Main Menu

pv sindhu

 
 

సింధు, ఉపాస‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు

ఇండియన్ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుకి మ‌రో గుర్తింపు ద‌క్కింది. బ్యాడ్మింట్ సంచ‌లంగా, ప్ర‌పంచ రెండో ర్యాంక‌ర్ గా నిలిచిన సింధుని టైకూన్స్ ఆఫ్ టుమారో లిస్టులో చేర్చారు. ఫోర్బ్స్‌ ఇండియా తొలిసారిగా ఈ లిస్ట్ విడుద‌ల చేసింది. ఈ ‘టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో’ జాబితాలో ఒలింపిక్‌ పతక విజేత, తెలుగు షట్లర్‌ పీవీ సింధు తో పాటుగా అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ ఉపాసన కొణిదెలకి కూడా చోటు దక్కింది. వ్యాపార, చిత్ర, క్రీడా రంగాల్లో గొప్ప ఘనతలు సాధించిన 22 మందితో ఫోర్బ్స్‌ ఈ జాబితా రూపొందించింది. క్రీడా రంగంనుంచి సింధుకు మాత్రమే చోటు లభించడం విశేషం. ఉపాస‌న కి ల‌భించిన గుర్తింపుతో రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్లో ఆనందం క‌నిపిస్తోంది.


సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు

సీనియ‌ర్ సాధించింది. సైనా నెహ్వాల్ గెలిచింది. పీవీ సింధు ని ఓడించింది. కామ‌న్ వెల్త్ గేమ్స్ లో ఉమెన్ బ్యాడ్మింట‌న్ విభాగంలో ఈ ఇండియ‌న్ ష‌టిల‌ర్లును ఫైనల్స్ లో త‌ల‌ప‌డ్డారు. చివ‌ర‌కు సైనాని విజ‌యం వ‌రించింది. గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకుంది. సిల్వ‌ర్ తో సింధు స‌రిపెట్టుకుంది. అప్ప‌ట్లో ఒలింపిక్స్ లో కూడా సింధుకి సిల్వ‌ర్ ద‌క్క‌డం విశేషం. వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 3 గా ఉన్న పీవీ సింధుపై సైనా నెహ్వాల్ వ‌రుస సెట్ల‌లో విజ‌యం సాధించింది. 21-18, 23-21 తేడాతో గెలిచింది. తొలి సెట్ సునాయాసంగా గెలుచుకున్న‌ప్ప‌టికీ, రెండో సీట్ లో హోరాహోరీ పోరు సాగింది. అయినా చివ‌ర‌కు సైనా పై చేయి సాధించింది. సైనా విజ‌యం ప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రు భార‌తీయ స్టార్ల‌కు గోల్డ్, సిల్వ‌ర్ ద‌క్క‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తంRead More


పీవీ సింధు కొత్త చరిత్ర

స్టార్ షట్లర్ పీవీ సింధూ మరో చరిత్ర స్రుష్టించింది. బ్యాడ్మింటన్ రంగంలో ఇండియా తరుపున గతంలో ఎవరూ సాధించలేని ఫీట్ సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటింది. ప్రత్యర్థులను సునాయాసంగా మట్టికరిపిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధు ఇప్పుడు మరోసారి సెమీస్ లో అడుగుపెట్టింది. మూడో పతకం ఖాయం చేసుకుని చరిత్రకెక్కింది. క్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ సన్‌ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో సింధు విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్‌యూ నిలవలేకపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


వెండితెర‌పైకి పీవీ సింధు బ‌యోపిక్

పీవీ సింధు… పరిచయం చేయనక్కర్లేని పేరు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మారుమోగిన పేరుగనుక. ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జీవితం వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ మధ్య ప్రముఖుల జీవిత గాథలు సిల్వర్‌ స్క్రీన్‌పై అలరిస్తున్నాయి. భారీ కలెక్షన్లూ వసూలు చేస్తున్నాయి. గొప్పవారి జీవితాలను వెండితెరపై చూపించడం ద్వారా ఒక పక్క చాలా మందికి స్ఫూర్తిగా మరో పక్క నిర్మాతలు కమర్షియల్‌గా సక్సెస్‌నూ సాధిస్తున్నారు. మొన్నొచ్చిన ‘దంగల్‌’ ఆ తరహా చిత్రమే. త్వరలో వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో ప్రియాంక చోప్రా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఒలింపిక్స్‌లో దేశానికి సిల్వర్‌ మెడిల్‌ సాధించిన షెట్లర్‌ పీవీసింధు బయోపిక్‌ కూడా వెండితెరపై రాబోతుంది. ఈ చిత్రాన్ని నటుడు సోను సూద్‌ నిర్మించనున్నారని ప్రకటించారు. సింధుగా ఎవరు నటిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పి.వి.Read More


ఎన్నిక‌ల్లో పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది. మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగి యగా ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు ఎన్నికల బరిలో మిగిలారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత్‌ నుంచి అంతగా పేరులేని డబుల్స్‌ ఆటగాడు నిఖర్‌ గార్గ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడు గతేడాది మేలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ సంఘాల ద్వారా కాకుండా నేరుగా రిజిష్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని బీడబ్లు్యఎఫ్‌ కల్పించాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్రారంభించాడు. ఇక మొత్తంగా పోటీపడుతున్న తొమ్మిది మంది నుంచి ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో ఎంపికవుతారు.Read More


కెరీర్ టాప్ కి చేరిన సింధు

ఒలింపిక్‌ రజత పతక విజేత, హైదరాబాదీ అమ్మాయి పివి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో అద్వితీయంగా నిలిచింది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సింధు నెంబర్‌ టూకు చేరుకుంది. 21 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ తర్వాత ఏకంగా మూడు ర్యాంకులు పైకి ఎగబాకటం విశేషం. చైనీస్‌ తైపీకి చెందిన తాయి టిజు యింగ్‌ (87911) నెంబర్‌ వన్‌గా నిలవగా సింధు (75759) పాయింట్లతో రెండో ర్యాంకుకు చేరుకుంది. స్పెయిన్‌ స్టార్‌ షట్లర్‌ కరోలినా మారిన్‌ (75664)తో మూడు ర్యాంకుకు దిగజారింది. ఇటీవల భారత్‌లో జరిగిన ఇండియా సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ ఓడించడంతోనే ప్రధానంగా అత్యున్నత ర్యాంకుకు సింధు చేరుకోగలిగింది. మాజీ నెంబర్‌ వన్‌ సైనా నెహ్వాల్‌ ఎనిమిదో ర్యాంకు నుంచి తొమ్మిదికి దిగజారింది. 2015 ఏఫ్రిల్‌ నెలలో నెంబర్‌ వన్‌ స్ధానాన్నిRead More


ఛాంపియ‌న్ పై ప్ర‌తీకారం తీర్చుకున్న సింధు

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా మారిన్‌(స్పెయిన్) పై 21-19, 21-16 తేడాతో సింధు(భారత్) నెగ్గింది. దీంతో గతేడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌ ఆరో ప్రయత్నంలో హైదరాబాద్‌ అమ్మాయి సింధు టైటిల్‌ కలను నిజం చేసుకుంది. తొలి గేమ్‌ ఆరంభంలో దూకుడుగా ఆడిన సింధు 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మారిన్ పుంజుకోవడంతో స్కోరు 17-16 అయింది. ఆపై సింధు, మారిన్ హోరీహారీగా పాయింట్లు రాబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో సింధు 21-19తో తొలి గేమ్Read More


ఆమెను మ‌రోసారి ఢీ కొడుతున్న సింధు

ఇండియన్ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌కు భారత స్టార్ షట్లర్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు తొలిసారగి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో 2013లో సెమీఫైనల్‌కు చేరడమే ఇప్పటివరకూ సింధు ఉత్తమ ప్రదర్శన. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో రెండో సీడ్‌ సుంగ్‌ జీ హున్‌ (దక్షిణ కొరియా) పై 21-18, 14-21, 21-14 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ గెలుపుతో సుంగ్‌ జీ హున్‌తో ముఖాముఖి పోరులో గెలుపోటముల రికార్డును 7–4తో సింధు మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 21–16, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సైనా నెహ్వాల్‌పై నెగ్గిన సింధు నేటి మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తొలిగేమ్‌లో ప్రత్యర్ధి సుంగ్‌ జీ హున్‌ నుంచి ప్రతిఘటనRead More


సైనాకి షాక్

ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్స్ మ‌ధ్య స‌మ‌రం ఆస‌క్తి రేపింది. అయితే సీనియ‌ర్ సైనాని సింధు ఖంగుతినిపించ‌డం ఆస‌క్తిక‌రం తొలిసారి. సింధుకి సైనాపై ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. ఇండియన్ ఓపెన్ సిరీస్ 2017 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధూ నెగ్గింది. దీంతో ఇండియన్ ఓపెన్ సిరీస్ ఉమెన్స్ సింగిల్స్‌లో సింధూ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది.


సింధుకి షాక్..!

భారీ అంచనాలతో డెన్మార్క్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన భారత షట్లర్‌ పీవీ సింధుకు రెండో రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఒలింపిక్‌ పతక విజేత సింధు 13-21, 23-21, 18-21తో సయాకా సాటో (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో సింధు తొలుత 1-3తో వెనుకబడినా ఆ తర్వాత పుంజుకుని 12-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సయాకా.. వరుసగా 7 పాయింట్లు సాధించి 21-13తో తొలిగేమ్‌ను కైవసం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో ఒక దశలో 10-15తో వెనుకబడినా.. సింధు పట్టు వదలకుండా పోరాడి 21-21తో స్కోరు సమం చేసింది. రెండు మ్యాచ్‌ పాయింట్లు కాచుకుని 23-21తో గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లోనూ పోరాటం నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే, 18-18తో స్కోరు సమమైనప్పుడు సాటో వరుసగాRead More