tdp
టీడీపీలో మరో తగాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టకేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఓ అడుగు వేసింది. కీలక పదవులను కేటాయింపులు చేసింది. అయితే అందులో ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి వ్యవహారం పెద్ద తగాదాగా మారింది. మతం కోణంలో పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం వివాదాస్పదం చేశారు. అయితే దాని వెనుక టీడీపీలో వర్గపోరు కారణమని పలువురు భావిస్తున్నారు. టీటీడీ చైర్మన్ గిరీ ఆశించిన అనేకమంది ఆ పదవి దక్కకపోవడంతో పుట్టా సుదాకర్ యాదవ్ కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలకు ఇదో తార్కాణంగా భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేడి ఆర్టీసీ చైర్మన్ గిరీని తాకింది. తనకు ఇస్తానని చెప్పిన పదవి ఇవ్వకపోవడమే కాకుండా, గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలయిన వర్ల రామయ్యకు చైర్మన్ పదవి ఇచ్చి, తనకు రీజనల్ పదవి ఇవ్వడంపైRead More
టీడీపీని కాపాడాలంటూ ఆమరణదీక్ష

తెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేతలే రోడ్డెక్కారు. ఏకంగా ఆమరణదీక్షకు పూనుకున్నారు. దాంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే మూడు సార్లు వరుసగా ఓటమి పాలయిన తర్వాత కూడా పార్టీ నేతలు కళ్లు తెరవడం లేదని వాపోతున్నారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా అధిష్టానం స్పందించడం లేదంటూ ఆమరణదీక్షకు పూనుకున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రామిరెడ్డి దీక్షతో గుంటూరు జిల్లా నర్సారావుపేట టీడీపీ రాజకీయాలు రోడ్డున పడ్డాయి. ఒకప్పుడు కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 2004 నుంచి టీడీపీ ఓటమి పాలవుతోంది. 2014 ఎన్నికల తర్వాత ఇన్ఛార్జ్ ని నియమించడంలో పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. నేటికీ అది పూర్తిచేయకపోవడంతో జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, పార్టీ అధినేత చంద్రబాబు సహా అందరికీ కార్యకర్తలు పదేRead More
డ్యాన్లర్లతో కలిసి చిందేసిన ఏపీ మంత్రి

ఏపీ రవాణా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. నడిబజారులో ఆయన డ్యాన్సర్లతో కలిసి చిందేశారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. అమాత్య హోదాలో ఉన్న ఆయన అందకు భిన్నంగా వ్యవహరించారు. పెద్దరికం పక్కన పెట్టి మహిళా డ్యాన్సర్లతో అడుగులేశారు. డ్యాన్సర్లపై డబ్బులు కూడా విసిరుతూ రెచ్చిపోయారు. ఇప్పుడు అయ్యన్న డ్యాన్సుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఓవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంతా ఆందోళనలు సాగిస్తున్నారు. విపక్షాలు మండటెండల్లో కూడా నిరసనలు సాగిస్తున్నారు. అలాంటి సమయంలో మంత్రి ఇలాంటి వ్యవహారాలకు దిగడం విస్మయకరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి అనే విషయాన్ని మరచిపోయి ఇలా వ్యవహ రించడం సమంజసం కాదంటున్నారు. .మంత్రి తీరుపై నర్సీపట్నం నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఆనం పరిస్థితి విషమం

మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నేత ఆనం వివేకానంద రెడ్డి పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరాతీసిన చంద్రబాబు , స్వయంగా ఆయన్ని పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాకి చెందిన ఆనం వివేకానందరెడ్డి ఏపీ రాజకీయాల్లో ఓ భిన్నమైన నేత. వాక్చాతుర్యం, విచిత్ర వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే వారు. సుదీర్ఘకాలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ లో కొనసాగారు. కానీ రెండేళ్ల క్రితం మళ్లీ టీడీపీ గూటికి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తనయుడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఆనం బ్రదర్స్ గా నిత్యం రాజకీయ వర్గాల్లోRead More
బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!

కాంగ్రెస్ తో వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీ. కానీ మూడు దశాబ్దాల పరిస్థితులు అలానే ఉండాలని లేదు. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు నారా లోకేష్ రోజుల్లో సాగడం కష్టం. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని టీడీపీ మరోసారి నిజం చేస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ ని కౌగలించుకునే అవకాశాలున్నాయనే అంచనాలు పెరుగుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బలమైన పక్షం తనకు తోడుగా ఉండాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. మోడీ ని ఢీకొట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తో చేతులు కలపాల్సిన అనివార్య స్థితి చంద్రబాబుకి ఏర్పడినట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే టీడీపీ అడుగులు పడుతున్నాయి. కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ తో కలిసి టీడీపీ పార్లమెంట్ ముందు ఆందోళనలో పాల్గొంది. తాజాగా టీడీపీRead More
ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతల్లో అసహనం

టీడీపీ నేతలు ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న మండలిలో అద్దంకి నేత కరణం బలరాం ప్రశ్నలకు పాలకపక్ష నేతలు అవాక్కయ్యారు. ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయన సూటిగానే విమర్శించారు. దాంతో పాటు దొనకొండలో పరిశ్రమలు ఎందుకు పెట్టడం లేదంటూ నిలదీయడంతో అంతా ఖంగుతిన్నారు. దాని నుంచి తేరుకోకముందే తాజాగా మరో ఎమ్మెల్యే గొంతు విప్పారు. రైతు సమస్యలపై ఆయన ప్రశ్నలకు పాలకపక్షం నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. సమాధానం లేక సతమతం కావాల్సి వచ్చింది. రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకుRead More
లోకేష్ వ్యాఖ్యలను టీవీ9 ఎందుకు ప్రసారం చేసింది…?

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. 2014లో నాటి ప్రధాని మోడీ అంటూ, రాష్ట్ర విభజన జరకపోవడంతో టీడీపీ స్పందించిందంటూ టీవీ9 ఇంటర్య్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయవాడ టీవీ9 విలేకరి చేసిన ఇంటర్వ్యూలో సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను టీవీ9 ఎందుకు ప్రసారం చేసిందనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అది లైవ్ ఇంటర్య్యూ కాదు. అలాంటి సమయంలో కొంత ఎడిట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నేతలు తడబడిన సమయంలో వాటిని ప్రసారం చేయడం మీడియా చానెళ్లలో చాలా మామూలు విషయం. అలాంటిది నారా లోకేష్ రెండు మార్లు తడబడినా, దానిని యధాతథంగా ప్రసారంRead More
విశాఖలో వివాదం:టీడీపీకి మరో తలనొప్పి

ఇప్పటికే కర్నూలు జిల్లాలో కలహం రాజుకుంది. ఆళ్లగడ్డ సాక్షిగా అలజడి రేగుతోంది. అద్దంకి తగాదా చల్లారేలా కనిపించడం లేదు. కదిరి కలహం తీరదా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. అందుకు తోడుగా తాజాగా మరోసారి విశాఖ తీరంలో కూడా వివాదం తెరమీదకు వచ్చింది. ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య చాలాకాలంగా ఉన్న విబేధాలు చల్లారినట్టు కనిపించినప్పటికీ తాజాగా జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ (డీఎల్‌డీఏ) కమిటీ నియామకం పేరుతో ముందుకొచ్చాయి. తన మాటను ఖాతరు చేసినందుకు మంత్రి అయ్యన్న భగ్గుమంటున్నారు. ఏకంగా కలెక్టర్ మీద కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాజప్ప ఎదురుగా రగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో నర్సీపట్నానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాఘవేంద్రరావును చైర్మన్‌గా.. మరో 15 మందిని సభ్యులుగాRead More
అయ్యో..నారా లోకేష్!

ఏపీ సీఎం తనయుడు, నారా లోకేష్ నోరు జారడం ఆనవాయితీగా మారింది. అనేకసార్లు ఆయన మాట జారడంతో అభాసుపాలవుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఈసారి ఏకంగా అసెంబ్లీలోనే కావడం విశేషం. అది కూడా గ్రామీణ మంచినీటి ఫథకాలపై చర్చ సందర్భంగా లోకేష్ యధావిధిగా టంగ్ స్లిప్పయ్యారు. లఘు చర్చకు సమాధానంగా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని భావించినట్టు కనిపించింది. దాంతో నాపై వచ్చిన ఆరోపణల్లో అవాస్తవాలు లేవని పేర్కొన్నారు. అయినా బురదజల్లుతున్నారని వాపోయారు. దాంతో ఈ వ్యాఖ్యల అసలు అర్థం తెలిసిన సభ్యులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అవాస్తవాలు లేవంటే అర్థం అన్నీ వాస్తవాలేనని. అంటే లోకేష్ కి సంబంధించిన అవినీతి సహా వివిధ ఆరోపణలన్నీ నిజమని స్వయంగా మంత్రిRead More
ఎన్టీఆర్ ని టీడీపీలో ఎందుకు దూరం పెట్టారు?

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ కి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రచారం లేదు. 2009 ఎన్నికల తర్వాత ఒకటి రెండు మహానాడు వేదికల మీద దర్శనమిచ్చినప్పటికీ ఆయన ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీద కేంద్రీకరించారు. వరుస హిట్స్ తో ఊపుమీదున్నారు. అయితే ఆయన పొలిటికల్ ఫ్యూచర్ కి సంబంధించి ఓ సినీ నటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే టాలీవుడ్ లో లోకల్ కి అవకాశాలు దక్కడం లేదంటూ కామెంట్స్ తో మాధవీలత కలకలం రేపింది. అందుకు కొనసాగింపుగానే అన్నట్టుగా ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పై కామెంట్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడంRead More