Main Menu

somireddy

 
 

ఆ హీరోయిన్ ని ప్రేమించానంటున్న మంత్రి

ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త జ్ఞాప‌కాలు నెమ‌ర‌వేసుకున్నారు. త‌న చిన్న‌త‌నంలో నాటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ వాణిశ్రీని ప్రేమించానంటూ చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లో త‌న‌కు వాణిశ్రీ అంటే వీరాభిమానం అంటూ ప్ర‌క‌టించారు. సౌత్ ఇండియన్ సినీ కల్చరర్ అసోసియేషన్ ప్రారంభోత్స‌వంలో మరో మంత్రి నారాయణతో కలిసి పాల్గొన్న వ్య‌వ‌సాయ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ‘‘ వాణిశ్రీకి నేను వీరాభిమానిని. ఆమె నటించిన సినిమాలు చాలా చూశా. అప్పటి సినిమాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలాయి. ’’అని పేర్కొన్నారు. దాంతో మంత్రి వ్యాఖ్య‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిన మంత్రి సోమిరెడ్డి తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్భంగా ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంబికా కృష్ణ మాట్లాడుతూ ‘‘ రూ.4 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకుRead More


మంత్రికి షాకిచ్చిన రైతులు

ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి రైతులు షాకిచ్చారు. ర‌చ్చ‌బండ పేరుతో ఆయ‌న నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రిని నిల‌దీశారు. ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌ల‌కు, చేస్తున్న ప‌నులకు పొంత‌న‌లేద‌న్న‌ట్టుగా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా రుణ‌మాఫీ వ్య‌వ‌హారంలో రైతులు నిల‌దీయ‌డంతో మంత్రి అవాక్క‌య్యారు. వారికి సర్ధిచెప్పాల్సి వ‌చ్చింది. క‌డ‌ప జిల్లా రామాపురం గ్రామంలో మంత్రి రైతుల‌తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన రైతులు, 2013లో తాము తీసుకున్న రుణం ఇంతవరకూ మాఫీ కాలేదని మంత్రిని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం వల్లే టీడీపీకి ఓట్లేశామన్నారు. దాంతో మంత్రి స్పందించారు. న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. త్వ‌ర‌లోనే రుణ‌మాఫీ నిధులు మొత్తం విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రాబోయే ఎనిమిది నెలల్లో రుణమాఫీ 4, 5 విడతలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన రైతులు ఉద్యానRead More


నారా లోకేష్ కి ఓటు లేదు..!

అవును…ఏపీ మంత్రిగా, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్ కి దేశ ప్ర‌ధ‌మ పౌరుడి ఎన్నిక‌లో భాగ‌స్వామిగా ఉండే అవ‌కాశం లేదు. లోకేష్ తో పాటు మ‌రో ముగ్గురు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అందులో సీనియ‌ర్లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, నారాయ‌ణ స‌హా మొత్తం న‌లుగురు ఏపీ మంత్రుల‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు లేదు. దానికి కార‌ణం వారంతా శాస‌న‌మండ‌లి స‌భ్యులు కావ‌డ‌మే. శాస‌న‌మండ‌లి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వారు ప‌రోక్ష ప‌ద్ధ‌తిలో ఎన్నిక కాబ‌డిన వారు కావ‌డంతో మ‌రోసారి ప‌రోక్ష ఎన్నిక‌ల‌కు వారికి ఓటు హ‌క్కు ఉండ‌దు. కేవ‌లం అసెంబ్లీకి ప్ర‌జ‌ల ద్వారా ఎన్నిక కాబ‌డిన వారు మాత్ర‌మే ఎల‌క్ట్రోల్ ఓట‌ర్ల జాబితాలో ఉంటారు. దాంతో నారా లోకేష్ కి అవ‌కాశం లేకుండా పోయింది. ఎన్డీయే అభ్య‌ర్థి రామ్Read More


మంత్రి సోమిరెడ్డికి షాక్

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేత‌లు బ‌హిరంగంగానే పార్టీ ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా అలాంటి ప‌రిణామ‌మే పార్టీ స‌మావేశంలో జ‌రిగింది. క‌డ‌పలో జ‌రిగిన స‌మావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ‌ర్సెస్ స‌తీష్ రెడ్డి అన్న‌ట్టుగా మారిన వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. పులివెందుల‌కు చెందిన స‌తీష్ రెడ్డి మాట్లాడుతూ చెక్క‌భ‌జ‌న చేయ‌డం కాద‌ని వ్యాఖ్యానించ‌డంతో సోమిరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క ప‌నయినా చేయాలంటూ సూచించారు. ఓట్లు తీసుకొచ్చే ప‌నులు చేయ‌కుండా ఊరికే ఎన్ని మాట‌లు చెప్పినా ఏం ప్ర‌యోజ‌న‌మంటూ నిల‌దీశారు. దాంతో స‌భ‌లో ఉన్న త‌మ్ముళ్లు చ‌ప్ప‌ట్లు కొట్టి స‌తీష్ రెడ్డికి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని సోమిరెడ్డి వెంట‌నే స‌తీష్ రెడ్డి మీద చిట‌ప‌ట‌లాడారు. అన్ని ఇక్క‌డేRead More


ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క‌తో ఆందోళ‌న‌

నెల్లూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు సాగుతున్నాయి. పొలిటిక‌ల్ స్టార్ గా పేరున్న ఆనం బ్ర‌ద‌ర్స్ అల‌క పాన్పు వీడ‌డం లేద‌ట‌. దాంతో టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేగుతోంది. వ‌రుస‌గా నేత‌లంతా రాయ‌బారాలు న‌డుపుతున్నారు. కొత్త మంత్రి సోమిరెడ్డి నుంచి మొద‌లుకుని పాత‌మంత్రి నారాయ‌ణ వ‌ర‌కూ ఆనం బ్ర‌ద‌ర్స్ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బీదా ర‌వి చంద్ర కూడా ఆనం వారితో చ‌ర్చ‌లు జ‌రిపి వ‌చ్చారు. అయినా సీన్ లో ఛేంజ్ క‌నిపించ‌క‌పోవ‌డం క‌ల‌త చెందేలే చేస్తోంది. వ‌రుస‌గా పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నుంచి చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు కూడా ఆనం వారు అంద‌నంత దూరంలో ఉండ‌డం నెల్లూరు టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ఉన్న ఆనం ఫ్యామిలీ మ‌ళ్లీ ఒక‌నాటి పాత స్నేహితుడుRead More


ఆనం తృప్తిగా లేరు..!

టీడీపీకి వ‌రుస త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. వ‌చ్చిన‌వారంద‌రినీ పార్టీలో చేర్చుకున్న చంద్ర‌బాబుకి ఇప్పుడు చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఓ వైపు పార్టీలో పాత నేల‌త‌కు, కొత్త‌గా చేరిన వారి మ‌ధ్య స‌మ‌స్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప‌ద‌వులు ఆశ‌చూపి పార్టీలో చేర్చుకున్న త‌ర్వాత సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోవ‌డంతో కొత్త నేత‌లు గుర్రుగా క‌నిపిస్తున్నారు. తాజాగా ఆనం బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హారం ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా రెండు నెల‌లుగా తెలుగుదేశం కార్య‌క్ర‌మాల‌తో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి తీరు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. అధిష్టానాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సోమిరెడ్డి చొర‌వ తీసుకున్నారు. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం ప్రారంభించారు. నేరుగా ఆనం ఇంటికి వెళ్లారు. వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. వివేకానంద‌రెడ్డితో స‌మావేశ‌మ‌య్యారు. పార్టీలో త‌గిన న్యాయం జ‌రుగుతుంద‌ని హామీRead More


పున‌రాలోచ‌న‌లో ఆనం బ్ర‌ద‌ర్స్..!

అంతా సాఫీగా ఉంటుంద‌ని ఆశ‌పెడితే అనుకోని ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. అధికార పార్టీ క‌దా అనుకుంటే అందుకు భిన్నంగా క‌నిపిస్తోంది. పిలిచి కండువా క‌ప్ప‌డంతో క‌ష్టాలు తీరిపోతాయ‌ని భావిస్తే కొత్త స‌మ‌స్య‌లు చుట్టిముట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. నెల్లూరు గ‌డ్డ మీద మ‌ళ్లీ మీసం మెలేద్దామ‌నుకుంటే మోస‌పోయామా అన్న సందేహం క‌లుగుతోంది. ఇలాంటి ఆలోచ‌న‌లే ఇప్పుడు ఆనం బ్ర‌ద‌ర్స్ ని తీవ్రంగా క‌ల‌చివేస్తున్నాయి. వ‌రుస‌గా చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అటు రామ‌నారాయ‌ణ రెడ్డి, ఇటు వివేకానంద రెడ్డి కూడా ఉలుకూ ప‌లుకూ లేకుండా ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఉసూరు మంటున్నారు. కాంగ్రెస్ లో సుదీర్ఘ‌కాలం పాటు చ‌క్రం తిప్పి, చివ‌ర‌కు సీఎం రేసులో కూడా పేరు ప‌రిశీల‌కు వెళ్లే స్థాయిలో సాగిన ఆనం బ్ర‌ద‌ర్స్ హ‌వా సాగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ కుదేలుకావ‌డంతో మ‌రోదారి లేక సైకిలెక్కేశారు. చంద్ర‌బాబు ఆహ్వానం అందుకుని టీడీపీలోRead More


సోమిరెడ్డికి మేలు చేసిన లీకేజీ…!

ఎట్ట‌కేల‌కు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ క్యాబినెట్ లో అడుగుపెట్ట గ‌లిగారు. ద‌శాబ్ధంన్న‌ర త‌ర్వాత మ‌రోసారి మంత్రి కాగ‌లిగారు. అయితే ఆ క్ర‌మంలో ఆయ‌న అనేక ఆటంకాలు అధిగ‌మించారు. ముఖ్యంగా తాజా క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు ఎదుర‌యిన అవ‌రోధాలు అన్నీ ఇన్నీ కావు. అయినా కీల‌క‌మ‌యిన నారాయ‌ణాస్త్రాన్ని కూడా చేధిచండంతో సోమిరెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. మ‌ధ్య‌లో బీసీ ని ప్ర‌యోగించి నెల్లూరు రెడ్ల‌కు ఛాన్స్ లేకుండా చేయాల‌ని భావించినా బాబు మాత్రం సోమిరెడ్డిని సెల‌క్ట్ చేసి, త‌న ప‌ట్ల ఉన్న విధేయ‌త‌కు కృత‌జ్ఞ‌త ప్ర‌క‌టించారు. చిన‌బాబు కాద‌న్నా పెదబాబు మాత్రం సోమిరెడ్డిని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సోమిరెడ్డి క్యాబినెట్ లోకి రావ‌డానికి ఇటీవ‌ల అసెంబ్లీలో ర‌చ్చ చేసిన పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం బాగా తోడ్ప‌డిన‌ట్టు భావిస్తున్నారు. నారాయ‌ణ సంస్థ‌ల్లో ప‌రీక్షా పత్రాలు లీక్ కావ‌డం,Read More


నెల్లూరు రెడ్ల‌కు షాక్?

అనూహ్య ప‌రిణామాలు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. సింహ‌పురి రాజ‌కీయాల్లో ఓ కొత్త సంచ‌ల‌నం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. మంత్రి నారాయ‌ణ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌తో నెల్లూరు రెడ్ల‌కు చెక్ ప‌డ‌డం ఖాయం అని భావిస్తున్నారు. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత గ‌డిచిన మూడేళ్లుగా నెల్లూరు రెడ్లు మంత్రు ప‌ద‌వులు లేక విల‌విల్లాడిపోతున్నారు. అన్నింటా చ‌క్రం తిప్పుతున్నా అమాత్య‌పద‌వి త‌మ‌కు లేద‌ని వారంతా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. అలాంటి వారంద‌రికీ సోమిరెడ్డిరూపంలో ఛాన్స్ ఖాయ‌మ‌ని ఇన్నాళ్లు భావిస్తుంటే ఇప్పుడు ఓ పెద్ద అడ్డంకి ముందుకొచ్చిన‌ట్టు స‌మ‌చారం. మంత్రి నారాయ‌ణ త‌న హ‌వా నిలుపుకోవాలంటే సోమిరెడ్డికి ఛాన్స్ రాకుండా చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సీనియ‌ర్ గా ఉన్న సోమిరెడ్డికి మంత్రి హోదా రాకూడ‌ద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా నారా లోకేష్ ద్వారా పావులు క‌దుపుతున్నారు. చంద్ర‌బాబు కొంత సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ నారాయ‌ణ ప‌ట్టుబ‌డుతుండ‌డంతో సీన్ మారిపోయినాRead More


సోమిరెడ్డికి కాకాణి కొత్త స‌వాల్

తనపై పోలీసులు పెట్టిన కేసులు వాస్తవంగా జరిగినవని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి కాణిపాకం సహా ఏ దేవాలయంలో ప్రమాణం చేసినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సవాల్‌ విసిరారు. తనపై పోలీసులు పెట్టిన కేసులు యదార్ధంగా జరిగిన సంఘటనలు అని ఏ దేవాలయంలోనైనా సోమిరెడ్డి ప్రమాణం చేయాలన్నారు. సోమిరెడ్డికి బినామీ పవర్‌ప్లాంట్‌లు ఉన్నాయని నేను ఏ దేవాలయంలో అయిన ప్రమాణం చేస్తా.. ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అక్రమంగా సంపాదించలేదని, తాను ఆర్ధికంగా దెబ్బతినిపోయానని సోమిరెడ్డి చెబుతున్నారని ఆయన పేరున ఒకటి, ఆయన కుమారుడు పేరున తొమ్మిది, ఆయన భార్యపేరున మూడు వెరసి 13 పవర్‌ప్లాంట్‌లు ఉన్నాయని వివరించారు. నుండి గెలిసి టీడీపీ శిభిరాల్లోRead More