ఆమెను మీడియా వాడుకుందా…?

DaVEjQaVwAAW40q

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏపీ అంత‌టా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం చెల‌రేగుతోంది. తెలంగాణాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఫ్రంట్ పెడ‌తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మీడియాలో ఓ సెక్ష‌న్ పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని సాధ‌నంగా మ‌ల‌చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లు విప్పి నిర‌స‌న తెలిపిన శ్రీరెడ్డికి ఓ మీడియా సంస్థ ప్ర‌తినిధులు అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు భావిస్తున్నారు. మహా టీవీలో ఈ నిర‌స‌న‌కు సంబంధించిన ప్ర‌చారం విస్తృతంగా సాగిన విష‌యం. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ప‌దే ప‌దే చ‌ర్చ‌లు సాగిన విష‌యం కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే శ్రీరెడ్డిRead More


మీడియా ఇంతగా దిగజారాలా..?

22046921_1184587104974176_8072486538768234946_n

పత్రికా రంగం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వరకూ పరిణతి చెందినా ప్రమాణాలు మాత్రం పడిపోతూనే ఉన్నాయి. బాగా దిగజారిపోతున్నాయనే ఆందోళన అందరిలో వినిపిస్తున్నా మీడియా సంస్థల నిర్వాహకుల తీరు మారడం లేదు. విమర్శలను ఖాతరు చేయడం లేదు. సూచనలను పరిగణించడం లేదు. అందుకే చిన్న చిన్న అంశాలను, ప్రధానంగా సున్నితమైన విషయాలను కూడా రేటింగ్స్ కోసం సొమ్ము చేసుకునే తపన రానురాను తీవ్రమవుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన యువతి మీద లైంగిక దాడికి సంబంధించిన విషయంలో మీడియా అతి ప్రవర్తన అందరినీ విస్మయం కలిగించింది. బాధిత కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న సన్నివేశాలను పదే పదే పునరావ్రుతం చేయడం ద్వారా మీడియా చానెళ్లన్నీ మరో అడుగు దిగజారి వ్యవహరించాయి. బాదితురాలి మీద బరితెగించిన యువకులకు బుద్ధి చెప్పాలంటే వారిని చూపించి,Read More