Main Menu

team india

 
 

కోహ్లీ సేన కొత్త రికార్డులు

ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. కడవరకూ పోరాడిన విరాట్‌ గ్యాంగ్‌.. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 323 పరుగుల విజయలక్ష్యంలో భాగంగా 104/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 291 పరుగుల వద్ద ఆలౌటైంది. గత 11 ఏళ్లలో ఆసీస్‌ గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే 11 సిరీస్ ల‌లో తొలిసారి. గ‌త ప‌ర్య‌ట‌న‌లో స‌రిగ్గా అడిలైడ్ లోనే తొలి టెస్టులో 47 ప‌రుగుల‌తో ఓట‌మి పాల‌య్యింది. ఈసారి 31 ప‌రుగుల‌తో ఓట‌మి పాల‌య్యారు. ఆసీస్‌ ఆటగాళ్లలో షాన్‌ మార్ష్‌(60; 166 బంతుల్లోRead More


పుజారా ఒంట‌రిపోరాటం, కోలుకున్న టీమిండియా

ఆసీస్ తో తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియాకు చేదు ప్రారంభం ఎదుర‌య్యింది. ఆరంభంలోన టాపార్డ‌ర్ వికెట్లు ట‌ప‌ట‌పా కోల్పోయింది. దాంతో జ‌ట్టు గౌర‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించ‌గ‌లుగుతుందా లేదా అన్న సందేహం క‌లిగింది. అయితే చివ‌ర‌కు వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ ఒంట‌రిపోరాటంతో జ‌ట్టు కోలుకుంది. బ్యాట్స్ మెన్ ఒక్కొక్క‌రుగా క్యూ క‌డుతున్నా ఛ‌టేశ్వ‌ర్ పుజారా మాత్రం బ్యాట్ కి ప‌ని చెప్పారు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. దాంతో టీమిండియా తొలి రోజు ఆట‌లో చివ‌ర‌కు 250 ప‌రుగుల స్కోర్ దాటింది. తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా రాహుల్, ముర‌ళీ విజ‌య్, కోహ్లీ వైఫ‌ల్యంతో 20 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. రాహుల్ 2, కోహ్లీ 3, ముర‌ళీ విజ‌య్ 11 ప‌రుగులు చేశారు. ఆ త‌ర్వాత ర‌హానే కూడా 13 ప‌రుగులుRead More


రేటింగ్స్ లో మ‌నోళ్లే టాప్

అంత‌ర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ఆట‌గాళ్లు అద‌ర‌గొడుతున్నారు. ర్యాంకింగ్స్ లో స‌త్తా చాటుతున్నారు. లేటెస్ట్ రేటింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొన‌సాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ 899 పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలవగా, డిప్యూటీ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో చోటుదక్కించుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మతో పాటుగా మ‌రో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ 9 స్థానాలు మెరుగుపరచుకుని ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. దాంతో టాప్ లో ముగ్గురు టాపార్డ‌ర్ బ్యాట్స్ మెన్ల‌కు చోటు ద‌క్క‌డం విశేషం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 20వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బౌలర్లలో ముగ్గురు భారత బౌలర్లు చోటుదక్కించుకోగా వారిలో జస్ప్రీత్ బుమ్రా 841 పాయింట్లతోRead More


కోహ్లీకి షాకిచ్చిన నెటిజ‌న్లు

టీమిండియా సార‌ధి విరాట్ కోహ్లీకి విప‌రీత‌మైన‌ క్రేజ్ ఉంది. క్రికెట్ అబిమానులంతా అత‌డి సామ‌ర్ధ్యానికి స‌లాం చేస్తున్నారు. చెల‌రేగిపోతున్న ఆట‌తీరుతో అంద‌రినీ మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తున్న కోహ్లీకి అభిమానుల‌వుతున్నారు. అయితే తాజాగా కోహ్లీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఓ అభిమానిని ఉద్దేశించిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. కోహ్లీ ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మాట్లాడుతూ.. విరాట్‌ను ‘ఓవర్ రేటెడ్ ప్లేయర్’ అని వ్యాఖ్యానించాడు. అందరూ చెబుతున్న ప్రత్యేకత కోహ్లీలో తనకు కనిపించదని, భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ ఎంతో బాగుంటుందని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. భారత క్రికెటర్ల ఆట నచ్చనప్పుడు ఇండియాలో ఉండడానికి నీకు అర్హత లేదంటూ కోహ్లీ ఆగ్రహం వ్యక్తంRead More


కెప్టెన్, కుల్దీప్ టాప్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి తిరుగుండ‌డం లేదు. ఐదు వ‌న్డేల సిరీస్ లో కేవ‌లం నాలుగో వ‌న్డేలో మిన‌హా కోహ్లీ బ్యాట్ కి ఎదురు క‌నిపించ‌లేదు. విండీస్ బౌల‌ర్లంద‌రినీ విరాట్ ఓ ఆట ఆడుకున్నాడు. దాంతో ప‌రుగుల వేట లో టాప్ లో నిలిచాడు. రోహిత్ శ‌ర్మ కూడా అదే రీతిలో చెల‌రేగడంతో శిఖ‌ర్ ధావ‌న్ మిన‌హా టీమిండియా టాపార్డ‌ర్ స‌త్తా చాట‌డంతో సిరీస్ వ‌శం అయ్యింది. ఈ సిరీస్ లో కోహ్లీ 5 మ్యాచ్‌లు ఆడి, రెండు పర్యాయాలు నాటౌట్‌గా నిలిచి, మొత్తం 453 పరుగులు సాధించాడు. అజేయంగా 157 పరుగులు అతని అత్యధిక స్కోరు. రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో (రెండు నాటౌట్లు) 389 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 162 పరుగులు. షిమ్రన్ హేత్‌మేయర్ ఐదు మ్యాచ్‌ల్లో 259. టాప్ స్కోరుRead More


స‌చిన్ రికార్డ్ చెరిపేసే దిశ‌లో రోహిత్

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ మ‌రో రికార్డ్ కి చేరువ‌య్యారు. కొత్త రికార్డ్ కి అత‌డు ఒక్క సిక్సర్ దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 189 వన్డేలు ఆడిన రోహిత్ మొత్తం 194 సిక్సర్లు కొట్టాడు. 195 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌లలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ కనుక రేపటి వన్డేలో రెండు సిక్సర్లు కొడితే సచిన్ రికార్డు బద్దలవుతుంది. ఒకటి కొడితే ఆ రికార్డు సమం అవుతుంది. వరుసగా ఆరో ఏడాది 150కిపైగా పరుగులు చేసిన రోహిత్ ఇప్పటి వరకు 5 సార్లు ఆ ఘనత సాధించిన సచిన్‌ను వెనక్కి నెట్టేశాడు. ఇప్పుడు సిక్సర్ల రికార్డును కూడా సచిన్ నుంచి లాక్కోవాలని చూస్తున్నాడు. వన్డేల్లో రోహిత్ చేసిన 7217 పరుగుల్లో 627 ఫోర్లు, 194 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా అత్యధికRead More


స్టేడియంలోనే కోహ్లీకి ముద్దు

టీమిండియా కెప్టెన్ కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌య్యింది. విండీస్ తో హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్ లో విరాట్ ఉక్కిరిబిక్కిర‌య్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లి అభిమాని ఒకరు మైదానంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. కోహ్లికి కిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. యువకుడితో కోహ్లీ సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఉప్పల్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కడప జిల్లాకు చెందిన అహ్మద్‌ఖాన్(20)గా గుర్తించారు. కోహ్లీ మీద అభిమానంతోనే మైదానంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాడు.


స‌చిన్ త‌ర్వాత పృథ్వీ షా..!

ముంబై క్రికెట్ సంచ‌ల‌నం పృథ్వీ షా రికార్డుల ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లోనే కాకుండా అంత‌ర్జాతీయ‌ క్రికెట్ లోనూ అదే దూకుడు కొన‌సాగిస్తున్నాడు. విండీస్ తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తో ఆరంగేట్రం చేసిన పృథ్వీ షా అద‌ర‌గొట్టేశాడు. అద్భుత బ్యాటింగ్ తీరుతో అనేక రికార్డులు చేధించాడు. భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. ఆ క్ర‌మంలోనే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ న త‌ల‌పించిన పృథ్వీషా తొలి టెస్ట్ సెంచ‌రీతో స‌చిన్ త‌ర్వాతి స్థానం సాధించాడు. 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. 151 బంతులు ఆడిన షా 134ర‌న్స్ చేశాడు. దాంతో పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనేRead More


టాప్ 5లో ముగ్గ‌రు మ‌నోళ్ళే..!

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ గా ఆసియాక‌ప్ అందించిన రోహిత్ శ‌ర్మ అగ్రపీఠానికి చేరువ‌య్యాడు. కెరీర్ లో నే ఉత్త‌మ స్థానంలో నిలిచాడు. తాజాగా విడుద‌ల‌య‌న ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండోస్థానంలో నిలిచాడు. ఆసియా కప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ ఒక శతకం, రెండు అర్ధ శతకాలతో రాణించి మొత్తం 317 పరుగులు సాధించాడు. దీంతో 842 పాయింట్లతో రెండు స్థానాలు ఎగ‌బాకి రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ వన్డే బ్యాట్స్‌మెన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 884 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఆసియా కప్‌లో రెండు శతకాలతో మొత్తం 342 పరుగులు సాధించిన మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దాంతో టాప్ 5లో ముగ్గురు టీమిండియా ఆట‌గాళ్లే ఉండ‌డం విశేషం. అలాగే ఈRead More


సిరీస్ పోయినా అది మిగిలింది…!

ఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌న స్థానం కాపాడుకోగ‌లిగింది. టీమిండియా నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. కానీ పది పాయింట్లు కోల్పోయి 115 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లోనే ఉంది. నాలుగు మ్యాచ్‌లు స్వల్ప తేడాతోనే ఓడిపోవడంతో కోహ్లి సేన ఆగ్రస్థానాన్ని కాపాడుకుంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ రూపంలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్‌ 105 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సిరీస్‌కు ముందు 97 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు అంచనాలకు మించి ఆడటంతో న్యూజిలాండ్‌ జట్టును వెనక్కి నెట్టింది. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో రెండో స్ధానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా(106), న్యూజిలాండ్‌(102), శ్రీలంక(97), పాకిస్తాన్‌(88)జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ పరుగుల వరద పారించినRead More