Main Menu

sivalinga

 
 

హిజ్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ..!

త‌ల్లికి గుడిక‌ట్టినా, రైతుల కోసం రోడ్డెక్కినా, జ‌ల్లి క‌ట్టు జ‌గ‌డంలో ముందు నిలిచినా రాఘ‌వా లారెన్స్ ఓ సంచ‌ల‌నం. కోలీవుడ్, టాలీవుడ్ అన్న బేధం లేకుండా టాలెంట్ తో స‌త్తా చాటిన స్టార్. డ్యాన్స‌ర్ గా రంగ ప్ర‌వేశం చేసిన కొరియోగ్రాఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడు, హీరోగా మారి ఆల్ రౌండ‌ర్ గా నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడో ఆస‌క్తిక‌ర కామెంట్ తో మరోసారి తెర‌మీద‌కు రావ‌డం విశేషం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శివలింగ’. పి. వాసు దర్శకత్వంలో అభిషేక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రమేశ్ పి. పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా లారెన్స్ మీడియ‌కు చెప్పిన విశేషాలు ఆశ్చ‌ర్యంగా మారాయి. ‘‘మా ట్రస్ట్‌ తరపున హిజ్రాలూ పనిRead More