telangana

 
 

స‌మంత‌- కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర…

ktr samantha

అక్కినేని వారి కాబోయే కోడలు ఏమి చేసినా ఆస‌క్తిదాయ‌క‌మే. తాజాగా తెలంగాణా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె ట్వీటు ఆస‌క్తిగా మారింది. చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. కేటీఆర్ స్పంద‌న‌తో మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పై స‌మంత పొగ‌డ్త‌ల వ‌ర్షం వెనుక కార‌ణాల‌పై ప‌లువురు ఆస‌క్తిగా మాట్లాడుకోవ‌డం విశేషం. కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్వీట్ చేసిన స‌మంత . ‘‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్’’ అని ట్వీట్ చేసింది. సమంత ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.. ‘‘మా చేనేత ప్రచారకర్తకు చాలా ధన్యవాదాలు. మీ ఫోకస్, డెడికేషన్‌తో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. వొవెన్2017(చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో) కోసం ఎదురు చూస్తున్నా.’’ అని రిప్లయ్ ఇచ్చారు.Read More


డ్ర‌గ్స్ మ‌త్తులో పొలిటిక‌ల్ స్టార్లు..!

drugs

చిన్న చిన్న చినుకులుగా మొద‌ల‌యిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం పెను తుఫానుగా మారుతుంద‌నుకుంటే అది కాస్తా అల్ప‌పీడ‌నంగా మిగిలిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. బ‌డాబాబులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌డంతో ఈ వ్య‌వ‌హారాన్ని సాగ‌దీసి స‌రిపుచ్చే ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అదే క్ర‌మంలో కొంద‌రు బ‌ల‌ప‌శువుల‌ను కూడా సిద్ధం చేసినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. వాస్త‌వానికి డ్ర‌గ్స్ భాగోతంలో తొలుత ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్ల వ్య‌వ‌హారం ముందుకొచ్చింది. ప‌లు స్కూళ్లలో డ్ర‌గ్స్ చాలా య‌ధేశ్ఛ‌గా సాగుతున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ఏకంగా విస్కీని వాట‌ర్ బాటిళ్ల‌లోనూ, ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ పెన్సిల్ బాక్సుల్లోనూ పెట్టుకుని స్కూళ్ల‌కు వెళుతున్న విద్యార్థుల వ్య‌వహారం అధికారులే బ‌య‌ట‌పెట్టారు. కానీ అంత‌లోనే అదే అధికారుల దృష్టంతా టాలీవుడ్ మీద ప‌డింది. ఇంట‌ర్నేష‌న్ స్కూళ్ల‌న‌గానే హైద‌రాబాద్ న‌గ‌రంలోని బ‌డాబాబుల వార‌సులంతా చ‌దివే స్కూళ్లు. ఆ స్కూళ్ల జోలికి వెళితేRead More


ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా ప్ర‌శంసింది..కాంగ్రెస్ మాత్రం

ktr

తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని నిప్పులు చెరిగారు మంత్రి. తెలంగాణకు మేలు చేయాలనుకున్న ఏ నేతను కాంగ్రెస్ నెగలనీయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణను దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్వీ సైన్యంగా పని చేసిందన్నారు. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్వీ పని చేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారనిRead More


తుస్ మ‌నిపించేలా డ్ర‌గ్స్ కేసు..!

4, drugsss

మీడియాలో హ‌డావిడి చూసి చాలా విష‌యాల్లో సామాన్యులు కంగారుప‌డుతుంటారు. కానీ అస‌లు వాస్త‌వానికి, మీడియా హంగామాకి పొంత‌నే ఉండ‌ద‌న్న‌ది చాలామార్లు రుజువ‌య్యింది. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖుల డ్ర‌గ్స్ కేసు కూడా అదే జాబితాలో చేర‌బోతోంది. ఇంకేముంది టాలీవుడ్ అంతా డ్ర‌గ్స్ మ‌త్తులో ఉంద‌నే స్థాయిలో మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. తెలుగు ప్ర‌జ‌ల‌కు తీవ్ర న‌ష్టం చేర్చే అంశం ఇదొక్క‌ట్టే అన్న‌ట్టుగా ఇప్పుడు మీడియా డ్ర‌గ్స్ కి ఎడిక్ట్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. నిజంగా మ‌త్తు గురించి మాట్లాడాలంటే ఏపీలో మ‌హిళ‌లంతా మ‌ద్యానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తున్నారు. జ‌నావాసాల్లో మ‌ద్యం దుకాణాల‌పై దండెత్తుతున్నారు. అయినా మీడియా కెమెరాల‌కు అవి క‌న‌బ‌డ‌డం లేదు. అదే స‌మ‌యంలో టాలీవుడ్ లో డ్ర‌గ్స్ మాత్రం అత్యంత భ‌యంక‌ర‌, బీభ‌త్స స‌న్నివేశాల‌ను త‌ల‌పించేలా ఎపిసోడ్ల‌కు, ఎపిసోడ్లు స‌రిపోవ‌డం లేదు. అయితే ఇంత జ‌రుగుతున్నా డ్ర‌గ్స్ కేసుల్లోRead More


మ‌రో హెచ్సీయూ విద్యార్థి మృతి

hcu

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌సియూ విద్యార్ధి విశాల్ టాండన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జనరల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తున్న విశాల్ టాండన్ నల్లగండ్ల అపర్ణ అపార్టుమెంట్స్‌ 14వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడే ఆత్మహత్యకు కారణం అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాల్ టాండన్ స్వస్థలం కర్ణాటక బె


భారీ వ‌ర్షాలే..!

rain_0

వచ్చే 24 గంటలలో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, ఒడిశాలకు ఆనుకుని బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతునన ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది


శిరీష కేసులో కొత్త మ‌లుపు

1498304625.33

బ్యూటీషియ‌న్ శిరీష కేసులో కొత్త మ‌లుపు తిరిగింది. నిందితులు పోలీసుల క‌స్ట‌డీకి కోర్ట్ అనుమ‌తిచ్చింది. దాంతో కేసులో మ‌రిన్ని వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిందితులుగా ఉన్న శ్ర‌వ‌ణ్‌, రాజీవ్‌ల‌ను నాంప‌ల్లి కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ క‌స్ట‌డీకి అనుమ‌తించింది. ఈనేప‌ధ్యంలో జూన్ 26, 27న రాజీవ్ , శ్ర‌వ‌ణ్‌ల‌ను బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశం మేర‌కు క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు. శిరీష‌ది హ‌త్యా, ఆత్మ‌హ‌త్యా, అన్న‌కోణంలో నిందితుల‌ను పోలీసులు ప్ర‌శ్నించ‌నున్నారు. శిరీష‌పై అస‌లు అత్యాచారం జ‌రిగిందా లేదా అని పోలీసులు తేల్చ‌నున్నారు. నందు, న‌వీన్‌లు అస‌లు ఎవ‌ర‌న్న‌ది రాజీవ్‌, శ్ర‌వ‌ణ్‌ల‌ను పోలీసులు ప్రశ్నించ‌నున్నారు.


చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే..!

HARISH

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి రోజుగా భావిస్తున్నానని మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల కల నిజమైన రోజున ఇక్కడి ప్రజలంతా ఆవిర్భావ వేడుకను పండుగలా భావిస్తుంటే చంద్రబాబు మాత్రం మా సంతోషాన్ని చూడలేకపోతున్నారని, ఈ తీరు సరైనది కాదని పేర్కొన్నారు. ఆయన ఇలా మాట్లాడటం బాధాకరమని, దురదృష్టకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు తన అక్కసు వెల్లగక్కారని, నిజ స్వరూపాన్ని చూపారని విమర్శించారు. బాబు మాటలను చూసి ఇప్పటికైనా తెలంగాణ తెదేపా నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇకపైన కూడా బాబు భజన చేసే నాయకులను ప్రజలు ద్రోహులుగా గుర్తిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే నిరసన తెలుపుతామన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రRead More


కేటీఆర్ దెబ్బ‌కి దొగొచ్చిన టీవీ9, ఎన్టీవీ

TV9-Ravi-Prakash-And-NTV-Narendra-Chowdary

ఇప్ప‌టికే ఓసారి గుణపాఠం జ‌రిగింది. సుదీర్ఘ‌కాలం పాటు తెలంగాణాలో టీవీ9 తెర‌మరుగ‌య్యింది. చివ‌ర‌కు తెలంగాణా కోసం ప్ర‌త్యేకంగా జై తెలంతాణా టీవీ ప్రారంభించి, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంతో రాజీబేరం కుదుర్చుకుని రాష్ట్రంలో టీవీ9 పున‌ర్థ‌ర్శ‌నం చేయించుకోవాల్సి వ‌చ్చింది. అయినా బుద్ధి మారిన‌ట్టుగా లేదు. అవ‌కాశం ద‌క్కిన అన్ని సంద‌ర్భాల్లోనూ తెలంగాణా స‌ర్కారు మీద క‌క్ష‌, ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద అమిత ప్రేమ చాటుకోవ‌డానికి ఆ చానెల్ త‌హ‌త‌హ‌లాడుతుంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. స‌రిగ్గా దానికి త‌గ్గ‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించి చేతులు కాల్చుకుంది. క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాల్సి వ‌చ్చింది. ఈసారి టీవీ9కి తోడుగా ఎన్టీవీ కూడా అడ్డ‌దారులు తొక్కాల్సిన స్థితి వ‌చ్చింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నీ ఈ రెండు చానెళ్ల తీరు అభాసుపాల‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు. రాజస్తాన్ లో పోలీసులు రెచ్చిపోయారు. ఓ యువ‌కుడిని తీవ్రంగా గాయ‌ప‌రిచారు. దాంతో ఆ విజువ‌ల్స్ నిRead More


భ‌యంతో కూడిన అభిమానం నిండిన భ‌క్తిలో బాబు

chandrababu-UK-tour

రెండేళ్లు దాటుతున్నా చంద్ర‌బాబుకి చెమ‌ట‌లు త‌ప్ప‌డం లేదు. కాలం గ‌డుస్తున్నా ఆ ఒక్క కేసే బాబుని కంటిమీద క‌నుకులేకుండా చేస్తోంది అందుకే కేసీఆర్ ఎంత తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నా బాబు ప‌ల్లెత్తు మాట అన‌లేక‌పోతున్నారు. ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లను మించి విరుచుకుప‌డినా నోరు తెర‌వేల‌క‌పోతున్నారు. ప‌చ్చి మోస‌గాడు చంద్ర‌బాబు అంటూ మండిప‌డినా మౌనం వీడ‌లేక‌పోతున్నారు. అన్నింటికీ కార‌ణం ఆ ఒక్క కేసేన‌ని అంతా భావించే ప‌రిస్థితి వ‌చ్చేసింది. 2015లో వెలుగులోకి వ‌చ్చిన ఓటుకు నోటు వ్య‌వ‌హారం త‌ర్వాత అనేక ప‌రిణామాలు జ‌రిగాయి. చంద్ర‌బాబు పూర్తిగా అమ‌రావ‌తికే అంకితం అయిపోయారు. తెలంగాణాలో టీడీపీ ఆశ‌లు పూర్తిగా వ‌దిలేసుకున్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క సీటుతో స‌రిపెట్టుకున్న సీన్ వ‌చ్చేసిన త‌ర్వాత ఇక ప‌చ్చ పార్టీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. చివ‌ర‌కు తాజాగా ర‌మేష్Read More