Main Menu

RECORDS

 
 

ఖైదీ కొత్త రికార్డ్

chiranjeevi Khaidi-No.-150-Satellite-Deal-Closed

చిరంజీవి చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా దక్షిణాది చిత్రాల్లో బిగ్గెస్ట్‌ గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు కెక్కిందని ఆ సినిమా నిర్మాత రామ్‌ చరణ్‌ పేర్కొన్నారు. 50 రోజుల్లో బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రూ.77 కోట్లు కలెక్ట్‌ చేస్తే..’ఖైదీ నంబర్‌ 150′ ప్రపంచ వ్యాప్తంగా 54 రోజుల్లో రూ.164 కోట్లు వసూలు చేసిందని చెర్రీ ప్రకటించారు. ఒకే ఒక్క భాషలో విడుదలై ఇంత భారీ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించిన సౌత్‌ సినిమా ఇదే కావడం విశేషమన్నారు. తమిళ్‌ చిత్రం ‘కత్తి’కి ఇది తెలుగు రీమేక్‌. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించారు. తొమ్మిదేళ్ల అనంతరం చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .


కోహ్లీని దాటగల మొనగాడు వచ్చేసాడు..

Virat-Kohli

విరాట్ కోహ్లీ, ఇండియా సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్. పరుగుల వరద పారించడం అతనికి అలవాటు. సెంచరీలు తేలికగా చేయగలడు. మొన్న మోహాలిలో న్యూజిలాండ్‌పై జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీ తన వన్డే కెరీర్‌లో 26వది. అయితే ఇన్ని శతకాలను కోహ్లీ కేవలం 174 మ్యాచ్‌లలో సాధించాడు. అత్యధికంగా 49 వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ వాటిని 463 మ్యాచ్‌లలో సాధించాడు. మరి కోహ్లీకి దీటైన పోటీ ఇవ్వగల, చెప్పాలంటే దాటగల సత్తా ప్రస్తుత క్రికెటర్లలో ఒకరికి మాత్రమే ఉందని చర్చ నడుస్తోంది. అతను సౌతాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా. కేవలం 140 మ్యాచ్‌లలోనే 23 వన్డే సెంచరీలు చేశాడు ఆమ్లా. చాలా తక్కువ మ్యాచ్‌లలోనే ఎక్కువ సెంచరీలు చేసి, కోహ్లీని సైతం అధిగమించగల ఏకైక ఆటగాడిగాRead More


రూ. 100 కోట్ల క్లబ్‌లో’గ్యారేజ్‌’ ..

ntr

విడుదలైన వారం రోజులకే ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.ఇక వివరాల్లోకి వెళితే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం విశేషమైన వసూళ్లను రాబడుతోంది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండో వారంలో రూ. 100 కోట్లు వసూలు చేసిందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత బాక్సాఫీసు వద్ద అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్‌’ రికార్డు సృష్టించినట్లు సమాచారం. మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. సమంత, నిత్యా మేనన్‌ కథానాయికలుగా నటించారు. ఇందులో ప్రకృతిని ప్రేమించే కుర్రాడిగా ఎన్టీఆర్‌, మనుషులను ప్రేమించేRead More


మోదీ ‘సూటు’ గిన్నిస్ రికార్డు…

SUIT

ఆ సూటు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.అయితేనేం చివరికి గిన్నిస్ రికార్డును కొట్టేసింది.అదేనండి..ఆమద్య అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు మోడీ ధరించిన సూట్ గుర్తుంది కదూ. అప్పట్లో అంత ఖరీదైన సూటు ధరించడంపై మోదీపై విపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. ఇప్పుడు ఆ సూటు ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా ఈ రికార్డును మోదీ సూట్ దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 20న దీన్ని వేలానికి ఉంచగా గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్‌లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ అత్యధిక బిడ్ వేసి దీన్ని సొతం చేసుకున్నారు. ఈ సూటు రూ.4.31 కోట్లు పలికింది. బేస్ ప్రైజ్ 11 లక్షలు కాగా, అత్యధిక బిడ్ వేసి దానిని సొంతం చేసుకున్న లాల్జీబాయ్….వేలంలో రూ.5 కోట్లు దాటినా దానిని దక్కించుకుతీరాలనిRead More


‘రియో’ సంచలనాలు…

Rio-Olympics

రియో ఒలింపిక్స్‌లో ఆరో రోజు మొత్తం 11 క్రీడల్లో పతక పోటీలను నిర్వహించారు. ఇప్పటి వరకు అమెరికా 16 స్వర్ణాలు, 12 రజతాలు, 10 కాంస్యాలతో అగ్రస్థానంలో.. చైనా 11 స్వర్ణ, 8 రజత, 11 కాంస్య పతకాలతో ద్వితీయ స్థానంలో, జపాన్‌ 7 స్వర్ణ, 2 రజత, 13 కాంస్య పతకాలతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నాయి. బంగారు భామలు రియో ఒలింపిక్స్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్ల స్విమ్మింగ్‌లో అమెరికా స్విమ్మర్‌ సిమోన్స్‌, కెనడా స్విమ్మర్‌ ఒలెక్సికాలు ఇద్దరు ఒలింపిక్‌ రికార్డు బద్దలు కొట్టారు. వీరిద్దరు కచ్చితంగా 52.70 సెకన్లకు లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో ఇద్దరికీ స్వర్ణాలను బహూకరిచి మూడోస్థానంలో ఉన్న సారాకు కాంస్యం అందజేశారు. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ పోటీల్లో ఇటువంటి ఘటనేRead More