special status

 
 

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

bjp

ఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌క స‌త‌మ‌తం అవుతోంది. ఏపీలో దాదాపు అన్ని పార్టీలు త‌మ‌నే టార్గెట్ చేశాయ‌ని వాపోతోంది. తాము ఎంతో చేస్తున్నప్ప‌టికీ, ప్ర‌చారం మాత్రం చంద్ర‌బాబు కొట్టేసి, త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్నార‌ని బాధ‌ప‌డుతోంది. దాంతో భ‌విష్య‌త్తు మీద కాషాయి శ్రేణులు బెంగ పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు త‌మ‌తో చేరిన ప‌లు త‌ర‌గ‌తులు దూరం అవుతున్నాయ‌ని ఆందోళ‌న చెందుతోంది. యువ‌త‌లో ఇప్ప‌టికే బీజేపీ ప‌రువు గంగ‌లో క‌లిసి పోయింది. ప‌ట్ట‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో బీజేపీ మీద ఆశ‌లు జావ‌గారి ఆగ్ర‌హం మొద‌ల‌వుతోంది. దాంతో ఇత‌ర పార్టీల నుంచి చేరిన నేత‌లు కూడా గోడ‌దూకే అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తోంది. వారిని నిల‌బెట్టుకోవ‌డం, త‌మ ఉనికిని కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా భావిస్తోంది. ఇప్ప‌టికేRead More


బాగా దాహంతో ఉన్న జనసేనాని!

pawan

ఈ మాట ఆయనే చెబుతున్నాడు. తనకు దాహం ఎక్కువ అంటున్నాడు. అయితే ఆ దాహార్తి మంచినీటి కోసం కాదని కూడా చెబుతున్నాడాయన. తన దాహం ప్రజల సమస్యల మీద అంటున్నారు. కొంతమందికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా సరిపోదని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. కానీ తనకు మాత్రం మరొక దాహం ఉందని తెలిపారు. అది అది ప్రజా సమస్యలను పరిష్కరించాలనే దాహమని ఆయన పేర్కొన్నారు. అనంతపూర్‌, రాయలసీమ, మొత్తం సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. ఎపికి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వరని, కొత్త ఉద్యోగాలను కల్పించరని, ఉన్న ఉద్యోగాలను తీసేస్తామని అంటారని ఆయన అన్నారు. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చర్చినీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన పదే పదే ప్రత్యేక హోదాని ప్రస్తావించడం ప్రారంభించారు. కొన్నాళ్ల పాటుRead More


అది జ‌గ‌న్ బ‌ల‌హీన‌తే..!

jagan

అవును…మాట ఇస్తే త‌ప్ప‌ని నేత‌గా ప‌దే ప‌దే చెప్పుకునే జ‌గ‌న్ తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జాతీయ ప్లీన‌రీ నిర్వ‌హించుకుని, వ‌చ్చే ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని కూడా జ‌గ‌న్ చెప్పేశారు. అంతేగాకుండా ఎన్నిక‌ల్లో గెల‌వ‌గానే ఏం చేస్తామ‌న్న‌ది ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను కూడా ఆయ‌న ప్ర‌క‌టించేశారు. ఏడాదిన్న‌ర ముందుగానే ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న‌ట్టు చెప్పేశారు. రెండు రోజుల పాటు జ‌రిగిన ప్లీన‌రీలో జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పేసిన అంశం మాత్రం ప్ర‌త్యేక హోదానే అని చెప్ప‌వ‌చ్చు. ఏపీ అభివృద్ధి కి హోదానే ముఖ్యం అని ప్ర‌క‌టించి రాష్ట్ర‌మంతా యువ‌భేరీ మోగించిన జ‌గ‌న్ ఇప్పుడు ప్లీన‌రీలో ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కుండానే ముగించేశారు. ఏకంగా పార్ల‌మెంట్ కి రాజీనామే చేస్తామ‌ని, హోదాకి మద్ధ‌తిచ్చే పార్టీకే కేంద్రంలో అండ‌గా నిలుస్తామ‌ని కూడా ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఇప్పుడు ఈ విష‌యాన్ని విస్మ‌రించ‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. దానికి కార‌ణంRead More


వైసీపీ జారిపోయిన‌ట్టేనా?

andhra_graph1467892388

ఏపీకి ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ఎజెండాగా ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. హోదాకి ఎవ‌రు ముందుకు వ‌స్తే వారికే త‌మ మ‌ద్ధతు ఉంటుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. కానీ అనూహ్యంగా ఇటీవ‌ల మోడీని క‌లిసిన స‌మ‌యంలో ఎటువంటి ష‌ర‌తులు లేకుండా బీజేపీకి త‌న మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డం ద్వారా జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఓవైపు టీడీపీ, బీజేపీ బంధంలో లుక‌లుక‌లు క‌నిపిస్తుంటే, మ‌రోవైపు జ‌గ‌న్ త్వ‌ర‌లో బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతారా అనే చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించారు. అయితే ప్ర‌త్యేక హోదా త‌న ప్ర‌ధాన ఎజెండా అని చెప్పిన వైఎస్ జ‌గ‌న్ మాత్రం తాజాగా దానిని విస్మ‌రించిన‌ట్టుగానే అంతా భావిస్తున్నారు. దానికి కార‌ణం మోడీతో మిలాఖ‌త్ త‌ర్వాత జ‌గ‌న్ లో వ‌చ్చిన మార్పు అని చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంట్ సీట్ల‌కు రాజీనామాలు చేస్తామ‌ని చెప్పినRead More


హోదా కోసం రోడ్డెక్కిన జ‌న‌సేన‌

janasena

జ‌న‌సేన ఉద్య‌మం మ‌రోసారి రోడ్డెక్కింది. ప్ర‌త్యేక హోదా నినాదాన్ని సాగ‌ర‌న‌గరంలో జ‌న‌సేన వినిపిస్తోంది. జీవీఎంసీ ఎదురుగా పెద్ద స్థాయిలో ఉద్య‌మం ప్రారంభించింది. సామూహిక ఆత్మ‌గౌర‌వ నిరాహార‌దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యింది. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ లో టీడీపీ ఎంపీల తీరును ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్ట‌డం, అదే స‌మ‌యంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కి ఆత్మ‌గౌర‌వ దీక్ష చేప‌ట్ట‌డం ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో హోదా అనేది ముగిసిన అధ్యాయ‌మంటూ చంద్ర‌బాబు, బీజేపీ నేత‌లు చెబుతుంటే , వైసీపీ ఎంపీల కృషిని ప‌వ‌న్ అభినందించిన విష‌యం కూడా ఆస‌క్తిదాయ‌క‌మే. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో ఆత్మ‌గౌర‌వ నిరాహార‌దీక్ష లో పెద్ద సంఖ్య‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. విశాఖ న‌గ‌రంలో జ‌న‌వ‌రి 26 ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మించాల‌ని చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌భుత్వం అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌తో పాటు వైసీపీRead More


వైసీపీని అభినందించిన ప‌వ‌న్

pawan in usa

జ‌న‌సేనాని మ‌రోసారి గొంతు విప్పారు. ఏపీ ప్ర‌జ‌ల డిమాండ్ కోసం పోరాడుతున్న విప‌క్ష వైఎస్సార్సీపీని అభినందించారు. ఓ వైపు తెలుగుదేశం ఎంపీల తీరు తీవ్రంగా త‌ప్పుబ‌డుతూనే మ‌రోవైపు విప‌క్ష వైసీపీని అభినందించ‌డం జ‌న‌సేన వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తుంద‌న‌డానికి సాక్ష్యాల‌నే వాద‌న వినిపిస్తోంది. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేక హోదా మీద జ‌రిగిన చ‌ర్చ‌లో తెలంగాణా ఎంపీల‌ను కూడా స‌మ‌ర్థించిన ఆయ‌న టీడీపీ నేత‌ల తీరును మాత్రం తీవ్రంగా నిర‌సించారు. సొంత‌లాభాల కోసం టీడీపీ ఎంపీలు తెలుగు ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ట్విట్ట‌ర్ పవ‌న్ పేర్కొన‌డం విశేషంగానే భావించాలి. ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంట్ లో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా టీడీపీ ఎంపీలు సైలెంట్ ఉండిపోవ‌డం దారుణ‌మ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. హామీల అమలు కోసం కూడా అడ‌గ‌లేరా అని నిల‌దీశారు. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని టీడీపీRead More


జూన్ లో రాజీనామాలే..!

jagan

జూన్ వ‌ర‌కే ఎదురు చూస్తామ‌ని..ఆ త‌ర్వాత రాజీనామాలు చేసి తీరుతామ‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఉద్య‌మం ఆపే ప్ర‌సక్తే లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదా మాట త‌ప్పిన విష‌యాన్ని దేశ‌మంతా ప్ర‌చారం చేస్తామ‌న్నారు. ఏపీకి హోదా వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని చెప్పిన‌వాళ్లే ఇప్పుడు అవ‌కాశ‌వాదంతో మాట మార్చేశార‌ని చంద్ర‌బాబును విమ‌ర్శించారు. అందుకే హోదా కోసం తాము పార్ల‌మెంట్ లో చివ‌రి వ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తామ‌న్నారు.. నీటి సంర‌క్ష‌ణ మీద చిత్త‌శుద్ది లేని చంద్ర‌బాబు ప్ర‌మాణాలు చేయించ‌డం సిగ్గు చేట‌ని వ్యాఖ్యానించారు. స‌భ‌లో రెచ్చ‌గొట్టేలా మాట్లాడి ప్ర‌మాణాలు చేయిస్తారా అని ప్ర‌శ్నించారు. ప్రోజెక్టుల విషయంలో కమిట్మెంట్ లేని వ్యక్తి ప్రతిజ్ఞలు చెయ్యడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. స్పీక‌ర్ కూడా స‌భ‌ను ఇష్టారాజ్యంగా న‌డుపుతున్నార‌ని విమ‌ర్శించారు. విప‌క్ష నేతRead More


ఏపీకి ఏమి ఇవ్వాలి? ప్యాకేజీతో ఏం ద‌క్కింది??

ap

ఏపీ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం ఉంది. దానికి తోడుగా పార్ల‌మెంట్ లో ప్ర‌భుత్వ హామీలున్నాయి. ఏపీకి కేంద్రం నెర‌వేర్చాల్సిన అనేక అంశాలున్నాయి. అందుకే ప్ర‌త్యేక హోదాను ఏపీ వాసులు అభివృద్ధికి ఆల‌వాలంగా భావిస్తున్నారు. హోదా ద‌క్కితే రాష్ట్రం కొత్త పుంత‌లు తొక్కుతుంద‌ని ఆశిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు చెప్పిన మాట‌ల ప్ర‌కారం త‌మ‌కు హోదా ద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ బీజేపీ ప్ర‌భుత్వం దానికి భిన్నంగా స్పందించ‌డం, టీడీపీ నేత‌లు వంత‌పాడ‌డంతో హోదా పోయి ప్యాకేజీ ముందుకొచ్చింది. గ‌డిచిన ఆరు నెల‌లుగా ప్యాకేజీ చుట్టూ సాగిన పెద్ద చ‌ర్చ త‌ర్వాత చివ‌ర‌కు దానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. దాంతో ఏదో సాధించామ‌న్న ప్ర‌చారం మొద‌ల‌య్యింది. నిజంగా ఈ ప్యాకేజీతో ఏపీకి ఏం మేలు జ‌రుగుతుంద‌న్న ఆస‌క్తి క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఏపీకి కావాల్సిన అంశాల‌కు, తాజా ప్యాకేజీకి పొంత‌న‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఏపీలో బ‌డ్జెట్Read More


హోదా లేదు ..రాదు..!

yanamala

‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము’ ఇది ఏపీ బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పిన మాట. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష, హక్కు అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నట్టు ఆయన ఈ ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పేశారు. ప్రత్యేక హోదా కోసం ఓ వైపు ప్రజలు  తీవ్రంగా పోరాడుతున్నప్పటికీ.. హోదాను వదిలేసి ప్యాకేజీ కోసం పాకులాడుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో యనమల ప్రకటన చేయడం విమర్శలకు తావిస్తున్నది.


హోదా కోసం బిల్లుతో వైఎస్సార్సీపీ

yv subba reddy

ప్ర‌త్యేక హోదా సాధ‌నే త‌మ ల‌క్ష్య‌మ‌ని చాటిన వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్ల‌మెంట్ లో పోరాటం ప్రారంభించింది. హోదా సాధ‌న కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలోని పార్టీ ఇప్పుడు ప్రైవేటు బిల్లుతో ముందుకొచ్చింది. లోక్ స‌భ‌లో ఆపార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. 15 ఏళ్ల పాటు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఆయ‌న బిల్లులో ప్ర‌భుత్వాన్ని కోరారు. వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ లో 40శాతం రాయితీ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్ర‌త్యేక హోదా ద్వారా ఆదుకుంటామ‌ని చెప్పిన కేంద్రం త‌న హామీ నిలబెట్టుకోవాల‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న సంద‌ర్భంగా పార్ల‌మెంట్లో ప్ర‌దాన మంత్రి చెప్పిన మాట‌ల‌ను వారు గుర్తు చేశారే. దాంతో ఇప్పుడీ బిల్లు చ‌ర్చ‌కు వ‌స్తే ఆస‌క్తి రేకెత్తించ‌వ‌చ్చు. గ‌తంలో కేవీపీ రామ‌చంద్రRead More