Main Menu

saina nehwal

 
 

సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

సీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్ బ్యాడ్మింట‌న్ విభాగంలో ఈ ఇండియ‌న్ ష‌టిల‌ర్లును ఫైనల్స్ లో త‌ల‌ప‌డ్డారు. చివ‌ర‌కు సైనాని విజ‌యం వ‌రించింది. గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది. సిల్వ‌ర్ తో సింధు స‌రిపెట్టుకుంది. అప్ప‌ట్లో ఒలింపిక్స్ లో కూడా సింధుకి సిల్వ‌ర్ ద‌క్క‌డం విశేషం. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 3 గా ఉన్న పీవీ సింధుపై సైనా నెహ్వాల్ వ‌రుస సెట్ల‌లో విజ‌యం సాధించింది. 21-18, 23-21 తేడాతో గెలిచింది. తొలి సెట్ సునాయాసంగా గెలుచుకున్న‌ప్ప‌టికీ, రెండో సీట్ లో హోరాహోరీ పోరు సాగింది. అయినా చివ‌ర‌కు సైనా పై చేయి సాధించింది. సైనా విజ‌యం ప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రు భార‌తీయ స్టార్ల‌కు గోల్డ్, సిల్వ‌ర్ ద‌క్క‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తంRead More


సైనాకి అనుష్క కానుక..

సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ షిప్ లో ఇటీవల విజయం సాధించిన ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రత్యేక కానుక పంపారు. ‘నుష్’ పేరుతో టెక్స్ టైల్ వ్యాపార రంగంలోకి అనుష్క అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమ సంస్థకు చెందిన కొన్ని వస్త్రాలను అందమైన ప్యాక్ లో ఉంచి వాటిని కానుకగా సైనాకు పంపారు. ఈ విషయాన్ని సైనా తన ట్విట్టర్లో తెలిపారు. ‘అనుష్క శర్మకు ధన్యవాదాలు. ఈ దుస్తువుల‌ను త్వరలోనే ధరిస్తా. ‘నుష్’ సంస్థ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మీకు శుభాకాంక్షలు’ అని సైనా తన ట్వీట్ లో పేర్కొన్నారు.


సైనాకి షాక్

ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్స్ మ‌ధ్య స‌మ‌రం ఆస‌క్తి రేపింది. అయితే సీనియ‌ర్ సైనాని సింధు ఖంగుతినిపించ‌డం ఆస‌క్తిక‌రం తొలిసారి. సింధుకి సైనాపై ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. ఇండియన్ ఓపెన్ సిరీస్ 2017 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధూ నెగ్గింది. దీంతో ఇండియన్ ఓపెన్ సిరీస్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధూ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది.


మకావు నుంచి మకాం మార్చేసింది…

సైనా నెహ్వాల్‌, భారత ఏస్‌ షట్లర్‌,ప్రస్తుతం మకావు ఓపెన్‌ నుంచి వెనుదిరిగింది.వివరాల్లోకి వెళితే, ఇవాళ క్వార్టర్స్‌ ఫైనల్లో జహంగ్‌ ఇమన్‌ (చైనా)తో తలపడిన సైనా నిలదొక్కుకోలేకపోయింది. తొలిసెట్‌‌ను జాంగ్ సునాయసంగా గెలిచినా .. రెండో సెట్‌‌లో సైనా అధ్బుతంగా ఆడినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ఆఖరికి జహంగ్‌‌తో పోరాడి ఓడింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సైనాకు మరోసారి నిరాశ ఎదురైంది. కేవలం 35నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో రెండు వరుస గేముల్లో 12-21, 17-21 తేడాతో సైనా ఇంటి బాటపట్టింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ సైనా 17-21, 21-18, 21-12తో దినార్‌ ద్యాహ్‌ ఆయుస్టైన్‌ (మలేసియా) పై కష్టపడి నెగ్గినా ఫలితం లేకపోయింది. తాజా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో సిల్వర్ స్టార్ సింధు ఏడవ ర్యాంకు దక్కించుకోగా.. సైనా పదో స్థానంలో నిలిచినRead More


సైనాకు అనూహ్య ఛాన్స్.!

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసి) అథ్లెటిక్స్‌్‌ కమీషన్‌లో సభ్యురాలిగా సైనా నియామకం పొందింది. ఈ మేరకు ఐవోసి అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ నుంచి ఆమె రాతపూర్వకంగా లెటర్‌ను స్వీకరించింది. అథ్లెటిక్స్‌ కమీషన్‌ అధ్యక్షుడిగా అంగెలా రుగియిరోతో పాటు తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, మరో 10 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమీషన్‌ నవంబర్‌ 9న సమావేశం కానుంది. మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌ బరిలో దిగి క్వార్టర్‌ దశలోనే ఇంటి ముఖం పట్టిన సైనా ఆగస్టులోనే మోకాలికి ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెల్సిందే. ఆమె కోలుకుంటోంది. నవంబర్‌ మొదటి వారంలో ఆమె తిరిగి రాకెట్‌ పట్టనుంది. ఒలింపిక్‌ ప్యానల్‌లో సైనా ఎంపిక కావడంపై ఆమె తండ్రి హర్‌వీర్‌ సింగ్‌ ఆనందం వ్యక్తంRead More


ఆస్ప‌త్రిలో సైనా..!

భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మోకాలి గాయంతో ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల క్రితం ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్టు సైనా నెహ్వాల్ తండ్రి హరవీర్ సింగ్ తెలిపారు. రియో ఒలింపిక్స్ లో మరియా ఉలిటినా (ఉక్రెయిన్)తో జరిగిన మ్యాచ్ లో ఆమె గాయపడిందని చెప్పారు. మోకాలి గాయానికి చికిత్స చేయించుకుంటోందని వెల్లడించారు. ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టు వివరాలు డాక్టర్లు ఇంకా వెల్లడించలేదన్నారు. మెరుగైన చికిత్స కోసం సైనాను శుక్రవారం హైదరాబాద్ నుంచి ముంబైకు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. రియో నుంచి ఈ నెల 16న సైనా తిరిగొచ్చింది. తర్వాతి రోజే ఆస్పత్రిలో చేరింది. గాయాన్ని దాచి రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన సైనా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది


సైనా ఓట‌మి:మెడ‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఉక్రెయిన్ కు చెందిన మరియా యులిటిన చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. 18-21, 19-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం పాలైంది. దీంతో సైనా నెహ్వాల్ ఒలింపిక్ పతకం ఆశలు గల్లంతయ్యాయి.