RESERVATION

 
 

కాపులు మళ్ళీ కాలుదువ్వుతున్నారు..

Mudragada

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26న కాకినాడలో కాపు నాయకుల సమావేశం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ సమావేశంలో ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణ, జేఏసీ ఏర్పాటుపై చర్చిస్తామని  ముద్రగడ పద్మనాభం తెలిపారు. పలువురిని కాప నేతలను కలుసుకునేందుకు బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26న జరిగే కాపు నాయకుల సమావేశానికి ప్రతి గ్రామం నుంచి పది మంది నాయకులు రావాలని కోరారు. అరెస్టులకు భయపడవద్దని, కాపు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మేల్కొనేలా చేయడమే దీని ఉద్ధేశ్యమని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కాపులకు సంక్రమించే అన్ని హక్కులను కలిసికట్టుగా సాధించుకుందామన్నారు. న్యాయబద్ధంగా, శాంతియుతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయమైన హక్కుల సాధనకు కాపు సామాజికవర్గమంతా ఉద్యమానికి మద్దతుగా ఉండాలని ఆయన కోరారు.


హైకోర్టు ఇచ్చిన జలక్ ప్రభుత్వానికా.. పేదలకా..

LAW

పటేళ్ల ఆందోళన నేపథ్యంలో రిజర్వేషన్‌ లేని కేటగిరీలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత మే లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్‌ కోటాను కల్పిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు తిరస్కరించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. అయితే ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు పది శాతం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను తిరస్కరించింది. ఈ ఆర్డినెన్స్‌ వల్ల రిజర్వేషన్‌ లేని వర్గాల వారికి సీట్లు తగ్గిపోతాయని.. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశానికి ఇది వ్యతిరేకమన్న పిటిషన్‌ దారుల వాదనను కోర్టు సమర్థించింది. అయితే ప్రభుత్వం మాత్రం తన వాదననుRead More