Main Menu

sri leaks

 
 

ఆమెను మీడియా వాడుకుందా…?

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏపీ అంత‌టా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం చెల‌రేగుతోంది. తెలంగాణాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఫ్రంట్ పెడ‌తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మీడియాలో ఓ సెక్ష‌న్ పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని సాధ‌నంగా మ‌ల‌చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లు విప్పి నిర‌స‌న తెలిపిన శ్రీరెడ్డికి ఓ మీడియా సంస్థ ప్ర‌తినిధులు అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు భావిస్తున్నారు. మహా టీవీలో ఈ నిర‌స‌న‌కు సంబంధించిన ప్ర‌చారం విస్తృతంగా సాగిన విష‌యం. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ప‌దే ప‌దే చ‌ర్చ‌లు సాగిన విష‌యం కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. అయితే శ్రీరెడ్డిRead More


శ్రీరెడ్డికి భారీ ఛాన్స్

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలంటూ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి వివిధ రూపాల్లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమెకు భారీ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజ‌న్ 2లో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌బోతున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ షోలో పాల్గొన‌డం కోసం ప‌లువురు ఆశావాహులు సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం శ్రీరెడ్డికి వ‌రించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె కోసం స్టార్ మా నిర్వాహ‌కులు సంప్ర‌దించ‌గా, ఆమె సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సీజ‌న్ లో బిగ్ బాస్ కోసం హైద‌రాబాద్ లోనే భారీ సెట్ వేయ‌బోతున్నారు. సీజ‌న్ వ‌న్ ని పూణేలో వేసిన ప్ర‌త్యేక ఇంటి సెట్ లో షూటింగ్Read More


మెగాస్టార్ పేరుతో…శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నం

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరుని ఆమె ప్ర‌స్తావించారు. ఆయ‌న పేరుతో ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు సాగిస్తున్న వ్య‌వ‌హారాల‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, హీరో నాని, ర‌చ‌యిత కోన వెంక‌ట్ వంటి వారిని ఈ వివాదంలోకి లాగిన శ్రీ రెడ్డి ఆ త‌ర్వాత ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు అభిరామ్ పోటోల‌ను కూడా రిలీజ్ చేసింది. ఇప్ప‌టికే శ్రీరెడ్డి కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ కూడా ప్రారంభ‌మ‌య్యింది. అందుకు కొన‌సాగింపుగానే అన్న‌ట్టుగా ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ అయిన వాకాడ అప్పారావు వ్య‌వ‌హారం తెర‌మీద‌కు తెచ్చింది. . ‘‘వాకాడ అప్పారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. ఇతను సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడమే కాకుండాRead More


శ్రీరెడ్డి సాధించింది…

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి పోరాటం ఫ‌లించింది. ఆమె ఉద్య‌మానికి ఫ‌లితం ద‌క్కింది. ఆమె డిమాండ్ కి మువీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త‌లొగ్గింది. మా లో శ్రీరెడ్డి మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా మా అధ్య‌క్షుడు శివాజీ రాజా ఈమేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. దాంతో శ్రీరెడ్డి ఆందోళ‌న‌కి మా దిగి వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ఇటీవ‌ల క్యాస్ట్ కౌచింగ్ పై శ్రీరెడ్డి సంచ‌ల‌నంగా మారింది. ఆమె న‌గ్నంగా నిర‌స‌న తెలప‌డానికి సిద్ధ‌ప‌డ‌డ‌మే కాకుండా, ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడి ఫోటోల‌ను కూడా లీక్ చేసింది. దాంతో టాలీవుడ్ ఉలిక్కిప‌డింది. తొలుత ఆమె నిర‌స‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయిన‌ప్ప‌టికీ , లీకుల కార‌ణంగా ప‌లువురి వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌నే ప్ర‌చారంతో వెన‌క్కి త‌గ్గింది. ఆమె మీద నిషేధాన్ని ఎత్తివేయ‌డ‌మే కాకుండా, క్యాష్ట్ కౌచింగ్ పై ఓ క‌మిటీ కూడా వేసింది. త‌ద్వారా శ్రీరెడ్డిRead More


ద‌గ్గుబాటి ప‌రువు బ‌జారుకీడ్చింది…

శ్రీ రెడ్డి. ఇప్పుడు టాలీవుడ్ లో ఈమె ఓ సంచ‌ల‌నంగా మారింది. న‌గ్నంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి దేశం దృష్టిని ఆక‌ర్షించింది. అంత‌కు ముందు శేఖ‌ర్ క‌మ్ముల‌, నాని వంటి వారి మీద సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ తో క‌ల‌క‌లం రేపింది. తాజాగా అంత‌కుమించిన బాంబ్ పేల్చింది. ద‌గ్గుబాటి సురేష్ వార‌సుడిని వీధికెక్కింది. ఇప్ప‌టికే ద‌గ్గుబాటి రానా వ్య‌వ‌హారం ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశం కాగా, తాజాగా శ్రీరెడ్డితో చ‌నువుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ద‌గ్గుబాటి అభిన‌య్ ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో కంప‌రం పుట్టిస్తోంది. వాస్త‌వానికి శ్రీరెడ్డి చాలాకాలంగా త‌న ప‌రిస్థితిని చెప్పుకుంటోంది. త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే పూర్తి ఆధారాలు బ‌య‌ట‌పెడ‌తానంటూ బెదిరించింది. అయినా చాలామంది స్పందించ‌లేదు. చివ‌ర‌కు న్యూడ్ నిర‌స‌న‌తో క‌ల‌క‌లం రేపింది. అయినా మువీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మాత్రం ఎదురుదాడికి దిగింది. దాంతో శ్రీరెడ్డి మ‌రింతRead More