Main Menu

tdp war

 
 

రోడ్డెక్కిన అనంత టీడీపీ

తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోట వర్గవిబేధాలతో కొంపు మునిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న అధికార పార్టీలో తాజాగా విబేధాలతో రోడ్డెక్కే పరిస్థితి రావడం కలకలం రేపుతోంది. అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల వైరం పెరుగుతోంది. అదే సమయంలో జేసీ బ్రదర్స్ వైఖరితో తాడిపత్రి తెలుగుదేశం నేతలు తల్లడిల్లిపోతున్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడికి పాల్పడడంతో ధర్నాలకు దిగే వరకూ పరిస్థితి వచ్చింది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాకముందు నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ పచ్చదండుతో జూనియర్ తమ్ముళ్ల తగాదా తారస్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ వర్గం హవా చెల్లుతుండడంతో చాలాకాలంగా జెండా మోస్తున్న నేతలంతా కలత చెందుతున్నారు. చివరకు జేసీ బ్రదర్స్ తోRead More