Main Menu

prabhas

 
 

ప్రభాస్ కి షాకిచ్చిన స‌ర్కార్

బాహుబ‌లి హీరోకి షాక్ త‌గిలింది. యంగ్ రెబ‌ల్ స్టార్ కి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు త‌ప్ప‌లేదు. ఈ టాలీవుడ్ ప్రముఖ హీరో గెస్ట్ హౌస్ సీజ్ చేశారు. ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయ‌డం విశేషంగా మారింది. హైద‌రాబాద్ స‌మీపంలోని రాయదుర్గం సర్వే నంబరు 46లోని 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా ఉన్న వివాదం సాగుతోంది. దానిపై తాజాగా సుప్రీంకోర్ట్ తీర్పు ఇవ్వ‌డంతో ఆ స‌మ‌స్య‌ తొలగిపోయింది. ఇది ప్రభుత్వ స్థలమేనంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సర్వే నంబరులో ప్రభాస్ 2,200 గజాల్లో గెస్ట్‌హౌస్ నిర్మించాడు. జీవో నంబరు 59 కింద దీనిని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభాస్ గెస్ట్‌హౌస్‌నుRead More


స్ట‌యిలిష్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్

పక్కా మాస్ మువీస్ తో మంచి ఇమేజ్ సంపాదించుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. త‌న‌దైన స్ట‌యిలిష్ మువీస్ చేస్తున్న ద‌ర్శ‌కుడు సుకుమార్ తో క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ‘రంగస్థలం’ తర్వాత మహేష్ కోసం సుకుమార్ ‘26’ కథ రెడీ చేస్తున్నాడు. స్క్రిప్టు రూపకల్పన కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ ‘మహర్షి’ చిత్రీకరణ పూర్తి చేసుకునే సమయానికి పూర్తిస్థాయి స్క్రిప్టుతో సుకుమార్ సిద్ధంగా ఉండాలన్నది కండిషన్. ఆ ప్రకారమే సుకుమార్ ఇప్పటికే కథ విషయమై చాలానే వర్క్ చేశాడు. ఈ నేపథ్యంలోనే సుక్కూ గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. నాన్నకు ప్రేమతో, రంగస్థలంలాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్ని అందించిన సుకుమార్ ఈసారి మహేష్‌తోపాటు ప్రభాస్‌తో సినిమా కు సిద్ద‌మ‌వుతున్నాడు. మహేష్ కథ రెడీ అవుతుండగానే, తరువాతRead More


ఆశ్చ‌ర్యంగా మారుతున్న ప్ర‌భాస్ బ‌రువు

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ అమాతంగా పెరిగిపోయింది. బాహుబ‌లి త‌ర్వాత దేశ‌మంతా కీర్తి వ‌చ్చేసింది. ఆ సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. దాంతో త‌దుప‌రి సినిమాలపై త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌స్తోంది. త్వ‌ర‌లో రాబోతున్న సినిమాలు ‘బాహుబలి’ రేంజ్‌కి తగ్గకుండా ఉండాల‌ని ఆశిస్తున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆహార్యంలో కూడా ప‌లుమార్పులు చేస్తున్నాడు. ప్ర‌ధానంగా బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరిగాడు ప్రభాస్. ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో మూవీ కోసం ఈ బరువును కంటిన్యూ చేస్తున్నాడు. పూర్తి స్థాయి టెక్నో మువీగా వ‌స్తున్న సాహోలో అదే రేంజ్ కొన‌సాగిస్తుండ‌డం విశేషం. కానీ దాని తర్వాత రాబోతున్న‌ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ మువీ కోసం మార్పులు త‌ప్పేలా లేవు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంభోత్స‌వానికిRead More


అర్జునుడిగా ఎంట్రీ ఇస్తున్న ప్ర‌భాస్!

బాహుబ‌లి సినిమాతో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ విశ్వ‌వ్యాప్తం అయ్యింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆద‌ర‌ణ పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌లు ఆఫ‌ర్లు వ‌చ్చినా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భాస్ అంగీక‌రించ‌లేదు. అయితే తాజాగా ఓ కీల‌క ప్రాజెక్టులో ప్ర‌ధాన భూమిక పోషించేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రస్తుతం ‘మహాభారతం 3డి’ సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో కలిసి అమీర్‌ఖాన్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా కోసం ఏకంగా పదేళ్లు కేటాయించాల్సి ఉంటుందని తన అంచనాగా వెల్లడించాడు. ఈ చిత్రంలో సల్మాన్, అమితాబ్, దీపిక పదుకొనె వంటి స్టార్లను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీపిక ద్రౌపది పాత్రలో నటిస్తుందని, అలానే అమీర్ కృష్ణుడిగా నటిస్తే,Read More


ప్ర‌భాస్ ప్రేమ క‌థ‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రేమ క‌థ ఆస‌క్తిగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో ప్రేమ‌క‌థ‌లు స‌క్సెస్ చేసుకున్న ప్ర‌బాస్ రియ‌ల్ లైఫ్ ప్రేమ క‌థ ఇప్పుడు హా్ టాపిక్ అవుతోంది. అదే స‌మ‌యంలో మ‌రో ప్రేమ‌క‌థ‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. అనుష్క‌- ప్ర‌భాస్ మ‌ధ్య‌ప్రేమాయ‌ణం గురించి పుంఖానుపుంఖాలు సాగిన ప్ర‌చారం పూర్తిగా తెర‌మ‌రుగు కాలేదు. ఈలోగానే మ‌రో ప్రేమ‌క‌థ‌తో ప్ర‌భాస్ సిద్ధ‌మ‌వుతుండ‌డం ఆస‌క్తి రేపుతోంది. ప్ర‌స్తుతం ఈ కండ‌ల‌వీరుడు సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నెక్ట్స్‌ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్‌. జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే సాహో పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలో కొత్తRead More


రెబ‌ల్ స్టార్ రైతు అయిపోతున్నాడు..

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ న‌యా రూపంలో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం దుబాయ్ లో సాహో’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం విదితమే. ఈ సంద‌ర్భంగానే ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోయిన్ శ్ర‌ద్ధాపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ‘సినిమాలో శ్రద్ధాకపూర్‌ది కీలక పాత్ర. సినిమా ఆమె పాత్రతోనే ప్రారంభమవుతుంది. సినిమా నడిచే కొద్ది శ్రద్ధా పాత్ర శక్తివంతంగా మారుతుంది. హిందీలో డైలాగులు చెప్పేటప్పుడు ఆమె రెండు మూడు టేక్‌లు తీసుకుంటోంది, కానీ తెలుగు డైలాగ్‌లు మాత్రం ఒకే టేక్‌లో చేస్తుంది. నాకు మాత్రం హిందీ మాట్లాడటం అంతగా రాదు. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నా చుట్టూ ఉండేవారితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగులు డైలాగ్‌లను ఎంతో ఉత్సాహంగా చెప్పగలను, కానీ హిందీ డైలాగులంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటుంది’ అని ప్రభాస్‌ చెప్పారు. బాలీవుడ్‌ నటీమణుల్లో దీపికా పదుకొనె,Read More


ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి మొద‌లు పెట్టి అనూహ్యంగా టాప్ హీరోలంద‌రి స‌రస‌న ఆమె అవ‌కాశాలు కొట్టేసింది. కానీ అవి చాలా స్వ‌ల్ప‌కాల‌మే అన్న‌ట్టుగా మారిపోయింది. ప్ర‌స్తుతం ఆమెకు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో హ‌ఠాత్తుగా హాలీవుడ్ వైపు కూడా మ‌ళ్లింది. అయినా పెద్ద‌గా ఫ‌లితం రాలేదు. దాంతో మ‌ళ్లీ టాలీవుడ్ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఓవైపు వ్యాపారాల‌తో ఆమె బిజీగా గ‌డుపుతున్నారు. హైద‌రాబాద్ లో త‌న పేరు మీదుగా ఇటీవ‌ల ఓ యాప్ ని కూడా విడుద‌ల చేశారు. అంత‌టితో సరిపెట్ట‌కుండా త‌న‌కు ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో క‌లిసి న‌టించాల‌ని ఉందంటూ త‌న కోరిక బ‌య‌ట‌పెట్టింది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రా అని ఆరాతీస్తే ఇంకెవ‌రు..యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటోందిRead More


ప్రభాస్ పూర్తిగా యూరప్ లోనే…

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడాల్సి వస్తోంది. బాహుబలి తర్వాత కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. సాహా మువీని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే ఈలోగానే కొత్త సినిమా ప్రారంభానికి ప్రభాస్ సిద్దమవుతుండడం కొంత ఆనందాన్నిచ్చే విషయం. సూజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సాహా మువీలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నిర్మాణ పనుల్లో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ డార్లింగ్‌ చేయబోయే చిత్రం ఏమిటన్నది స్పష్టత వచ్చేసింది. ఈ సారి ప్రభాస్ తన తదుపరి చిత్రం ఆయన సొంత బ్యానర్‌లో చేస్తున్నాడు. అదేనండీ… ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు ప్రొడక్షన్‌ గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఏప్రిల్‌ చివరి వారంలో చిత్రీకరణను లాంఛనంగా ప్రారంభించనున్నారు.Read More


అనుష్క గురించి ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్

బాహుబలి జంట ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. వారిద్దరి పెళ్లి గురించి చర్చ మొదలయిన తర్వాత జేజమ్మ వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఇద్దరూ చివరకు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి కనిపిస్తోంది. అందులోనూ బాలీవుడ్ అనుష్కను కోహ్లీ మనువాడిన నేపథ్యంలో టాలీవుడ్ అనుష్క కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ప్రభాస్ పెదనాన్న క్రుష్ణంరాజు కూడా ప్రభాస్ ఎవరినీ చెప్పినా పెళ్లి చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పేయడం అందుకు తోడ్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని జోష్ లో ముంచుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’లో బిజీగా ఉంటే, అనుష్క ‘భాగమతి’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. తాజాగా అనుష్క సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆ వెంటనే ప్రభాస్ ప్రత్యక్షమయ్యాడు.Read More


టాప్ 5లో ప్రభాస్

ఆశ్చర్యకర ఫలితం వెలువడింది. ప్రభాస్ కి అనూహ్య గౌరవం దక్కింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి స్థానం దక్కింది. దాంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఓ సర్వేలో ‘బాహుబలి’ చిత్రం మరోసారి బాలీవుడ్‌లో సత్తా చాటింది. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్ టాప్ స్టార్స్‌ను వెనక్కునెట్టి తొలి ఐదు స్థానాల్లో ఒకడిగా నిలచాడు ప్రభాస్. ‘బాహుబలి-2’ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన విషయం తెలిసిందే. వసూళ్ల రూపంలోనే కాదు,సర్వేల్లో కూడా ‘బాహుబలి’ సిరీస్ సత్తా చాటుతోంది. ఇటీవల ఇంటియాటుడే సంస్థ.. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 26% ఓట్లతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలచింది ‘బాహుబలి-2. ఇక బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ ‘షోలే’ రెండవRead More