TEASER

 
 

నితిన్ ‘లై’ టీజ‌ర్

nithin lie

ఆల్ టైమ్ రికార్డ్ దిశ‌లో కాట‌మ‌రాయుడు

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే రికార్డ్ వ్యూస్ సాధించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీర‌మ్ మువీ అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. శనివారం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ వ్యూస్ లో రికార్డ్ లు సృష్టిస్తోంది. విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకున్న కాటమరాయుడు, ఆ తరువాత మరికొన్ని గంటల్లోనే రెండు మిలయన్ల మార్క్ ను దాటేసింది. తొలి 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకుRead More


అంద‌నంత దూరంలో జ‌న‌తా గ్యారేజ్..!

636118857913860973

సినిమా స‌క్సెస్ ల‌కు ఇప్పుడు పునాది టీజ‌ర్ లోనే ప‌డుతోంది. టీజ‌ర్ వ్యూస్ ను బ‌ట్టి ప్రేక్షకులు ఎంత ఆతృత‌తో ఉన్నార‌న్న‌ది క‌నిపెడుతున్నారు. తాజాగా సూప‌ర్ హిట్ సినిమాల‌న్నీ అలాంటి ఫలితాల‌నే ఇచ్చాయి ముఖ్యంగా టాప్ హీరోస్ కి ఇది త‌ప్ప‌నిస‌రిగా మారింది. అందుకే టీజ‌ర్ వ్యూస్ ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన రోజులు వ‌చ్చేశాయి. అయితే తాజాగా జ‌న‌తా గ్యారేజ్ సృష్టించిన రికార్డును లేటెస్ట్ హాట్ మువీస్ రెండూ చేరుకోలేక‌పోవ‌డం విశేషం. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్, ధృవ‌, బాల‌య్య శత చిత్రం గౌత‌మీ పుత్రశాత‌క‌ర్ణ కూడా ప్ర‌త్యేక క్రేజ్ ను సంత‌రించుకున్న సినిమాలే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాల టీజర్లు విడుదలయ్యాయి. టీజర్లలో తమ అభిమాన నటులు బాగానే ఇరగదీశారు. ఆ రెండు టీజర్లకు పది లక్షల వ్యూస్ దాటాయి. అయినా సరే ఆRead More


మెగా ‘టీజర్‌’ వెనుక రాజమౌళి తనయుడు…

Rajamouli

మెగాస్టార్‌ 61వ పుట్టిన రోజు వేడుకలో రామ్‌చరణ్‌ తేజ్‌ ఓ టీజర్‌ను విడుదల చేశారు. చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన ఈ టీజర్‌ ఆయన అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. ఈ టీజర్‌ను తయారు చేసింది దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయేనట. కార్తికేయ చాలా రోజుల క్రితమే ‘షోయింగ్‌ బిజినెస్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ సినిమాల మేకింగ్‌ వీడియోలను, టీజర్‌లను కట్‌ చేస్తుంది. ‘బాహుబలి’ మేకింగ్‌ వీడియోలను కూడా ఈ సంస్థే తయారు చేసింది. మంచి క్రియేటివిటీతో టీజర్‌లను కట్‌ చేయగల ఈ సంస్థకే మెగా టీజర్‌ ఆఫర్‌ కూడా వెళ్లిందట. దాంతో కార్తికేయ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి టీజర్‌ తయారు చేశాడు. ఇలాంటి అవకాశం తనకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానంటూ, ట్విట్టర్‌ ద్వారా మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పాడుRead More


రామ్ చరణ్ అంత మోసం చేసాడా?

14068221_1119714884730443_8958251109059288553_n

ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా. చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా మీద ఆసక్తి పెంచేలా రోజుకో అప్ డేట్ తో ఊరిస్తున్నాడు నిర్మాత, మెగా తనయుడు రామ్ చరణ్. అంతేకాదు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు చరణ్. అయితే అన్నయ్య ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ లో సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన యూనిట్, చిరంజీవిని మాత్రం షాడో షాట్స్ తో చూపించాడు. ఎక్కడ చిరు ముఖాన్ని స్పష్టంగా చూపించకుండా కేవలం స్టైల్స్ తో అలరించేRead More


తండ్రి బర్త్ డే కానుకగా కొడుకు టీజర్..

DHRUVA

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా పవర్ స్టార్ తాజా చిత్రం ‘ధృవ’. ఈ చిత్రంపై చెర్రీ భారీ ఆశలనే పెట్టుకొన్నాడు. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ధృవ విషయంలో ప్రతిది పక్కగా ప్లాన్ చేసుకొన్నాడు. సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు. ఇటీవలే రిలీజైన ‘ధృవ’ ఫస్ట్ లుక్ కి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చెర్రీ లుక్ అదిరిపోయిందంటున్నారు. ఇప్పటికే ధృవ షూటింగ్ దాదాపు పూర్తికావొస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ధృవ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. మరోవైపు, ఈ చిత్ర ఆడియో వేడుకకి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. తాజాగా చిత్ర ఆడియో హక్కులు కూడా అమ్ముడు పోయాయి. భారీ మొత్తానికి ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.Read More


త‌మ‌న్నా డ్యాన్స్ అదుర్స్: అభినేత్రి టీజ‌ర్

abhinetri

సినిమా ఎలా ఉన్నా..టీజర్‌ టాప్ లేపేస్తోంది…

Kabali Teaser Stills-Photos-Rajinikanth

‘కబాలి’ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతోన్న సంగతి తెలిసిందే.అయితే సినిమా ఎలా ఉన్నా..టీజర్‌ మాత్రం టాప్ లేపేస్తోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘కబాలి’ చిత్రం టీజర్‌ రికార్డు సృష్టించింది. ఈ టీజర్‌ విడుదలైన పది రోజుల్లోనే బాహుబలి ట్రైలర్‌ వ్యూస్‌ను బీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ టీజర్‌ను మొత్తం 4 కోట్ల మంది చూశారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. ‘కబాలి మరో రికార్డు, కబాలి దా’ అని రాసుకొచ్చారు. ఆనందంలో ‘కబాలి’ టీం ఈ సందర్భంగా సినిమా సక్సెస్‌ మీట్‌ను నిర్వహించినట్లు చిత్ర బృందం తమ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు పా రంజిత్‌, నిర్మాత కలైపులి ఎస్‌ థను, సంగీతRead More


రికార్డుల గ్యారెజ్‌..!

janata

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్‌’ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేస్తూ, కొద్దిరోజుల క్రితం టీమ్‌ విడుదల చేసిన ఫస్ట్‌ టీజర్‌ పెద్ద సంచలనమే సష్టించింది. తెలుగు సినిమాలో అతి త్వరగా వన్‌ మిలియన్‌ మార్క్‌ చేరుకున్న టీజర్‌గా నిలవడమే కాక, ఇప్పటివరకూ ఈ టీజర్‌ 5 మిలియన్‌ (50 లక్షల) వ్యూస్‌ సాధించింది. తెలుగు సినిమాల టీజర్స్‌ విషయంలో 5 మిలియన్‌ అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇక ఇదే టీజర్‌కు ఇప్పటివరకూ 77 వేల లైక్స్‌ వచ్చాయి. ఒక టీజర్‌కు వచ్చిన లైక్స్‌ పరంగా చూస్తే, ‘జనతా గ్యారెజ్‌’ టీజర్‌ కొత్త రికార్డు నెలకొల్పిందనే చెప్పాలి. జనతా గ్యారెజ్‌ తర్వాత ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమాకు సంబంధించిన టీజర్‌ లైక్స్‌Read More


30 గంటల్లో.. 22 లక్షలు

Janata-Garage

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్‌’ టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్రం తెలుగు టీజర్‌ను ఇప్పటి వరకు మొత్తం 22 లక్షల మందికి పైగా చూశారు. అంతేకాదు 58,439 మంది టీజర్‌ నచ్చినట్లు లైక్‌ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో సమంత, నిత్యామేనన్‌ కథానాయికలుగా నటిస్తుండగా, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఓ ప్రధాన పాత్రను పోషించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికినవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.