shilpa

 
 

నంద్యాలలో ఫ్యాక్షనిజం

Silpa_Chakrapani_Reddy

ఉపఎన్నికలు ముగిశాయ్ కానీ నంద్యాలలో వేడి తగ్గలేదు. ఉభయ పార్టీల నేతలు తాజాగా ప్రత్యక్షంగా రంగంలో దిగారు. దాడులకు పాల్పడ్డారు. పోలీస్ నిఘా వైఫ్యలంతో ఉద్రికత్తకు తెరలేపారు. సూరజ్ గ్రాండ్ హోటల్ ముందు టీడీపీ నేతల వీరంగం, వైసీపీ కార్యకర్తల ప్రతిదాడులతో ప రిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. కానీ అంతలోనే పోలీసులు అప్రమత్తం కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసహనంతో వ్యవహరించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. నిన్న జరిగిన పోలింగ్ తర్వాత ముగింపులోనే ఇరు వర్గాల మధ్య వేడిపుట్టింది. శిల్పా తనయుడితో భూమా వారసులు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంగా అభిరుచి మధు నోటికి పనిజెప్పడం దాని వివాదానికి మూలకారణంగా ఉంది. శిల్పా చక్రపాణి రెడ్డి తన అనుచరుడి అంత్యక్రియలు హాజరయిన సందర్భంలో వివాదం రాజుకోవడం వేడిపుట్టించింది. అభిరుచి మధుRead More


నంద్యాలలో వైసీపీకి పెరిగిన మద్ధతు

shilpa

నంద్యాలలో వైసీపీకి వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా సినీ అభిమాన సంఘాలు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి అండగా ఉంటామని చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ శిల్పాకి జై కొట్టారు. నంద్యాలలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అక్కినేని ఫ్యాన్స్ కూడా చేరారు. నాగార్జున అభిమాన సంఘం కూడా వైసీపీకి మద్ధతు ప్రకటించింది. ఉప ఎన్నికల్లో శిల్పాని గెలిపించాలని విజ్ఖప్తి చేసింది. నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించించింది. అక్కినేని అభిమానులు అందరూ శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కినేని ఫ్యాన్స్‌ ఆలిండియా అధ్యక్షుడు ఏవీ నాగరాజు విజ్ఞప్తి చేశారు.దాంతో పట్టణంలో నాగార్జున అభిమానులు కూడా శిల్పా విజయం కోసం క్యాంపెయిన్ ప్రారంభించే అవకాశాలుRead More


బాబుకి పరీక్ష పెట్టిన జ‌గ‌న్

jagan-ysrcp-tdp

చంద్ర‌బాబు కి ప‌రీక్షాకాలం ఆరంభ‌మ‌య్యింది. నైతిక‌త మూలాలు ఇప్పుడు ఆయ‌న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నంగా మారాయి. ఒక్క శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామా ద్వారా 21 మంది ఫిరాయింపుల విష‌యంలో చంద్ర‌బాబుని ఇర‌కాటంలోకి నెట్ట‌డంలో జ‌గ‌న్ విజ‌యం సాధించారు. ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో 21 మంది ఎమ్మెల్యేల‌కు తోడు ఎమ్మెల్సీలు స‌హా అనేక‌మందికి టీడీపీలో కండువాలు క‌ప్పి బాబు ఆహ్వానించారు. కానీ జ‌గ‌న్ మాత్రం త‌న పార్టీలో చేరాలంటే ముందు టీడీపీ ద్వారా సంపాదించిన ప‌ద‌విని రాజీనామా చేయాల‌ని చెప్ప‌డంతో తాను చేస్తున్నాన‌ని బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌క‌టించిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి తీరు వైసీపీకి నైతికంగా విజ‌యాన్ని సాధించిపెట్టింది. తెలుగుదేశం పార్టీని ఇబ్బందిల్లోకి నెట్టింది. రెండేళ్లుగా రాజీనామాలు చేయాలంటూ ప‌ట్టుబ‌డుతూ అటు అసెంబ్లీనూ, ఇటు న్యాయ‌స్థానంలోనూ పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్ త‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు ఉండ‌ద‌ని నిరూపించుకోవ‌డం ద్వారా చంద్ర‌బాబు కిRead More


జ‌గ‌న్ చెప్పారు..చేస్తున్నా..!

DGTa20xUMAI-ACX

నంద్యాల బ‌హిరంగ‌స‌భ‌లో శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి వీరావేశం ప్ర‌ద‌ర్శించారు. ఆట‌మొద‌ల‌య్యిందంటూ మొద‌లెట్టి..క‌మాన్ అంటూ స‌వాల్ చేశారు. అప్ప‌ట్లో భూమన్న‌…బుడ్డ‌న్న అంటూ మ‌మ్మ‌ల్ని వ‌దిలి దొంగ‌ల‌ను చేర్చుకున్నారంటూ జ‌గ‌న్ మీద కూడా వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో భూమా డ్రామాలు అంటూ కొత్త సినిమా మొదలెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఆళ్ల‌గ‌డ్డ వాళ్లు కావాలా..బ‌న‌గాన‌ప‌ల్లి అల్లుడు కావాలా..నంద్యాల బిడ్డ కావాలా అంటూ స‌వాల్ చేశారు. వైశ్యులు, మైనార్టీలు అంటున్నార‌ని, వాళ్లంద‌రి ఓట్లు త‌మ‌కేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్ఎండీ ఫ‌రూఖ్ వంటి ముగ్గురి కి ఉద్యోగాలిప్పించి, త‌న ఉద్యోగం ఊడ‌బీకింది జ‌గ‌న్ అంటూ సెటైర్ వేశారు. జ‌గ‌న్ వ‌ల్లే ఫ‌రూఖ్ వంటి వాళ్ల‌కు పోస్టులు వ‌చ్చాయ‌న్నారు. శిల్పా అంటేనే సంచ‌ల‌నం అని స్ప‌ష్టం చేశారు. తాము ఎన్న‌డూ ఎవ‌రికీ హాని చేయ‌లేద‌న్నారు. లోకేష్ మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌కు ఆశేRead More


జ‌గ‌న్ కి, బాబుకి తేడా లేన‌ట్టేనా?

jagan

సందేహం తీరిపోయింది. జ‌గ‌న్ హూందాత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫిరాయింపుల విష‌యంలో గ‌తంలో తాను చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డిని రాజీనామా చేయాల‌ని ఆదేశించ‌డం ఆశావాహంగా క‌నిపిస్తోంది. ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ జంప్ అయ్యేముందు విలువ‌ల‌కు కొంతైనా క‌ట్టుబ‌డి ఉండేలా జ‌గ‌న్ నిర్ణ‌యం దోహ‌దప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌ల పార్టీ ఫిరాయింపుల‌కు సంబంధించిన పెద్ద చ‌ర్చ సాగింది. వైసీపీ త‌రుపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. చివ‌ర‌కు కోర్టులో కూడా జోక్యం చేసుకున్నాయి. న‌లుగురు ఫిరాయింపు మంత్రుల‌కు నోటీసులు కూడా అందాయి. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ నేత‌లు త‌మ పార్టీలో గెలిచిన వారంద‌రినీ రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ అనేక మార్లు డిమాండ్ చేశారు. జ‌గ‌న్ కూడా ప‌దే ప‌దే ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. కానీRead More


నంద్యాల టీడీపీకి షాక్: వైసీపీలోకి ఎమ్మెల్సీ?

shilpa brothers

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో రాజ‌కీయాలు కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. ప‌లువురు నేత‌లు వైసీపీ వైపు క్యూ క‌డుతుండ‌డంతో టీడీపీ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఇటీవ‌ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే త‌న‌యుల‌తో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా మునిసిప‌ల్ కౌన్సిల‌ర్ గోడ‌దూకేశారు. ఇక ఈనెల 3న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌నలో వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డానికి ఎమ్మెల్సీ సిద్ధ‌ప‌డుతున్నార‌నే వార్త‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. తెలుగుదేశం నేత‌ల్లో గంద‌ర‌గోళం పెంచుతున్నాయి. శిల్పా బ్ర‌ద‌ర్స్ విడ‌దీయ‌లేనిది. సుదీర్ఘ‌కాలంగా క‌లిసే సాగారు. కానీ కొద్దిరోజుల క్రితం శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి మాత్రం తాను టీడీపీలోనేన‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మూడు నెల‌ల క్రిత‌మే జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటాలో వైసీపీ అభ్య‌ర్థి గౌరు వెంక‌ట‌రెడ్డిని ఆయ‌న ఓడించిన సంగ‌తి తెలిసిందే. అయితేRead More


నంద్యాల వైసీపీ వైపు కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు

nandyala

నంద్యాల‌లో వైసీపీ ఊపు కొన‌సాగుతోంది. వ‌రుస‌గా ఆ పార్టీలోకి ప‌లువురు నేత‌లు క్యూ క‌డుతున్నారు. తాజాగా టీడీపీకి ఝ‌ల‌క్ ఇస్తూ ఓ సీనియ‌ర్ కౌన్సిల‌ర్ వైసీపీలోకి జంప్ చేశారు. ఓవైపు వైసీపీ చైర్మ‌న్ ను పీఠం నుంచి దింపేస్తామ‌ని టీడీపీ పెద్ద‌లు హెచ్చ‌రిస్తుండ‌గా మ‌రో వైపు టీడీపీలో ఉన్న కౌన్సిల‌ర్లు కూడా వైసీపీ వైపు చేరుతుండం విశేషంగా మారుతోంది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కి మ‌ద్ధ‌తుగా నంద్యాల 12వ వార్డు కౌన్సిలర్ హనీఫ్ వైసీపీలో చేరారు. హనీఫ్ టీడీపీ నుంచి గెలుపొందారు. శిల్పా వైసీపీలోకి చేరిన నేపథ్యంలో హనీఫ్ తన అనుచరులు 250 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికకుRead More


శిల్పాకి సానుకూలంగా మారుతున్న సీన్..!

shilpa

ఉప ఎన్నిక‌లంటే స‌హ‌జంగానే పాల‌క‌ప‌క్షానికి ప‌లు అవ‌కాశాలుంటాయి. అధికారం చేతుల్లో ఉంటుంది కాబ‌ట్టి అన్ని ర‌కాలుగానూ వినియోగించుకుని గ‌ట్టెక్కే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే తాజాగా నంద్యాల ఉప ఎన్నిక‌ల ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఇక్క‌డ పాల‌క‌ప‌క్షం కంటే ప్ర‌తిప‌క్షానికి అనుకూలంగా మారుతోంది. అదికార పార్టీ ఎదురీత సాగించాల్సి వ‌స్తోంది. దానికి అనేక కార‌ణాలున్నాయి. అందులో ప్ర‌ధానంగా శిల్పా లోక‌ల్ కాగా, టీడీపీ నేత‌లంతా నాన్ లోక‌ల్ కావ‌డం విశేషం. నంద్యాల ప‌రిధిలో నంద్యాల మునిసిపాలిటీ, రూర‌ల్,గోస్పాడు మండ‌లాలున్నాయి. కానీ అందులో నంద్యాల మునిసిపాలిటీదే పెద్ద పాత్ర‌. దాదాపుగా 80వేల ఓట్లు మునిసిపాలిటీ ప‌రిధిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లంతా నంద్యాల ప‌రిధిలో లేరు. చివ‌ర‌కు అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి స‌హా అంద‌రూ ఆళ్ల‌గ‌డ్డ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. మంత్రులు, పార్టీRead More


నంద్యాల ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? UpdateAP సర్వే

nandyala

ఏపీలో ఇప్పుడు అంద‌రి క‌ళ్లు నంద్యాల వైపే ఉన్నారు. అంద‌రి కార్లు అటే మ‌ళ్లుతున్నాయి. నేత‌లంద‌రికీ నంద్యాలే మైలురాయిగా మారింది. అధికార, ప్ర‌తిప‌క్షాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్రీక‌రిస్తున్నాయి. రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు నంద్యాల డ్ర‌స్ రిహార్సిల్ గా భావిస్తున్నారు. నంద్యాల ఎన్నిక‌ల్లో ప‌ట్టు కోల్పోతే ఇక ఏపీ రాజ‌కీయాల్లో ప‌ట్టు సాధించ‌డం క‌ష్ట‌మ‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే స‌ర్వం ఒడ్డి పోరాడాని చూస్తోంది. అధికారాన్ని పూర్తిగా వినియోగిస్తోంది. భారీ తాయిలాల‌తో, అభివృద్ధి మంత్రంతో ముందుకెళుతుంది. సాధార‌ణ నేత‌ల‌ను త‌న వైపు తిప్పుకోవాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు ఈ ప‌నిలో య‌మ బిజీగా ఉన్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా పూర్తిగా అండ‌దండ‌లు అందిస్తుండ‌డంతో ఆశ‌లు పండుతాయ‌ని భావిస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఓవైపు జ‌గ‌న్ ఫాలోయింగ్ ఉండ‌గా, తాజాగా పార్టీలో చేరినRead More


నంద్యాల‌లో ఆప‌రేష‌న్ శిల్పా

shilpa jagan

నంద్యాల ఉపఎన్నికలో వైకాపా అధినేత జగన్ కంటే ఎక్కువగా ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని దృష్టిలో ఉంచుకుని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల శాసనసభా స్థానానికి జరగనున్న ఉపఎన్నికను సిఎం చంద్రబాబు స్వీయ ప్రతిష్టగా తీసుకున్నారు. నంద్యాలలో విజయం కోసం ఆయన వీలైన ప్రతి సందర్భంలో సమీక్షిస్తూ పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. పార్టీ సమన్వయ సమావేశం తరువాత ప్రత్యేకంగా నంద్యాల ఉప ఎన్నికపై చర్చించడం విశేషం. ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా ఎన్నికలు అనివార్యమని తేలడంతో చంద్రబాబు ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా అందరినీ కలిపి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా మోహనరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సమయంRead More